రంగారెడ్డి

ఉప్పల్ కారిడార్ ఘనత మాదే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, మే 15: ఉప్పల్ పట్టణంలో ట్రాఫిక్ సమస్య నుంచి గట్టెక్కడానికి ఎట్టకేలకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. రూ.950కోట్ల వ్యయంతో చేపట్టనున్న నాలుగు లైన్ల కారిడార్‌తో పాటు రహదారి విస్తరణ, భూనిర్వాసితులకు కొత్త భూసేకరణ చట్టం మార్కెట్ రేట్ ప్రకారం నష్టపరిహారం చెల్లించేందుకు ఈ మొదటి ఆర్థిక సంవత్సరంలోనే నిధులను కేంద్రం విడుదల చేస్తుందని ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు. సోమవారం ఉప్పల్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఉప్పల్ నుంచి హైదరాబాద్ నగరం నడిబొడ్డుకు చేరుకోవడానికి సులువుగా చేరుకోవడానికి, హైదరాబాద్ నుంచి ఘట్‌కేసర్ వైపు త్వరితగతిన వెళ్ల్లేందుకు నిర్మించతలపెట్టిన ఎలివేటెడ్ కారిడార్ పనులు చేపట్టేందుకు అనుమతి ఇస్తూ నిధులు విడుదల చేయాలని అనేక సార్లు చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్ర మంత్రి గడ్కరీ స్పందించారని పేర్కొన్నారు. ఉప్పల్ రింగ్‌రోడ్డు నుంచి మేడిపల్లి సిపిఆర్‌ఐ నందవనం ఫారెస్టు వరకు 6.4కిలో మీటర్ల పొడువున నిర్మించబోయే కారిడార్ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఇలాంటి ప్రాజెక్టు ఎక్కడా చేపట్టిన దాఖలాలు లేవని, తొలి ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రమే నిధులన్నీ భరిస్తుందని, ఇది రికార్డ్ బ్రేక్ అని అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు వల్ల భూనిర్వాసితులందరికీ భూసేకరణ చట్టం ప్రకారం న్యాయం జరుగుతుందన్నారు. రహదారి విస్తరణ, సాంకేతిక అంశాలు, భూసేకరణ వంటి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన విషయంలో ఈ నెల 17వ తేదీ సాయంత్రం 4 గంటలకు జిహెచ్‌ఎంసి ఉప్పల్ సర్కిల్ కార్యాలయంలో ప్రజలు, ప్రముఖులు, అధికారులతో సమావేశం జరుగుతుందని తెలిపారు. ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సహకరించడం వల్ల సకాలంలో కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకున్నందుకు కేంద్ర మంత్రి గడ్కరీకి ఉప్పల్ నియోజకవర్గం ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. రహదారి విస్తరణపై వ్యాపారులు, ఇంటి యజమానులు ఎలాంటి అనుమానాలు పడొద్దని, గతంలో నిర్ణయించిన ప్రకారం 150 అడుగులు మాత్రమే విస్తరణ ఉంటుందన్నారు. ఎలివేటెడ్ కారిడార్ సకాలంలో పనులు పూర్తయితే ఉప్పల్ రూపురేఖలు మారుతాయాని వివరించారు. సమావేశంలో బిజెపి నాయకులు గొరిగె కృష్ణ, మంకాల లక్ష్మణ్, బొంగు రమేశ్ గౌడ్, రావుల బాలకృష్ణ గౌడ్, ఈగ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పల్లెల్లో పారిశుద్ధ్యం అధ్వాన్నం
రోగాల బారిన పడుతున్న జనం * నిద్రమత్తులో అధికార యంత్రాంగం
కొందుర్గు, మే 14: దేశాభివృద్ధికి పల్లెలే పట్టుకొమ్మలు.. ఆగ్రామాలను అభివృద్ధి చేయడంలో అధికార యంత్రాంగం నిద్రమత్తులో జోగుతోంది. పల్లెల్లో పారిశుద్ధ్యం లోపించి మురుగు నీరు రోడ్లపై పారుతూ దుర్వాసన వెదజల్లుతుంటే పట్టించుకునే నాథుడే లేకుండా పోయారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పారిశుద్ధ్య నివారణకు చర్యలు తీసుకోవాలని అనేక మార్లు ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగు కాలువలను ఎందుకు శుభ్రం చేయించడం లేదని, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఎందుకు నిర్మించడం లేదని ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తే పంచాయతీలో నిధులు లేవు..ఏమి చేయాలంటూ ప్రజాప్రతినిధులు చెబుతున్నారని ప్రజలు పేర్కొంటున్నారు. వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మురుగు కాలువలను శుభ్రం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి కేంద్రీకరించాలని పల్లె ప్రజలు కోరుతున్నారు. జిల్లేడ్ చౌదరిగూడ మండల పరిధిలోని తుమ్మపల్లి, లచ్చంపేట, చౌదరిగూడం, గుర్రంపల్లి, పెద్దఎల్కిచర్ల, చేగిరెడ్డిఘనపూర్, రావిర్యాల, ఎదిర గ్రామ పంచాయతీల్లో పారిశుద్ద్యం పనులు చేపట్టకపోవడంతో మురుగు కాలువలు ఎక్కడికక్కడే నిండిపోయాయి. కొందుర్గు మండల కేంద్రంతోపాటు చెరుకుపల్లి, విశ్వనాథ్‌పూర్, తంగళ్లపల్లి, ఆగిర్యాల, మహదేవ్‌పూర్, పర్వతాపూర్, ముట్పూర్, రేగడి చిల్కమర్రి గ్రామాలలో పారిశుద్ద్యం పనులు చేపట్టక పోవడంతో దోమలు, ఈగలు వ్యాప్తి చెంది అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగు కాలువలో నీరు నిల్వ ఉండడంతో ఇళ్లలోకి దుర్వాసన వెదజల్లుతుందని ప్రజలు పేర్కొంటున్నారు.