రంగారెడ్డి

పేదల జీవితాల్లో మార్పే అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జూన్ 5: హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ భూముల్లో పేదలకు చిన్నచిన్న ఉప నగరాలు (శాటిలైట్ టౌన్‌షిప్‌లు) నిర్మించి అక్కడే చిన్నచిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని టిజెఎసి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. జగద్గిరిగుట్ట సిపిఐ కార్యాలయ ఆవరణలో సోమవారం మేడ్చల్ జిల్లా సమగ్రాభివృద్ధి సదస్సు సిపిఐ జిల్లా కార్యదర్శి ఐలయ్య అధ్యక్షతన జరిగింది. సదస్సుకు కోదండరామ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా గుబురుగుట్టలోని అంబేద్కర్ విగ్రహానికి, ఔట్‌పోస్ట్ వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం సదస్సులో కోదండరామ్ మాట్లాడుతూ అభివృద్ధి అంటే ప్రజల జీవితాల్లో మార్పులు రావాలని, అది రానంత వరకు జరిగే అభివృద్ధి అభివృద్ధి కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అతివేగంగా అభివృద్ధి చెందుతుందని, ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం తరుచుగా చేస్తున్న ప్రకటనలపై మండిపడ్డారు. విదేశీ కంపెనీలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భూములను దారాదత్తం చేయడమే అభివృద్ధా అని ప్రశ్నించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గడిచిన మూడు సంవత్సరాలలో చాలా అభివృద్ధి సాధించామని, ఆదాయం పెరిగిందని చెబుతున్నప్పటికీ ఎంత పెరిగినా ప్రజల జీవితాల్లో ఏమైనా మార్పు కన్పించిందా, ఎంత మంది జీతాలు పెరిగాయని, ఎన్ని పరిశ్రమలొచ్చాయని, ఎంతమందికి ఉపాధి అవకాశాలొచ్చాయని ప్రశ్నించారు. ప్రభుత్వం చెబుతున్న ఈ అభివృద్ధి, పెరుగుదల సామాన్యులకు దక్కడం లేదని, అభివృద్ధి ఎక్కడో జరుగుతుందని, ప్రజలకు లాభం జరిగే అభివృద్ధిని కోరుకోవాలని అన్నారు. వాస్తవానికి గడిచిన మూడు సంవత్సరాలలో వ్యవసాయ రంగం బాగా నష్టపోయి రైతులకు ఎలాంటి లాభం వాటిల్లలేదని చెప్పారు.
రాష్ట్రంలో బ్యాంకు శాఖలు పెరిగాయి కానీ సామాన్యులకు రుణాలు రావు, రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగింది కానీ ఇళ్ల స్థలాలు ఇవ్వరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను జిల్లాల వారీగా అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఓ వైపు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరో వైపు అన్యాక్రాంతం చేస్తున్నారని, చివరికి అసైన్డ్ భూములు, భూదాన భూములనూ వదలడం లేరని ధ్వజమెత్తారు. మేడ్చల్ జిల్లాకు ఓ ప్రత్యేకత ఉందని, ఈ జిల్లాలో పట్టణీకరణ ఎక్కువ, గ్రామీణ ప్రాంతం తక్కువగా ఉందని అన్నారు. రాజధాని హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాల్లోని ప్రభుత్వ భూముల్లో చిన్న చిన్న ఉప నగరాలు సకల సౌకర్యాలతో పేద ప్రజలకు నిర్మించి అక్కడే చిన్నతరహా పరిశ్రమలను ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా పనికిరాని కథలు, ముచ్చట్లు చెప్పడం మానుకుని పనిచేసి చూపించాలని ప్రభుత్వానికి సూచించారు. నగరంలో ధర్నాలు చేస్తున్నారని ధర్నాచౌక్ లేకుండా చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. తమ ఓట్లతో పుట్టిన ప్రభుత్వాన్ని అడిగే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, మేడ్చల్ జిల్లాను నందనవనంగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు అజీజ్ పాషా మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రగతిభవన్ పేరుతో పెద్ద ఇళ్లు కట్టుకొని ఇక అందరికి ఇళ్లు కట్టించేశామని భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. పేద ప్రజలు 40 గజాల స్థలాన్ని ఇళ్ల కోసం అడుగుతున్నా ఇవ్వకుండా వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతుంటే చూసీచూడనట్లుగా వ్యవహరిస్తూ ర్ వచ్చే ఎన్నికల్లో మళ్లీ టిఆర్‌ఎస్ గెలుస్తుందని పగటి కలలు కంటున్నారని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ నేతలు బాలమల్లేశ్, రవి, ఏసురత్నం, వరమ్మ, వెంకటేశం పాల్గొన్నారు.