రంగారెడ్డి

ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నత ప్రమాణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, జూన్ 17: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఉన్నతమైన విద్యా ప్రమాణాలతో కూడిన విద్యను అందించటమే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలలను మెరుగు పరుస్తున్నట్లు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎం వి రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రొఫేసర్ జయశంకర్ బడిబాట ముగింపు కార్యక్రమంలో శనివారం ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. పాఠశాల ఆవరణలో మొక్కలను నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సంపూర్ణ అక్షరాస్యత దిశగా పేద విద్యార్థులందరికీ నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బడిఈడు పిల్లలందరు పాఠశాలలలోనే ఉండాలని, పిల్లలను చదివించలేని వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థికి పాఠ్య పుస్తకాలు, స్కూల్ డ్రెస్సులు, మధ్యాహ్న భోజన సదుపాయాలు ఉచితంగా ఉంటాయన్నారు. తెలుగుతో పాటు అంగ్ల విద్యా బోధన ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల పని తీరును పూర్తిగా మెరుగు పరిచేందుకు అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. అధికారులు, ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మిడియా ప్రతినిధులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలలో చేర్పించాలని కోరారు. దీంతో పాఠశాలల విద్యా బోధన పట్ల మరింత శ్రద్ధ పెరుగుతుందన్నారు. చదివించలేని పేదవారు గురుకుల పాఠశాలలో చేర్పించాలని సూచించారు. విద్యార్థిని, విద్యార్థులు ఉన్నతమైన ఆశయాన్ని ఎంచుకుని పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. దింతో తల్లిదండ్రులు, చదువు నేర్పిన ఉపాధ్యాయులు గర్విస్తారని చెప్పారు. చదువుకున్న ప్రతి ఒక్కరు ఉత్తమ పలితాలు అందుకుంటారని సూచించారు. ఈ విద్యా సంవత్సరం మేడ్చల్ జిల్లాను 100 శాతం అక్షరాస్యతను తీసుకురావటంతో రాష్ట్రంలోనే ఉత్తమ పలితాలు అందుకునేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్యాబోధన, డిజిటల్ తరగతులు వంటి వసతులను కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా విద్యాధికారి ఉషారాణి, కీసర ఆర్డీఓ హన్మంత్‌రెడ్డి, మండల విద్యాధికారి నర్సింహా రెడ్డి, ఎంపిడిఓ కల్వకుంట్ల శోభ, తహశీల్దార్ శ్రీ్ధర్, సర్పంచ్ అబ్బసాని యాదగిరియాదవ్, ఎంపిటిసిలు మేకల నర్సింగ్‌రావు, బేతాల నర్సింగ్‌రావు, మండల పరిషత్ విస్తరణాధికారి సునంద, ప్రధానోపాధ్యాయులు రావుఫ్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ఫోలీసుల సహకారంతో
మానసిక వ్యాధి నుంచి విముక్తి
*అబలను కుటుంబానికి అప్పగించిన పోలీసులు, లీగల్‌సెల్
రాజేంద్రనగర్, జూన్ 17: మానసిక వ్యాధితో బాధపడుతూ పదేళ్ల అనంతరం ఓ బాలిక పోలీసులు, లీగల్ సెల్ సహకారంతో కుటుంబాన్ని తిరిగి కలిసింది. రాజేంద్రనగర్ ఎసిపి గంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రం హాజీపూర్ ప్రాంతానికి చెందిన రేణు. పదేళ్ల క్రితం తన భర్త కొట్టడంతో ఇంటి నుంచి భర్తకు భయపడి బయటకు వెళ్లిపోయింది. మానసికంగా కుంగిపోయి గుజరాత్ గాంధీనగర్‌కు వెళ్లింది. రోడ్లపై తిరుగుతూ డిసెంబర్ 2014లో అరాంఘర్‌లో అర్ధరాత్రి రోడ్డుపై సంచరిస్తుండగా పెట్రోలింగ్ పోలీసులు గమనించి ఆమెను మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చారు. మానసిక వ్యాధితో బాధపడుతుండడంతో ఆమెను అరాంఘర్‌లోని మానసిక వికలాంగుల కేంద్రంలో చేర్పించారు. గత నెల 30న రేణు ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో మానసిక వికలాంగుల కేంద్రం నిర్వాహకులు గొలుసులతో బంధించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు లీగల్ సర్వీసు అథారిటీ అడ్వైజర్ సుభాషిణి సహకారంతో రేణును విడిపించి హైదర్‌షాకోట్‌లోని కస్తూర్భా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్‌లో చేర్పించారు. ట్రస్ట్ నిర్వాహకులు రేణును ఆదరించి బంజారాహిల్స్‌లోని ఆశా ఆసుపత్రిలో చికిత్సను చేయించారు. ఈనెల 10న రేణు పూర్తిగా కోలుకుంది. తన జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలను పోలీసులకు వివరించింది. దీంతో పోలీసులు లీగల్ సెల్ ఆధ్వర్యంలో బీహార్‌లోని లీగల్ సెల్ సహకారంతో రేణు కుటుంబానికి ఆమె అప్పగించారు. రేణును పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన పెట్రోలింగ్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.