రంగారెడ్డి

భవిష్యత్ తరాలకు ఉపయోగపడే పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, మే 30: గత ప్రభుత్వాల అభివృద్ధి పనులు మొక్కుబడిగా చేపట్టగా, తమ ప్రభుత్వం భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా పనులు చేపడుతోందని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని పుల్సుమామిడి గ్రామ సమీపంలో, పట్టణంలోని శివారెడ్డిపేట ఫిల్టర్‌బెడ్ వద్ద మిషన్ భగీరథ వాటర్‌గ్రిడ్‌కు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ చెరువు పూడికతీత పనులకు గత ప్రభుత్వాలు ఐదు నుండి 10 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకునేవని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలోని 46 వేల చెరువుల పనరుద్దరణకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని చెప్పారు. ఇంటింటికి నల్లా ద్వారా నీరు ఇచ్చే మిషన్ భగీరథ వాటర్‌గ్రిడ్ పథకాన్ని రంగారెడ్డి జిల్లాలో రెండు వేల కోట్ల రూపాయలతో చేపట్టనున్నట్లు తెలిపారు. వికారాబాద్ నియోజకవర్గంలో 350, తాండూర్‌లో 345, పరిగిలో 350 కోట్ల రూపాయలతో వాటర్‌గ్రిడ్ పథకాన్ని చేపడుతున్నట్లు వివరించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా మహిళలకు ఇబ్బందులు కలగకుండా వాటర్‌గ్రిడ్ పథకాన్ని చేపడుతున్నామని అన్నారు. ఇతర రాష్ట్రాల సిఎంలు పథకాన్ని హర్షిస్తున్నారని చెప్పారు. జిల్లాలో కాకతీయ మిషన్ కింద 1145 చెరువుల పునరుద్దరణను 368 కోట్ల రూపాయలతో చేపడుతున్నట్లు పేర్కొన్నారు. వర్షాలు కురిస్తే చెరువులు నీటితో కళకళలాడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలో అర్‌అండ్‌బి రోడ్ల అభివృద్ధికి రెండు వేల కోట్లు, పంచాయతిరాజ్ రోడ్లకు 900 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. బ్రిడ్జిల నిర్మాణంతో పాటు శిథిలావస్థకు చేరిన రోడ్లను రీబిటి చేశారని వివరించారు. కార్యక్రమంలో వికారాబాద్, చేవెళ్ళ శాసనసభ్యులు బి.సంజీవరావు, కె.యాదయ్య, ఎంపిపి ఎస్.్భగ్యలక్ష్మి, జడ్పిటిసి ముత్తహర్‌షరీఫ్, పుల్సుమామిడి సర్పంచ్ గౌసియాబి, ఎంపిటిసి మల్లేశం, వాటర్‌గ్రిడ్ ఇఇ ఆంజనేయులు, డిఇఇ నాగేశ్వర్‌రావులు పాల్గొన్నారు.