రంగారెడ్డి

పత్తి వేయాలా? వద్దా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జూన్ 3: ఈ ఏడాది రైతులు పత్తి పంట సాగును తగ్గించాలని ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు వేసుకోవాలని ప్రభుత్వం కోరుతుండగా, పత్తి విత్తనాలు కంపెనీలు రైతులను సందిగ్ధంలో పడేసే విధంగా పత్తిపంట సాగుచేస్తేనే లాభాలు అంటూ ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇటు ప్రభుత్వం, అటు పత్తి విత్తన కంపెనీల ప్రచారంతో రైతులు సందిగ్ధంలో పడుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం, పత్తి పంట సాగు చేస్తున్న రైతులు నష్టపోతున్న తరుణంలో ప్రభుత్వం రైతుల మేలును కోరి ఈసారి పత్తి పంట సాగు చేయరాదని ప్రత్యామ్నాయంగా సోయాబీన్, పప్పుదినుసుల పంటలు సాగు చేయాలని అవగాహన కల్పించింది. ఇటీవలే వ్యవసాయ శాఖ నిర్వహించిన మనతెలంగాణ-మన వ్యవసాయంలో భాగంగా గ్రామ గ్రామాన నిర్వహించిన రైతు అవగాహన సదస్సుల్లో అధికారులు, శాస్తవ్రేత్తలు పత్తి పంట సాగు చేయరాదని రైతులకు సూచించారు. సదస్సులు ముగిసిన అనంతరం గ్రామాలకు రకరకాలైన వాహనాలు, ఫ్లెక్సీలు, మినీ విడియో స్క్రీన్‌లతో వెళుతున్న పత్తి విత్తనాల కంపెనీలు పత్తిపంట సాగు చేస్తే లాభాల మీద లాభాలు పొందుతారని, కోటీశ్వరులవుతారని పత్తిపంట సాగుకు ప్రోత్సహించే విధంగా హైటెక్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. దీనికితోడు ఏ చానల్ పెట్టినా, ఏ సినిమాకు వెళ్ళినా పత్తి విత్తనాల కంపెనీల అడ్వర్టైజ్‌మెంట్ కనిపించడంతో రైతన్న ఆకర్షితుడై ఏంట సాగు చేయాలోనని సందిగ్ధంలో పడుతున్నాడు. ఇక ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలిచే సమాచార శాఖ గ్రామాల్లోకి వెళ్ళి పత్తి పంటకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించడంలో, కళాజాత సారథులతో ప్రచారం చేయించడంలో పూర్తిగా విఫలమైంది. ఇప్పటికైనా పత్తి విత్తనాల కంపెనీల ప్రచారాన్ని తలదనే్న విధంగా విధంగా సమాచార పౌర సంబంధాల శాఖ ప్రచారం నిర్వహిస్తే ప్రభుత్వం రైతులు మేలు చేసిందవుతుంది తప్ప స్పందించకుంటే రైతులు పత్తి విత్తనాల కంపెనీల చేతుల్లో మోసపోక తప్పదు. అలా సాధ్యం కాకపోతే ప్రభుత్వమే నేరుగా పత్తి విత్తనాల కంపెనీలను విచ్చలవిడిగా ప్రచారం చేయకుండా కట్టడి చేయాల్సిన అవసరముందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.