రంగారెడ్డి

వాసవీనగర్‌లో ఖాళీ స్థలం కబ్జాకు యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జూన్ 13: ఖాళీ స్థలం కన్పించే చాలు కబ్జా చేయడం కబ్జాదారులకు అలవాటైపోతోంది. విలువైన స్థలాలను ఫోర్జరీ సంతకాలతో డాక్యుమెంట్లు సృష్టించి కబ్జాచేసి ఇతరులకు అమ్ముకుంటూ కోట్లకు పడగలెత్తుతున్నారు. రాజకీయ నేతల అండదండలతో యథేచ్ఛగా జరుగుతున్న అక్రమ ప్లాట్ల వ్యాపారాన్ని అడ్డుకునే నాథుడే కరువయ్యారని ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే చిల్కానగర్ డివిజన్‌లోని గణేష్‌నగర్, కళ్యాణపురి, సరస్వతికాలనీ, చిల్కానగర్, ఆదర్శనగర్, సాయిరాంనగర్, రాఘవేందర్‌కాలనీలో ఖాళీ స్థలాలు కబ్జాదారుల కోరల్లో కనుమరుగవుతున్నాయి. తాజాగా రామంతాపూర్ వాసవీనగర్‌లో రూ.50లక్షల విలువైన స్థలాన్ని కొందరు కబ్జాచేయడానికి కనే్నశారు. ఇళ్ల మధ్య ఖాళీగా ఏళ్లతరబడి ఖాళీగా ఉన్న స్థలం యజమాని ఎక్కడున్నాడో ఏమోకాని ఇతరులు నకిలీ డ్యాక్యుమెంట్ సృష్టించి కబ్జా చేయడానికి పథకం రూపొందించారు. ఈ విషయం తెలుసుకున్న కాలనీ ప్రజలు.. ప్లాటు అసలు యజమాని లేకపోతే ప్రజాప్రయోజనాల దృశ్యా రక్షించుకోవాలని ఏకమై బోర్డును ఏర్పాటు చేశారు. స్థలాన్ని కబ్జాచేయకుండా రక్షించాలని జిహెచ్‌ఎంసి ఉప్పల్ డిప్యూటీ కమిషనర్, పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.