రంగారెడ్డి

అక్షరాస్యతను మహోద్యమంలా నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, జూన్ 13: సంపూర్ణ అక్షరాస్యతను ప్రతి ఒక్కరూ మహోద్యమంలా నిర్వహించాలని మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి అన్నారు. మండల పరిధి ప్రతాపసింగారం, అవుషాపూర్ గ్రామాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. బడీడు పిల్లలను ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, ఎంపిపి బండారి శ్రీనివాస్‌గౌడ్, జడ్పీటిసి మంద సంజీవరెడ్డి ఒడిలో కూర్చోపెట్టుకుని పలకలపై ఓనమాలు దిద్దించారు. తెలంగాణ రాష్ట్రంలో వంద శాతం అక్షరాస్యతను సాధించే దిశగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మండలంలోని 11 పాఠశాలల్లో ఆంగ్ల విద్యను బోధించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపిపి బండారి శ్రీనివాస్‌గౌడ్, జడ్పీటిసి మంద సంజీవరెడ్డి, ఎంపిపి కల్వకుంట్ల శోభ, తహశీల్దార్ విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచ్ బాషగళ్ల ఆండాలు, పాల్గొన్నారు. చౌదరిగూడలో సర్పంచ్ నక్క వరలక్ష్మి, అన్నోజిగూడలో పోచారం సర్పంచ్ గాంధారి లక్ష్మినారాయణ, ఏదులాబాద్ సర్పంచ్ మూసి శంకర్, ఘట్‌కేసర్ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్, ఎన్‌ఎఫ్‌సినగర్ సర్పంచ్ స్టివెన్, అవుషాపూర్ సర్పంచ్ పెద్దోళ్ల రమేశ్.. బడిబాట కార్యక్రమంలో పాల్గొని పిల్లలచే అక్షరాలు దిద్దించారు.
ప్రైవేటు బడులకు స్వస్తి పలకాలి
మంచాల: ప్రైవేటు బడులకు స్వస్తిపలికి మెరుగైన విద్యనందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని మండల పరిషత్ అధ్యక్షుడు మర్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. ఇబ్రహీంపట్నం మండలం చర్లపటేల్‌గూడలో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపిపి మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో ప్రమాణాలతో కూడిన మెరుగైన విద్యనందిస్తున్నట్లు చెప్పారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో నాణ్యతలేని విద్యనందిస్తున్నారని వాటిల్లో పిల్లల్ని చేర్పించి మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు సంస్కారం అంటే తెలుసుందని, ప్రైవేటులో అది దొరకదని అన్నారు. తల్లిదండ్రులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. మాజీ విఆర్‌ఓ శ్రీరాంరెడ్డి, కంబాలపల్లి హన్మంత్‌రెడ్డి, కళ్ళెం పెంటారెడ్డి పాఠశాలకు సుమారు 2 లక్షల రూపాయలు ఆధునీకరణ నిమిత్తం సహాయం చేశారు. ఎంఇఓ వెంకట్‌రెడ్డి, సర్పంచ్ గణేష్, ఎంపిటిసి లక్ష్మయ్య, మాజీ ఎంపిటిసి మైసయ్య పాల్గొన్నారు.