రంగారెడ్డి

క్రీడలను ప్రోత్సహిస్తున్న సైబరాబాద్ పోలీసులు: సానియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, ఏప్రిల్ 15: క్రీడలను ప్రోత్సహించడంతోపాటు పోలీసు విభాగంలో క్రీడాకారులను తయారు చేయడానికి సైబరాబాద్ పోలీసులు కృషి చేస్తున్నారని టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా కొనియాడారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్, టెన్నిస్ కోర్డులను ప్రారంభించారు. పోలీస్ కమిషనర్ ఆనంద్ క్రీడాకారుడే కావడంతో క్రీడలకు ప్రాధన్యత ఇచ్చి సిబ్బందిని క్రీడాకారులుగా మారుస్తున్నారని అన్నారు. టెన్నిస్ కోర్టులో 11లేయర్లను నిర్మించడం నగరంలో మొదటిసారి అని అభినందించారు. మానసిక ఉల్లాసంతోపాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని క్రీడలు అందిస్తామని చెప్పారు. సిపి ఆనంద్ మాట్లాడుతూ భవిష్యత్‌లో సైబరాబాద్ కమిషనరేట్ పేరుతో టోర్నమెంట్ నిర్వహించి ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. సానియా మిర్జాతో కొంతసేపు టెన్నిస్ ఆడారు. కార్యక్రమంలో మాదాపూర్ డిసిపి కార్తికేయ, శంషాబాద్ డిసిపి ఎఆర్ శ్రీనివాస్, క్రైం డిసిపి నవీన్‌కుమార్ పాల్గొన్నారు.