రంగారెడ్డి

నకిలీ బంగారం విక్రయానికి యత్నం.. ఇద్దరి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, జూలై 22: ఓ బంగారం దుకాణంలో నకిలీ బంగారాన్ని విక్రయించడానికి ప్రయత్నించి పట్టుబడిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడ్‌బన్‌కాలపత్తర్ ప్రాంతానికి చెందిన షేక్ అబ్దుల్ అజీజ్ సోదరి రుబియాబేగం కలిసి ఈజీమనీ కోసం ప్రయత్నిస్తున్నారు. కాగా ఈ తరుణంలో శుక్రవారం శాస్ర్తిపురంలోని జగదాంబ జువెల్లరి షాపుకు వెళ్లి తమ వద్ద 5 తులాల బంగారం ఉందని, విక్రయిస్తామని యజమానితో నమ్మబలికారు. ముందుగా ఒరిజినల్ బంగారం ఇచ్చారు. ఆ బంగారాన్ని యజమాని తూకం వేసి నకిలీదా ఒరిజినల్ అని తెలుసుకున్నాడు. ఒరిజినల్ బంగారం అని తేలడంతో బంగారానికి రూ.69 వేలను ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఇదే అదునుగా భావించి ఒరిజినల్ బంగారాన్ని తీసుకొని అదే ఆకారంతో కూడిన నకిలీ బంగారాన్ని యజమాని చేతుల్లో పెట్టాడు. ఇదిగమనించిన యజమాని వెంటనే పట్టుకొని పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని వారివద్ద ఉన్న ద్విచక్ర వాహనం, ఒరిజినల్, నకిలీ బంగారాన్ని స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.
మరో సంఘటనలో ......
స్క్రాప్ దుకాణంలో ఎవరూ లేని సమయంలో నగదు ఎత్తుకెళ్లిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముస్త్ఫానగర్ ప్రాంతానికి చెందిన కంజి చంద్రశేఖర్, కమాలి ఆనంద్, పటేల్ నరేష్ ముగ్గురు స్నేహితులు. మధ్యాహ్నం సమయంలో స్క్రాప్ దుకాణానికి వెళ్లి వస్తువులు బేరసారాలు చేస్తారు.
యజమానులను మాటల్లో పెట్టి తెరిచిన డ్రాలో నుంచి డబ్బులు ఎత్తుకెళ్తుంటారు. ఈ తరుణంలో ఈనెల 20వతేదిన ముస్త్ఫానగర్‌లోని ఓ స్క్రాప్ దుకాణంలో రూ.68 వేలు దొంగిలించారు. విషయం గ్రహించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. కాగా కంజి చంద్రశేఖర్ నివాసంలో రూ.32 వేల నగదు స్వాధీనం చేసుకొని వారిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.