రంగారెడ్డి

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, జూలై 26: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రథమ ఉపకులపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ ప్రవీణ్‌రావును మంగళవారం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వర్సిటీలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జి.రాజు, ఉద్యోగులు నరేందర్, భాస్కర్, ఏ.సురేష్, కిషోర్, శేఖర్, సురేష్, మధు, రామకృష్ణ, అంజయ్య, రాజేందర్ తదితరులు ఉన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ ప్రవీణ్‌రావును మంగళవారం నాన్ టీచింగ్ పెన్షనర్స్ స్టేట్ జనరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వీసీ ప్రవీణ్‌రావుకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాకప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారికి ప్రవీణ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. సన్మానించిన వారిలో సంఘం అధ్యక్షుడు ఎస్.పెంటయ్య, వీ.ప్రతాప్‌రెడ్డి, ఎం.నాగులు, ఏ.శేఖర్‌రెడ్డి, జీ.కృష్ణ, టి.వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.