రంగారెడ్డి

కళాశాలకు భవనం లేక డిగ్రీ విద్యార్థుల ఇక్కట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, జూలై 26: శేరిలింగంపల్లిలోని డిగ్రీ కళాశాలకు స్వంత భవనం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ విన్నవించారు. బిహెచ్‌ఇఎల్ టౌన్‌షిప్‌లోని జూనియర్ కళాశాల భవనంలోకేవలం రెండు గదుల్లోనే డిగ్రీ కళాశాల నిర్వహిస్తున్నందున విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని మంగళవారం డిప్యూటీ సిఎంను కలిసి వివరించారు. భెల్ యాజమాన్యంతో మాట్లాడి ఖాళీగా ఉన్న పాఠశాల భవనాన్ని తాత్కాలికంగా కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. శాశ్వత భవన నిర్మాణానికు ప్రభుత్వ స్థలం కేటాయించి, నిధులు మంజూరు చేయాలని చెప్పారు.. రాయదుర్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తగినంత సిబ్బందిని కేటాయించాని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
డిజిటల్ లిటరసీ
సైయెంట్ (ఇన్ఫోటెక్) సాఫ్ట్‌వేర్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ పరిజ్ఞానం కల్పించేందుకు డిజిటల్ లిటరసీ పేరుతో ఓ కార్యక్రమం రూపొందించిందని ఉప ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని 71 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ లిటరసీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సైయెంట్ సంస్థ ప్రతినిధి అశోక్‌రెడ్డి వివరించారు. డిజిటల్ లిటరసీ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఆహ్వానించాలని ఎమ్మెల్యే కోరారు. డిప్యూటీ సిఎంను కలిసినవారిలో ప్రభుత్వ కోఆర్డినేటర్ నాగరాజు, సైయెంట్ ప్రతినిధులు ఉన్నారు.