రంగారెడ్డి

అకుంఠిత దీక్షతో హరితహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, జూలై 26: హరితహారం కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ అకుంఠిత దీక్షతో విజయవంతం చేయాలని మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మండల పరిధి అన్నోజిగూడ గ్రామంలోని శ్రీ సాయిశంకర గ్యాస్ ఏజెన్సీ ఆవరణలో మంగళవారం జరిగిన హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మొక్కలను నాటారు. భావితరాల ప్రజలకు ఉజ్వల భవిష్యత్‌ను అందించేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ మహోద్యమంలా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో ప్రతి ఒక్కరూ కార్యోన్ముఖులు కావాలన్నారు. గ్రామాలలో నాటిన మొక్కలను పరిరక్షించే బాధ్యతను పంచాయతీలు విస్మరించరాదని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు పెరిగే వరకు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. వర్షాలు సమృద్ధిగా పడుతున్నందున జాగ్రత్తలు తీసుకుంటే నాటిన మొక్కలన్నీ వృక్షాలుగా మారి తెలంగాణ రాష్ట్రంలో వనసంపద పెరుగుతుందన్నారు. హరితహారంలో ప్రజల భాగస్వామ్యం తప్పకుండా ఉండాలని, మహిళలు హరితహారాన్ని విజయవంతం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. జిల్లా పౌరసరఫరాల అధికారి గౌరీశంకర్, ఏఎస్‌ఓలు దీప్తి, విజయ, మండల తహశీల్దార్ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపిడిఓ కల్వకుంట్ల శోభ, పోచారం సర్పంచ్ గాంధారి లక్ష్మినారాయణ, ఉప సర్పంచ్ ఆకిటి బాల్‌రెడ్డి, టిఆర్‌ఎస్ మండల కార్యదర్శి కందుల కుమార్, ఉపాధ్యక్షుడు బొక్క ప్రభాకర్‌రెడ్డి, యువజన విభాగం మండల శాఖ అధ్యక్షుడు బోయపల్లి కొండల్‌రెడ్డి, మండల నాయకుడు బద్దం జగన్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు
హరితహారం కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తున్న అధికారులపై కఠినచర్యలు తప్పవని జిల్లా పంచాయతీ అధికారి అరుణ హెచ్చరించారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ సమావేశం హాలులో మంగళవారం హరితహారం కార్యక్రమంపై జరిగిన మండల స్థాయి అధికారుల సమీక్షా సమావేశంలో డిపిఓ అరుణ పాల్గొన్నారు. ఘట్‌కేసర్ మండలంలోని 16గ్రామాలలో ఆరులక్షల 40 వేల మొక్కలు నాటాల్సి ఉండగా కేవలం 63 వేలు మాత్రమే నాటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు అధికారులు పనిచేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. అరకొరగా నాటిన మొక్కలకు కనీస రక్షణను ఎందుకు ఏర్పాటు చేయలేదని అధికారులను అడిగారు. నాటిన మొక్కలకు ట్రీ గార్డులు అమర్చలేని పరిస్థితులలో కంపచెట్లను రక్షణగా పెట్టాలని గతంలోనే సూచించినట్టు గుర్తు చేశారు. ఆదాయం ఎక్కువగా ఉన్న పోచారం, చౌదరిగూడ గ్రామాలలో మొక్కలకు ట్రీ గార్డులు ఎందుకు ఏర్పాటు చేయలేదన్నారు. అధికారులు శ్రద్ధ వహించకుండా పంచాయతీ సిబ్బంది, బిల్ కలెక్టర్లకు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారని చెప్పారు. ఇకనైనా మొక్కలు నాటడంలో అనుకున్న లక్ష్యాన్ని సాదించాలని, నాటిన మొక్కలను కాపాడేందుకు జాగ్రత్తలు పాటించాలన్నారు. హరితహారం ప్రారంభం నుండి నాటిన మొక్కల వివరాలు తన వద్ద ఉన్నాయని, అధికారులు చేపట్టిన కార్యక్రమ వివరాలను తనకు సాయంత్రం లోగా అందజేయాలన్నారు. వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా వివరాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. హరితహారం కార్యక్రమం అమలుపై స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కార్యదర్శులు ప్రతి రోజూ సమావేశాలు ఎర్పాటు చేయాలన్నారు. గ్రామాలలోని ప్రతి ఒక్కరినీ హరితహారం కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపిడిఓ కల్వకుంట్ల శోభ పాల్గొన్నారు.
మొక్కలను పిల్లల్లా పెంచాలి
శేరిలింగంపల్లి: ఇంటింటికి మొక్కలు నాటి సొంత పిల్లలుగా పెంచుకోవాలని చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవతరెడ్డి కోరారు. హరితహారంలో భాగంగా మంగళవారం శంకర్‌నగర్‌లో ఇంటింటికీ తిరిగి మహిళలకు బొట్టుపెట్టి మొక్కలు అందజేశారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని మొక్కలు నాటి వాటిని కుటుంబ సభ్యులుగా చూసుకోవాలని కార్పొరేటర్ సూచించారు. నాటిన మొక్కలు వృక్షాలుగా పెరిగి ఒక తోడుగా నిలుస్తాయని చెప్పారు. ఎక్కువ సంఖ్యలో మొక్కలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఔషధ మొక్కలు కూడా అందజేస్తామని కార్పొరేటర్ తెలిపారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు మేఘమాల, సులోచన, ఆశారెడ్డి, పార్వతి, సుమ, భారతి, ప్రశాంత్, నరుూమ్, రామారావు, సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.
మన్సురాబాద్‌లో..
వనస్థలిపురం: రాష్ట్రప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రజలు ముందుకు రావాలని మన్సురాబాద్ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి పిలుపునిచ్చారు. శ్రీరామ్‌నగర్ కాలనీలోని నాగార్జున ఐఐటి కానె్సప్ట్, ఐఐటి ఒలింపియాడ్ పాఠశాల నిర్వహించిన మెక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హజరయ్యారు. విద్యార్థులతో కలిసి పాఠశాల ప్రాంగణంలో మెక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. నాటిన ప్రతి మెక్క సంరక్షణను బాధ్యతగా స్వీకరించాలని అన్నారు. నాగార్జున విద్యా సంస్థల చైర్మన్ గుమ్మికొండ విఠల్‌రెడ్డి మాట్లాడుతూ తమ విద్యా సంస్థలలో మెక్కల పెంపకం పై విద్యార్దులకు చక్కటి అగహన కల్పిస్తూ ఎన్నో మెక్కలను నాటి పెద్ద చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కె.ఆనంద్ కుమార్, ప్రిన్సిపల్ బిసి స్వర్ణకుమారీ, టిఆర్‌ఎస్ నాయకుడు టంగుటూరి నాగరాజు పాల్గొన్నారు.
ఆల్విన్‌కాలనీలో..
కెపిహెచ్‌బికాలనీ: మొక్కలను నాటి సంరక్షిస్తే అవి భావితరాలకు ఎంతగానో ఉపయోగపడుతాయని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. మంగళవారం ఆల్విన్‌కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ చెరువు వద్ద జరిగిన హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మొక్కలను నాటారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలను నాటాల్సిందిగా సూచించారు. మొక్కలను నాటి వాటిని సంరక్షిస్తే అవి మనల్ని, మన భావితరాల్ని రక్షిస్తాయని అన్నారు. వాతావరణ సమతుల్యతకు మొక్కల పెంపకం ఎంతైనా అవసరమని చెప్పారు. కార్యక్రమంలో ఆల్విన్‌కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్‌గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, లద్దె నాగరాజు, శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
హరితహారాన్ని నిర్లక్షం చేస్తే కఠిన చర్యలు
షాబాద్: హరితహారాన్ని నిర్లక్షం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చేవెళ్ల ఆర్‌డివో చంద్రమోహన్ అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. మండలంలో 11లక్షల మొక్కలు నాటవలసి ఉండగా కేవలం రెండు లక్షల మొక్కలు నాటారని అన్నారు. లక్ష్యం చాల ఉంది.. అందులో 50శాతం కూడా పూర్తి చేయలేదని ఆగ్రహించారు. ప్రతి గ్రామంలో 40వేల మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపిడివో పద్మావతి, తహశీల్దార్ సత్యనారాయణరాజు, ఏపివో వీరాసంగ్, ఏవో సంయుక్త పాల్గొన్నారు.