రంగారెడ్డి

ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, జూలై 28: ఎంసెట్-2 పేపర్ లీకేజీ వ్యవహారాన్ని నిరసిస్తూ మండల బిజెపి శ్రేణులు గురువారం మేడ్చల్ హైవే బస్‌స్టేషన్ సమీపంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం ప్రభుత్వ చేతగాని తననానికి నిదర్శమని దుయ్యబట్టారు. విద్యార్థుల జీవితాలతో అడుకోవద్దని సున్నిత మనస్తత్వం గల వారు ఏదేని అఘాయిత్యానికి పాల్పడితే ఎవరు బాధ్యత వహిస్తారు అని ప్రశ్నించారు. ఎంసెట్ కుంభకోణంలో నిందితులు ఎంతటి వారైనా వదలవద్దని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎంసెట్-2ను రద్దు చేయాలనే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని ఇప్పటికే ఎంసెట్-1, 2 రాసిన విద్యార్థులు మరో మారు మరో ఎంసెట్ ప్రవేశపరీక్ష రాయాలంటే అయ్యే పనికాదని ప్రభుత్వం విద్యార్థుల ఇబ్బందులను పరిగణలోకి తీసుకోవాలని నాయకులు కోరారు. ఎంసెట్ ప్రశ్నాపత్రం లీక్ అయి ఎవరెవరికైతే అందిందో అలాంటి విద్యార్థులపై జీవితాంతం అన్నిరకాలుగా నిషేధం విధించాలని వారి తల్లితండ్రులను కూడా శిక్షించాలని డిమాండ్ చేశారు.
అంతేకాని సామాన్యులు పగలనక రాత్రనక కష్టపడి చదివిన విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడవద్దని హితవు పలికారు. కార్యక్రమంలో ఎంపిపి విజయలక్ష్మీ, మండల ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు అమరం మోహన్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జగన్‌గౌడ్, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, గణేశ్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.