రంగారెడ్డి

పాలిటెక్నిక్ హాస్టల్‌లో అవినీతిపై విద్యార్థుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జూలై 29: రామంతాపూర్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్‌లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో విద్యార్థులు తరగతులను బహిష్కరించి ఆందోళన చేశారు. కళాశాల ఆవరణలో బైఠాయింపు జరిపి అవినీతిపై విచారణ జరిపించి న్యాయం చేయాలని ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. హాస్టల్ మేనేజర్, వార్డెన్, ప్రిన్సిపాల్ కలిసి విద్యార్థుల వద్ద నుంచి ఆరు, ఏడు వేలు వసూలు చేస్తూ వాటికి రశీదు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ప్రతి నెల ప్రభుత్వం నుంచి వచ్చే మెస్ చార్జీలకు లెక్కలు చెప్పకుండా విద్యార్థుల నుంచి అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. తీసుకున్న డబ్బులకు రశీదు అడిగితే హాస్టల్ నుంచి వెళ్లిపోమని విద్యార్థులను బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. రిఫండబుల్ డబ్బులను విద్యార్థులకు ఇవ్వకుండా హాస్టల్ గదుల్లో మద్యం సేవిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల నుంచి క్రమం తప్పకుండా డబ్బులు వసూలు చేస్తున్నప్పటికీ వారికి సౌకర్యాలను కల్పించడం లేదన్నారు. విద్యార్థులు, అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన హాస్టల్‌ను విద్యార్థులతో మేనేజ్‌మెంట్ కమిటీని నియమించకుండా ఏకపక్షంగా నిర్వహిస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. లేడీస్ హాస్టల్ భవనం నిర్మాణం పూర్తయినా ప్రారంభించకపోవడంతో విద్యార్థులు ప్రైవేటు హాస్టళ్లలో అధిక డబ్బులు చెల్లిస్తూ నష్టపోతున్నారని ఆరోపించారు. ఎస్‌ఎఫ్‌ఐ జోన్ కార్యదర్శి హరీష్‌రెడ్డి నాయకత్వంలో ఇన్‌చార్జి దిలీప్, మణి, తేజ, నవీన్, శివ, ఫణీంద్ర, ధనుష్, మల్లిఖార్జున్, సందీప్, ఉమామహేశ్వర్ పాల్గొన్నారు. హాస్టల్‌లో ఎలాంటి అవినీతి అక్రమాలు జరుగలేదని కళాశాల ప్రిన్సిపాల్ శ్యాంసుందర్‌రెడ్డి స్పష్టం చేశారు. తీసుకున్న ఫీజులకు రశీదులు ఇస్తున్నామని, అందని వారికి సైతం ఇస్తామని పేర్కొన్నారు.