రంగారెడ్డి

జలమండలి పైపులైన్ నిర్మాణ పనులలో అపశృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడ్‌మెట్, ఆగస్టు 18: అధికారుల పర్యవేక్షణ లోపం..కాంట్రాక్టర్‌ల నిర్లక్ష్యం వల్ల మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో జరుగుతున్న జలమండలి పైప్‌లైన్ నిర్మాణ పనులలో గురువారం అపశృతి చోటుచేసుకుంది. నేరేడ్‌మెట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని నేరేడ్‌మెట్ కృపాకాంప్లెక్స్ మినీట్యాంక్ బండ్ సమిపంలో గత కొంత కాలంగా జలమండలికి సంబంధించిన పైపులైన్ నిర్మాణ పనులు జరగుతున్నాయి. ఈ నిర్మాణ పనులను వారసిగూడకు చెందిన కాంట్రాక్టర్ వెంకటకృష్ణారెడ్డి అతడి సూపర్‌వైజర్ గంగిరెడ్డిలు చేయిస్తున్నారు. పైపులైన్ గ్యాస్ వెల్డింగ్ నిర్మాణ పనుల కోసం గత 25 రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రభు యాదవ్(22), మనోజ్(26), బ్రిజేష్ యాదవ్(22), వినోద్ పాండే(32)ను తీసుకువచ్చారు. వీరు వౌలాలిలో ఉంటూ ఇక్కడ పని చేస్తున్నారు. కాగా అధికారుల పర్యవేక్షణ లోపం కాంట్రాక్టర్‌ల నిర్లక్ష్యంతో కార్మికులు ఎలాంటి భధ్రత చర్యలు తీసుకోకుండా పైపులైన్ నిర్మాణ పనులను కొనసాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. గురువారం ఉదయం రోజు మాదిరిగానే పనులకు వచ్చిన కార్మీకులు పైపులైన్ లోపలి భాగంలోకి వెళ్లి గ్యాస్ వెల్డింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్‌సీలిండర్ పేలి పని చేస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గాయపడిన వారిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్టు తెలిపారు. ప్రభు యాదవ్‌కు తీవ్రగాయాలు అయినట్టు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాంట్రాక్టర్ వెంకటకృష్ణరెడ్డి, గంగిరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ మక్బుల్‌జానీ తెలిపారు.