రంగారెడ్డి

హాస్టల్ రూమ్‌లో యువకుని దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెపిహెచ్‌బికాలనీ, ఆగస్టు 18: బ్రతుకుదెరువు నిమిత్తం బాయ్స్ హాస్టల్‌లో నివాసముంటున్న ఓ యువకున్ని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డిజిల్లా వికారాబాద్ మండలం తెల్కాలపల్లి గ్రామానికి చెందిన పరియాడ గోపి(18) వివేకానందనగర్‌కాలనీలోని అనిల్స్ బాయ్స్ హాస్టల్‌లో రెండు సంవత్సరాలుగా ఉంటూ లిఫ్ట్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శౌర్య వికారాబాద్ నుంచి కూకట్‌పల్లికి రోజు రాకపోకలు సాగిస్తుంటాడు. గోపి మరో స్నేహితుడుతో కలిసి ఒకే రూమ్‌లో ఉంటున్నాడు. కాగా బుధవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో తలకు బలమైన గాయాలతో అనుమానాస్పద స్థితిలో గోపి మృతిచెంది ఉన్నాడు. వికారాబాద్ నుండి వచ్చిన అసిస్టెంట్ గోపికి ఫోన్ చేయడంతో ఎంతకు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో రూమ్‌కు వచ్చాడు. దీంతో హత్యకు గురైన విషయాన్ని తెలుసుకొని పోలీసులకు సమాచారం అందించాడు.
సంఘటన ప్రాంతంలో పోలీసులు, క్లూస్‌టీం, డాగ్‌స్కాడ్‌లతో సాక్షాదారాలను సేకరించారు. మృతుడి గదిలో సామాను చిందరవందరగా పడి ఉండడంతో పాటు మృతుడు మద్యం సేవించి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పదునైనా ఆయుధాలతో కొట్టగా తలకు తీవ్రగాయాలై మృతి చెంది ఉన్నాడు. ఒకే రూమ్‌లో ఉంటున్న మరో స్నేహితుడు మూడు రోజులుగా హాస్టల్‌కు రాకపోవడం, హాస్టల్‌లో ఉండే వ్యక్తులు సంఘటనకు పాల్పడి ఉంటారా, వేరే ఎవరైనా వ్యక్తులు హత్యకు పాల్పడి ఉంటారా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.