రంగారెడ్డి

సాహితీ జ్ఞానాన్ని వెలికి తీసేందుకే పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఆగస్టు 28: విద్యార్థుల్లో దాగి ఉన్న సాహితీ జ్ఞానాన్ని వెలికి తీసేందుకు పోటీలు ఉపయోగపడతాయని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ప్యాట మల్లేశం అన్నారు. ఆదివారం పాఠశాలలో సాహితీ సమితి గంగవరం శాఖ ఆధ్వర్యంలో ఐదు నుండి పదో తరగతి విద్యార్థులకు రెండు స్థాయిలలో పద్య కంఠస్థం, దేశభక్తి గేయాలు, కళాశాల స్థాయిలో క్విజ్ పోటీలు నిర్వహించారు. బహుమతి ప్రదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మల్లేశం మాట్లాడుతూ విద్యార్థుల్లో చిన్నతనం నుండే దేశభక్తి భావాలు కలిగి ఉండాలని చెప్పారు. క్రమశిక్షణతో గురువులు బోధించే ప్రతి విషయాన్ని గ్రహించి జీవితంలో అలవర్చుకోవాలని, మంచి పౌరులు కావాలని పిలుపునిచ్చారు. సాహితీ సమితి జిల్లా అధ్యక్షుడు ఎ.వీరకాంతం, కార్యదర్శి కృష్ణగౌడ్, కోశాధికారి సుదర్శన్‌రావు, మండల శాఖ అధ్యక్షుడు అనంత పద్మనాభరావు, కార్యదర్శి పరమేశ్, కార్యవర్గ సభ్యులు సిహెచ్ వెంకటయ్య, దివాకరశాస్ర్తీ, సుధాకర్‌గౌడ్, ఆర్.శ్రీనివాస్, న్యాయ నిర్ణేతలుగా కులకర్ణి సత్యం, ఉదయ్, రాములు, అశోక్, బాలకృష్ణ, మల్లేశం పాల్గొన్నారు.
విజేతలు వీరే
5, 6, 7 తరగతుల విభాగంలో పద్య కంఠస్థ పోటీలో ప్రథమ బహుమితి పుల్‌మద్ది జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థిని ఎం.రుక్మిణి కైవసం చేసుకోగా ద్వితీయ బహుమతి సిద్ధార్థ విద్యార్థిని జి.శ్రీవంశిక, తృతీయ బహుమతి కాకతీయ పాఠశాల విద్యార్థిని యు.సాయిప్రసన్న పొందారు. 8, 9, 10 తరగతుల విభాగంలో ప్రథమ స్థానంలో పుల్‌మద్ది జిల్లా పరిషత్ విద్యార్థి బి.శిరీష, ద్వితీయ స్థానంలో సిదార్థ పాఠశాల విద్యార్థినులు జి.వర్షిత, ఆకాంక్ష, తృతీయ స్థానంలో జిల్లా పరిషత్ బాలికల పాఠశాల విద్యార్థిని వౌనిక నిలిచారు. దేశభక్తి గేయాలలో ప్రథమ బహుమతి సిద్ధార్థ పాఠశాల విద్యార్థిని ఆర్.వర్ష, ద్వితీయ బహుమతి న్యూ నాగార్జున విద్యార్థిని సి.అఖిల, అనంతగిరిపల్లి జిల్లా పరిషత్ విద్యార్థిని బి.మధురవేణి, తృతీయ బహుమతి బి.రాజేశ్వరిలు సాధించారు. క్విజ్ పోటీలో ప్రథమ స్థానాన్ని డైట్ కళాశాల, ద్వితీయ స్థానాన్ని సిద్ధార్థ జూనియర్ కళాశాల, తృతీయ స్థానాన్ని సరస్వతి జూనియర్ కళాశాల విద్యార్థులు కైవసం చేసుకున్నారు.