రంగారెడ్డి

చేవెళ్ల జిల్లా ప్రకటించే వరకూ పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేవెళ్ల, ఆగస్టు 30: పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంమైన చేవెళ్లను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని జిల్లా పోరాట సమితి అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గం ఇన్‌చార్జి పి.వెంకటస్వామి, సిపిఐ చేవెళ్ల నియోజకవర్గ కార్యదర్శి రామస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభులింగం అన్నారు. మంగళవారం చేవెళ్ల మండల కేంద్రంలో జిల్లా పోరాట సమితి, అఖిలపక్షం ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా నిర్వహించి, ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. చేవెళ్లను జిల్లా కేంద్రంగా ఏర్పటు చేసే వరకు పోరాటం ఆగదని చెప్పారు. వికారాబాద్‌లో మొయినాబాద్, షాబాద్, శంకర్‌పల్లి మండలాలను కలపొద్దని, కనీసం శంషాబాద్‌లోకలపాలని ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుంటే ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరించడం తగదని పేర్కొన్నారు. హైదారాబాద్‌కు దగ్గరలో ఉన్న చేవెళ్లను జిల్లాగా ప్రకటించకపోవడం దారుణమని తెలిపారు. ప్రతిప్రాదనల్లో పార్లమెంట్ నియోజకవర్గ పట్టణాన్ని చేవెళ్ల హెడ్‌క్వార్టర్‌ను జిల్లా కేంద్రంగా చేయాలని ఉంటే.. సిఎం చట్టాన్ని తన చేతులోకి తీసుకోని ఇష్టానుసారంగా వ్యవహరించటంపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది యువకులు ప్రాణ త్యాగం చేశారని, చేవెళ్ల జిల్లా కోసం ఆత్మహత్యలు చేసుకొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. చేవెళ్ల గడ్డ మీద మంత్రి, మాజీ మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పెద్ద నాయకులున్నా నోరు మెదపడం లేదు ఎందుకని ప్రశ్నించారు. నోరు మెదపని దద్దమ్మలకు మంత్రి, ఎంపి, ఎమ్మెల్యే పదవులను ఇచ్చారని ఆరోపించారు. పుట్టిన గడ్డ కోసం ఏమి చేయని మీకు పదవులు ఎందుకు రాజీనామా చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. దమ్ముంటే పదవులుకు రాజీనామ చేసి రండి చేవెళ్ల జిల్లా కోసం పోరాడి సాధించుకుందామని హితువుపలికారు. చేవెళ్లను జిల్లాగా ప్రకటించే వరకు ఉద్యమం కొసాగుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు.