రంగారెడ్డి

కాంగ్రెస్ పురోగభివృద్ధికి కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, ఆగస్టు 30: టిఆర్‌ఎస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి పి.కార్తీక్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన సమావేశానికి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పూర్వ వైభవానికి ప్రతి కార్యకర్త సైనికునిగా పనిచేసి పురోగాభివృద్ధికి తీసుకురావాలని సూచించారు. కేసిఆర్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ఎండగడుతూ ప్రజలను చైతన్యవంతులను చేయాలని పిలుపునిచ్చారు. ఐకమత్యం, సమన్వయంతో పని చేసినప్పుడే పార్టీ బలోపేతం అవుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కి నూకలు చెల్లిపోతాయని, పార్టీ చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియజేయాల్సిన కాంగ్రెస్‌పై ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలోనే రాజేంద్రనగర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, టిఆర్‌ఎస్ ఒరగబెట్టిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల పేర్లపై కోట్లాది రూపాయలను దోచుకుంటూ అప్పుల్లోకి తోసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసిఆర్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ఎండగడితే వారిపై కక్ష తీర్చుకుంటున్నారని, ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డా బెదిరే ప్రసక్తే లేదని వెల్లడించారు. చట్టపరంగా ఏ సమస్య ఉన్నా ఎదుర్కొంటామని, వ్యక్తిగతంగా కక్ష తీర్చుకోవటం సరైన పద్ధతి కాదని హితువు పలికారు. కార్యక్రమంలో కొలన్ సుభాష్‌రెడ్డి, ఈ ఎన్ అశోక్‌కుమార్, ప్రమోద్‌రెడ్డి, డి.రమేష్ ముదిరాజ్, సానెం శ్రీనివాస్‌గౌడ్, నోముల రాము యాదవ్, ఎస్.జైపాల్, సోమ శ్రీనివాస్, ఎన్‌కె శంకర్, అరుణ్ ముదిరాజ్, ధనుంజయ్, జఫర్‌షా, ఎస్.సురేష్, శ్రీనాధ్ పాల్గొన్నారు.
మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కాంగ్రెస్ నూతన అధ్యక్షునిగా దారమోని రమేష్ ముదిరాజ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి పి.కార్తీక్‌రెడ్డి సమక్షంలో జరిగిన ఎన్నికల్లో డి.రమేష్ ముదిరాజ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నియామక పత్రాన్ని రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యాక్షురాలు పి.సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. రమేష్ ముదిరాజ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి డివిజన్ అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్‌రెడ్డికు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు ఏకథాటిపైకి తీసుకువచ్చి పార్టీ పురోగాభివృద్ధికి తన వంతు సాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ ఎ-బ్లాక్ అధ్యక్షునిగా సానెం శ్రీనివాస్‌గౌడ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. పార్టీ పటిష్టత కోసం అందరినీ కలుపుకొని పోతూ ముందుకు వెళ్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు.