రంగారెడ్డి

గాంధీనగర్ నాలాలో అర్థరాత్రి కెమికల్ వ్యర్థాల ప్రవాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, ఆగస్టు 30: కెమికల్ పరిశ్రమలు నాలాల్లోకి వదులుతున్న వ్యర్థ రసాయనాల ధాటికి మంటలు చెలరేగుతుండడంతో బస్తీల్లోని ప్రజలు ఇళ్లలో ఉండకుండా బయటికి పరుగులు తీసే దుస్థితిలు నెలకొంటున్నాయి. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని గాంధీనగర్ పారిశ్రామిక వాడలోని పలు కెమికల్ పరిశ్రమలు నాలాల్లోకి నేరుగా కెమికల్ వదిలిపెట్టడం మంటలు చెలరేగడం ఇక్కడ పరిపాటిగా మారుతుంది. సుమారు 2009 సంవత్సరంలో వివేన్ పరిశ్రమ పట్టపగలే నాలాల్లోకి కెమికల్ వ్యర్థాలను వదిలేయడం వలన మంటలు చెలరేగి ఇళ్లు దగ్ధం కావడంతో పాటు ఓ ద్విచక్ర వాహనం దగ్ధమైంది. అది మరువక ముందే తాజాగా వెంకట్రామిరెడ్డినగర్ నాలాలోకి కెమికల్ వ్యర్థాలను సోమవారం అర్థరాత్రి విడుదల చేశారు. కెమికల్ ధాటికి గాంధీనగర్ శ్మాశాన వాటికకు ఆనుకున్న నాలాలో మంటలు చెలరేగడంతో స్థానిక ప్రజలు భయాందోళనతో బయటికి పరుగులు తీశారు. గతంలో వివేన్ పరిశ్రమ నుండి కెమికల్ ప్రవహించడం వలన మళ్లీ అదే పరిశ్రమ నుండి కెమికల్ వ్యర్థాలు నాలాలో ప్రవహించడం వలనే వెంకట్రామిరెడ్డి, గాంధీనగర్, దుర్గయ్యనగర్, భగత్‌సింగ్‌నగర్, పట్వారీనగర్, చంద్రానగర్, శివానగర్, రంగానగర్, గణేశ్‌నగర్ బస్తీలకు ఆనుకుని ఉన్న నాలాలో మంటలు చెలరేగాయని పరిశ్రమ ఎదుట బస్తీల ప్రజలు ఆందోళనకు దిగారు. అర్థరాత్రి మంటలు చెలరేగడంతో స్థానిక ఎమ్మెల్యే కెపి వివేక్, బాలానగర్ జోన్ ఇన్‌చార్జి డిసిపి సాయిశేఖర్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వివేక్ మాట్లాడుతూ కెమికల్ పరిశ్రమల వలన ప్రజల ప్రాణాలకు ముంపు ఉందని, ఈ విషయం పై సిఎంతో మాట్లాడి అవసరమైతే అసెంబ్లీలో సమస్యను లేవనెత్తి కెమికల్ పరిశ్రమలను మూసివేసేందుకు కృషి చేస్తానని అన్నారు. మంగళవారం వివేన్ పరిశ్రమ ఎదుట వివిద బస్తీల ప్రజలు, టిఆర్‌ఎస్ నేత కెఎం ప్రతాప్, సిపిఐ నాయకులు ఆందోళనకు దిగారు. ప్రతాప్ మాట్లాడుతూ కెమికల్ పరిశ్రమలను ఇళ్ల మధ్యలో నుండి దూరప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేశారు. గతంలో పెను ప్రమాదం జరిగిన సమయంలోనే పరిశ్రమపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కెమికల్ పరిశ్రమలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పిసిబి అధికారి రవీందర్‌రెడ్డి సిబ్బందితో కలిసి కెమికల్ వ్యర్థాల నమూనాలను సేకరించారు. మూడు, నాలుగు పరిశ్రమల నుండి నమూనాలను సేకరించామని, ఏ పరిశ్రమకు సంబంధించిన కెమికల్ వ్యర్థాలో గుర్తించాక పరిశ్రమపై క్రిమినల్ కేసులను నమోదు చేస్తామని అన్నారు. బాలానగర్ ఎసిపి నర్సింహారెడ్డి, జీడిమెట్ల సిఐ చంద్రశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకుని పూర్తి వివరాలను సేకరించారు.