రంగారెడ్డి

చైన్ స్నాచర్ అరెస్టు: సొత్తు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఆగస్టు 30: ఒకవైపు ఉద్యోగం చేస్తూ.. చాలీచాలని జీతంతో అప్పుచేసి ఇల్లు కొనుగోలు చేశాడు. అప్పు తీర్చడానికి పార్ట్‌టైం దొంగగా మారాడు. ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతూ తప్పించుకుతిరుగుతున్న ప్రైవేటు ఉద్యోగిని సిసి కెమెరాల పుటేజ్ ఆధారంగా ఉప్పల్ పోలీసులు పట్టుకుని అతని వద్ద రూ.2.5లక్షల విలువైన బంగారు ఆభరణాలు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ అల్వాల్ డిసిపి ఇ.రామచంద్రారెడ్డి మంగళవారం మల్కాజిగిరి ఏసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం ఉప్పల్ రాఘవేంద్రనగర్ కాలనీలో నివసిస్తున్న నల్గొండ జిల్లా ఆలేరు పట్టణంలోని పోచమ్మ వీధి శాంతినగర్‌కు చెందిన వరాల శ్రీనివాస్ ముదిరాజ్ అలియాస్ సీను (31) రెంటోకిల్ పెస్ట్ కంట్రోల్‌లో టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. విద్యావంతుడైన సీనుకు భార్య పిల్లలు ఉన్నారు. అప్పు చేసి ఇల్లు కొనుగోలు చేశాడు. సకాలంలో అప్పులు తీర్చడానికి పార్ట్‌టైం దొంగగా అవతారమెత్తాడు. పొద్దంతా ఉద్యోగం చేస్తూ సాయంత్రం వేళల్లో తెల్ల రంగు హెల్మెట్ ధరించి బైక్‌పై తిరుగుతూ ఒంటరిగా ఉన్న మహిళలను వెంబడించి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నాడు. ఉప్పల్, మేడిపల్లి, కుషాయిగూడ, ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ల పరిధిలో దొంగతనాలు చేస్తూ పోలీసులకు ముచ్చెముటలు పట్టిస్తున్నాడు. వారం రోజుల క్రితం ఉప్పల్ లక్ష్మారెడ్డికాలనీ, విజయపురికాలనీలో బైక్‌పై తిరుగుతూ దొంగతనం చేస్తూ సిసి కెమెరాలకు చిక్కాడు. నాలుగు ప్రాంతాలలో సిసి కెమెరాలలోని దృశ్యాలను పరిశీలించి దొంగపై పోలీసులు నిఘా పెట్టారు. మంగళవారం చిల్కానగర్ రోడ్డులో దొంగతనం చేయడానికి రెక్కీ నిర్వహిస్తుండగా బైక్ నెంబర్, తెల్ల హెల్మెట్ ఒకే మాదిరిగా ఉండటంతో చాకచక్యంగా వ్యవహిరించి పట్టుకున్నారు. విచారిస్తే అతడు ఏడు కేసుల్లో ఉన్నట్లు బయటపడింది. అతని వద్ద రూ.2.5లక్షల విలువైన 8.5తులాల బంగారు ఆభరణాలు, బైక్‌ను స్వాధీనం చేసుకుని కోర్టుకు రిమాండ్ చేసినట్లు డిసిపి రాంచంద్రారెడ్డి తెలిపారు. సమావేశంలో ఏసిపి గోనె సందీప్, ఇన్‌స్పెక్టర్లు వై.నర్సింహారెడ్డి, కె.జగన్నాధ్‌రెడ్డి, ఎస్‌ఐలు పాల్గొన్నారు. చైన్ స్నాచర్ దొంగను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన క్రైం సిబ్బందిని అభినందిస్తూ వారికి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడానికి ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తున్నట్లు ప్రకటించారు.