రంగారెడ్డి

తాండూరు పేరుతోనే జిల్లా ఏర్పాటు చేయాలి: ధారాసింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, ఆగస్టు 30: రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటు నిర్ణయం ఆహ్వానించదగిన అంశమేనని, తాండూరు పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సీనియర్ కాంగ్రేస్ నేత, ప్రముఖ గిరిజన నాయకుడు ధారాసింగ్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాలకులు రూపొందించిన నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియ హేతుబద్ధంగా లేదని చెప్పారు. మంగళవారం ధారాసింగ్ తాండూరులోని తమ నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, నూతన జిల్లాల ఏర్పాటు, ప్రజలకు పరిపాలన సౌలభ్యం అనే విధానంలో లోటుపాట్లు ఉన్నందున జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై పలు అభ్యంతరాలు, ఆందోళనలు ఎగిసి పడుతున్నాయంటూ ధారాసింగ్ ఉదాహరించారు. రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాలలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి, మూడు జిల్లాలుగా విభజన జరిగినా.. రాజకీయ, సామాజిక, ప్రజాసంఘాల నుంచి తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు, ఆక్షేపణలు వెల్లువెత్తుతున్నట్లు వివరించారు. నూతన జిల్లా ఏర్పాటుకు ప్రధాన ఉధ్ద్యేశం క్రింది స్థాయి వరకు ప్రజలకు పరిపాలన సౌలభ్యం కల్పించటం కాగా, ప్రభుత్వ ఆశయం ఎక్కడా కనిపించటం లేదన్నారు. రాజకీయ ప్రయోజనాలు, సొంత లాభాల కోసమే నూతన జిల్లాలు ఏర్పాటు అవుతున్నట్లు అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల నుంచి ఆరోపణలు వెలువడుతున్నట్లు ధారాసింగ్ అభిప్రాయ పడ్డారు. జిల్లాల ఏర్పాటు డ్రాప్టు వెల్లడికి ముందు తాండూరు నియోజకవర్గంలోని పెద్దెముల్ మండలంలో అతిపెద్ద మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న కోట్‌పల్లిని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తామని పాలకులు, ఉన్నతాధికార యంత్రాంగం.. తీరా జిల్లాల డ్రాప్టులో కోట్‌పల్లి మండల కేంద్రానికి మొండి చేయి చూపడం దారుణమని దుయ్యబట్టారు. తాండూరును రెవెన్యూ డివిజన్‌గా ఉన్నతి కల్పిస్తామంటూ ప్రభుత్వ పాలకులు ప్రకటించిన అంశం బుట్టదాఖలు కావటం శోఛనీయం అంటూ, ధారాసింగ్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు ఎంఎ నయూమ్(అప్పు), విష్ణువర్దన్‌రెడ్డి, నారాయణరెడ్డి, ప్రభాకర్‌గౌడ్ విమర్శించారు. ఆరు నూరైనా తాండూరును రెవెన్యూ డివిజన్‌గా, కొట్‌పల్లిని మండల కేంద్రంగా ఏర్పాటు చేసే వరకు తమ ఉద్యమం ఆపేది లేదని పేర్కోన్నారు. తాండూరు పేరుతోనే నూతన జిల్లా రూపకల్పన జరగాలని డిమాండ్ చేశారు. వికారాబాద్‌ను జిల్లా హెడ్‌క్వార్టర్‌గా, తాండూరు పేరుతో జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం, పాలకులు ఆమోదం తెలిపే వరకు తమ ఉద్యమాన్ని ఆపేది లేదంటూ పునరుద్ఘాటించారు. రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రేడ్డి తమ వౌనాన్ని వీడి సిఎం కేసిఆర్‌ను, నూతన జిల్లాల ఏర్పాటుకు నియమించిన మంత్రి వర్గ ఉప సంఘం కమిటీని ఒప్పించి, తాండూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతోపాటు, కొట్‌పల్లి మండల కేంద్రం రూపకల్పనకు కృషి చేయాలంటూ డిమాండ్ చేశారు.