రంగారెడ్డి

కబ్జాలకు గురవుతున్న చెరువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, సెప్టెంబర్ 3: చెరువులను పునరుద్దరించి భూ గర్భ జలాలను సమృద్ధిగా పెంచాలనే దృడ సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకాన్ని అత్యంత పకడ్భందిగా అమలు చేస్తుండగా అవేమి తమకు పట్టనట్లు రియల్ వ్యాపారులు చెరువుల స్థలాలను యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతున్నారు. నగర శివారు ప్రాంతాల భూములకు రెక్కలు రావటంతో రియల్ వ్యాపారులు ప్రభుత్వ భూములను కబ్జాలు చేస్తు దర్జాగా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. తమ కళ్ల ముందే కబ్జాలు జరుగుతున్న ప్రజా ప్రతినిధులు, అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరించటం విమర్శిలకు దారి తీస్తుంది. దింతో పార్కు స్థలాలు, రోడ్లు, చెరువుల భూములను సైతం కబ్జాలు చేస్తున్నారు. నగర శివారు బోడుప్పల్ మున్సిపాలిటి పరిధి చెంగిచెర్లలో కబ్జాల పర్వం ఊపందుకుంది.
గ్రామంలోని ప్రభుత్వ స్థలాల ఉనికి ఇప్పటికే కోల్పోయి ఉండగా అదేమి చాలదన్నట్లు చింతల చెరువు స్థలంపై రియల్ వ్యాపారుల కన్ను పడింది. దీంతో ఎఫ్‌టిఎల్ పరిధిలో ఉన్న స్థలాన్ని కబ్జా చేసేందుకు గత రెండు రోజులుగా ఇతర ప్రాంతాల నుండి మట్టిని తెచ్చి కబ్జాకు యత్నిస్తున్నారు. లారీల ద్వార మట్టిని పోసి ట్రాక్టర్ల ద్వార చదును చేస్తున్నారు. ఎఫ్‌టిఎల్ పరిధిలో ఉన్నప్పటికి తమ స్వంత భూమి అంటు బుకాయిస్తున్నారు. హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారి నుండి కిలోమీటరు దూరంలో ఉన్న చింతల చెరువురోడ్డుకు అనుకుని ఉండటంతో రియల్ వ్యాపారులు కబ్జాకు పాల్పడుతున్నారు. కబ్జాల నుండి చెరువులను రక్షించి సాగు, తాగు నీరును రైతులకు, ప్రజలకు సమృద్ధిగా అందించేందుకు ప్రభుత్వం పకడ్భంది చర్యలు తీసుకుంటుండగా ఇక్కడి చెరువు మాత్రం కనుమరుగు కానుంది. అధికారుల నిర్లక్ష్యం వల్లనే ప్రభుత్వ స్థలాలు పూర్తిగా కనుమరుగు అవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
చింతల చెరువు కబ్జాపై మండల తహశీల్ధార్‌కు ఫిర్యాదు చేసినప్పటికి కనీస చర్యలు చేపట్టక పోవటం విచారకరమని అన్నారు. చింతల చెరువులో ఇళ్లు వెలుస్తున్నాయని పలు మార్లు ఫిర్యాదు చేసి పట్టించుకనే నాధుడు లేదని విమర్శిస్తున్నారు. సంబంధిత అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
చెరువు స్థలాలను కబ్జాలు చేస్తే కఠిన చర్యలు
ఘట్‌కేసర్ మండలం చెంగిచెర్ల శివారులోని చింతల చెరువు కబ్జా విషయమై తమకు సమాచారం లేదని, వెంటనే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ ఏఇ నివేదిత అన్నారు. మండలంలోని అన్ని చెరువులకు ఎఫ్‌టిఎల్ ఎర్పాటు చేసి హద్దు రాళ్లను ఇప్పటికే పాతినట్లు చెప్పారు. అన్ని చెరువుల ఎఫ్‌టిఎల్ వివరాలు నెట్ ఉంటాయని తెలిపారు. కబ్జాలకు పాల్పడితే చట్టరిత్య చర్యలు తీసుకోవటంతో పాటు కబ్జాలు చేసిన భూములను స్వాధీనం చేసుకుంటామన్నారు. చెరువుల కబ్జాలపై తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని నివేదిత కోరారు.