రంగారెడ్డి

అక్షరాస్యతతో పాటు పొదుపును ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, ఏప్రిల్ 1: ప్రతి ఒక్కరూ అక్షరాస్యతను పెంచుకోవడంతో పాటు పొదుపును అలవర్చుకోవాలని అంకుషాపూర్ సర్పంచ్ బద్దం అర్చనా నర్సింహారెడ్డి అన్నారు. అంకుషాపూర్ గ్రామంలో జాతీయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ నాబార్డ్ వారి ఆర్ధిక సహాయంతో వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్ధిక అక్షరాస్యత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని సర్పంచ్ అర్చన మాట్లాడుతు పొదుపును అలవర్చుకోవటం ద్వారా ఆర్ధికంగా ఎదిగి అన్ని రంగాలలో రాణించవచ్చునన్నారు. విద్యతోనే వికాసం ఉంటుందని, ప్రతి ఒక్కరూ విద్యనభ్యసించాలన్నారు. ప్రధాని జీవనజ్యోతి, భీమా యోజన, సురక్షా భీమా యోజన, అటల్ పెన్షన్ యోజన సదుపాయాలను పొదుపు ఖాతాల ద్వారా పొందవచ్చన్నారు. సంస్థ డైరక్టర్ గంగి అయిలయ్య మాట్లాడుతూ యువజనుల నుండి 70 సంవత్సరాల వృద్ధుల వరకు విద్యనభ్యసించటంతో పాటు పొదుపుపథకాలలో చేరాలన్నారు. పొదుపు పథకాలలో చేరిన వారికి అనేక ఆర్ధిక ప్రయోజనాలు ఉన్నట్లు, దీంతో భవిష్యత్‌కు బాటలు వేసుకోవచ్చని సూచించారు. కో ఆర్టినేటర్లు బి రమేశ్, జె శ్రీనివాస్, పంచాయతీ సభ్యులు మంగ, నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.