రంగారెడ్డి

మేడ్చల్ జిల్లాకు ఓకే.. అంబరాన్నంటిన సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, సెప్టెంబర్ 13: మేడ్చల్‌కు ఉన్న విశిష్టత ప్రాముఖ్యతను ప్రజల అభ్యర్థనలను పరిగణలోకి తీసుకున్న ముఖ్యమంత్రి ఏట్టకేలకు మల్కాజ్‌గిరి జిల్లా పేరు స్థానంలో మేడ్చల్‌గా మార్చేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో మంగళవారం పట్టణంలో సంబరాలు అంబరాన్నంటాయి. మేడ్చల్ హైవే వివిధ పార్టీల నాయకులు ప్రజాసంఘాలు, ప్రజాప్రతినిధులు బాజభజంత్రీల మధ్య భారీ ర్యాలీలు నిర్వహించి బాణసంచా కాల్చి, మిఠాయిలు పంపిణీ చేస్తూ తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఆయా రాజకీయ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు ఒకరిపై ఒకరు గులాల్ చల్లుకుంటూ తీన్మార్ నృత్యాలు చేస్తూ సిఎం కెసిఆర్ భారీ కటౌట్‌ను రథంలో ఊరేగిస్తూ పాలాభిషేకం నిర్వహించారు. అఖిలపక్షం, మేడ్చల్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మేడ్చల్ హైవేపై ర్యాలీలు నిర్వహించి పట్టణ ప్రధాన కూడళి అంబేద్కర్ విగ్రహాం వద్ద నృత్యాలు చేశారు. నాయకులు మాట్లాడుతూ సిఎం కెసిఆర్‌ను మేడ్చల్ ప్రజలు ఆజన్మాంతం రుణపడి ఉంటారని ఈ సందర్భంగా కెసిఆర్‌కు కృతఙ్ఞతలు తెలిపారు. అన్ని వసతులతో విరాజిల్లుతున్న మేడ్చల్‌ను జిల్లాగా ఏర్పాటు చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. మేడ్చల్ అందరికీ అందుబాటులో ఉండే ప్రాంతమని దీనిని గుర్తించిన సిఎంకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, ఎంపిపి విజయలక్ష్మీ, జడ్పీటిసి శైలజ, సాధన సమితి అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, నాయకులు రమేశ్, పాండు, నాగరాజు, సాటే నరేందర్, శైలేందర్, రాగజ్యోతి, నాగమణి, రాహుల్, సంజీవరెడ్డి, పోచయ్య, మోహన్‌రెడ్డి, భాస్కర్, విష్ణుచారి, రామస్వామి, శేఖర్‌గౌడ్, మల్లికార్జున్, మర్రి నర్సింహ్మరెడ్డి, వీర్లపల్లి భాగ్యరెడ్డి, మోనార్క్, మధుకర్, శారద పాల్గొన్నారు.
మేడ్చల్ ప్రాముఖ్యతను చరిత్రను పరిగణలోకి తీసుకుని స్వయంగా సిఎం కెసిఆర్ మేడ్చల్ జిల్లా పేరును పరిశీలించాలని అధికారులను ఆదేశించడం అభినందనీయమని టిఆర్‌ఎస్ నేత నందారెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయన ఇచ్చిన లేఖను పరిగణలోకి తీసుకునే పేరు మార్పుపై పరిశీలించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారని సమాచారం. దీంతో మంగళవారం టిఆర్‌ఎస్ నాయకులు నందారెడ్డిని అత్వెల్లిలోని ఆయన నివాసంలో శాలువా కప్పి పూలమాల వేసి ఘనంగా సత్కరించారు. నందారెడ్డి మాట్లాడుతూ గతంలో మేడ్చల్ ఇటు ప్యారడైజ్ బాలంరాయి నుంచి సిద్ధిపేట్, భువనగిరి వరకు విస్తరించి ఉండేదనే విషయాన్ని లేఖలో పొందుపర్చామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా పరిపాలన సౌలభ్యం కోసమే జిల్లాలను ఏర్పాటు చేస్తున్న తరుణంలో మేడ్చల్‌లో అన్ని వసతులు, చరిత్ర, ప్రాముఖ్యత, విశిష్టత, నైసర్గిక, భౌగోళిక స్థితుగతులను పరిగణలోకి తీసుకుని మేడ్చల్‌ను జిల్లాగా ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారని పేర్కొన్నారు. స్థానిక నాయకులు ఉద్యమకారుల పోరాట ఫలితం, సిఎం కెసిఆర్ ముందు చూపు, ఎంపి మల్లారెడ్డి, ఎమ్మేల్యేలు సుధీర్‌రెడ్డి, వివేకానంద, కృష్ణారావు, సాయన్న కృషి కూడా ఎంతో ఉందని వారికి ధన్యవాదాలు తెలిపారు.
లేఖను సిఎం పరిగణలోకి
తీసుకోవడం సంతోషకరం
సకల సౌకర్యాలతో భాసిల్లుతున్న మేడ్చల్‌ను జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ సిఎం కెసిఆర్‌కు తాను రాసిన లేఖను పరిగణలోకి తీసుకోవడం ఎంతో సంతోషకరమని మేడ్చల్ సీనియర్ న్యాయవాది చీదు హన్మంతురెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తన కార్యాలయంలో స్థానిక విలేఖరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సిఎం కెసిఆర్‌కు హృదయ పూర్వక కృతఙ్ఞతలు తెలిపారు. అన్ని విధాలుగా ప్రజలకు పరిపాలన సౌలభ్యం కోసం సౌకర్యవంతంగా ఉన్న మేడ్చల్‌ను జిల్లాగా ఏర్పాటు చేయడం హర్షణీమన్నారు. మేడ్చల్‌ను జిల్లాగా చేయడంతో పాటు జిల్లా కేంద్రాన్ని కూడా మేడ్చల్‌లోనే ఏర్పాటు చేయాలని ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు జిల్లా కార్యాలయాల ఏర్పాటు కోసం అనువైన ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉందని పేర్కొంటున్నారు. తాత్కాలిక జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేసుకునే విధంగా సౌకర్యాలున్నందున సర్కార్ ఆ దిశగా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.