రంగారెడ్డి

బండారి లే అవుట్ కాలనీలో మంత్రి జూపల్లి పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల: నిజాంపేట్ గ్రామం, బండారి లే అవుట్ కాలనీలో రాష్ట్ర మంతి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే కెపి వివేక్‌లు శుక్రవారం పర్యటించారు. కాలనీలో వరద నీటిలోనే పాదయాత్రలో బాధితులను పరామర్శించారు. బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం కాలనీకి ఆనుకున్న ఉన్న తుర్కచెరువును పరిశీలించారు. జూపల్లి మాట్లాడుతూ బాధితులు ఎలాంటి అపోహలకు గురికావద్దని, భయాందోళనకు గురికాకూడదని సూచించారు. కాలనీకి ఎలాంటి ప్రమాదం లేదని, వర్షం ఎక్కువగా ఉన్నందున ఇన్‌ఫ్లో ఉందని తెలిపారు. ప్రభుత్వ పరంగా బాధితులకు అన్ని సదుపాయాలను సమకూరుస్తున్నామని అన్నారు. బాధితులకు ప్రభుత్వ పరంగా ఎప్పటికప్పుడు సహాయక చర్యలను ముమ్మరం చేశామని చెప్పారు. ఎమ్మెల్యే కెపి వివేక్ మాట్లాడుతూ చెరువుకట్టకు ఎలాంటి ప్రమాదం లేదని, రూమర్‌లను నమ్మవద్దని, గ్రామ పంచాయతీ నుండి బాధితులకు తాగునీరు, పాలు, బ్రెడ్, బిస్కెట్‌లు, ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. వదంతులను, అపోహలను నమ్మవద్దని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధికార యంత్రాంగం, గ్రామ పంచాయతీ సిబ్బంది, పోలీసులు, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. కాగా, నిజాంపేట్ గ్రామం, బండారి లే అవుట్ కాలనీలో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ పర్యటించారు. తుర్కచెరువు నుండి కాలనీలోకి వస్తున్న వరద ఉద్ధృతిని, అలుగును పరిశీలించారు.
పొంగి పొర్లిన వాగులు, వంకలు
ధారూర్: గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మండలంలోని వాగులు, వంకలు పొంగిపొర్లాయి. నాగ్‌సాన్‌పల్లి, బాచారం, హరిదాస్ పల్లి గ్రామాల వాగులు బ్రిడ్జిపై నుండి పారడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. వికారాబాద్-తాండూర్ ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచి పోయాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పంట పొలాలు నీట మునిగి వేల ఎకరాల పంట పూర్తిగా మునిగిపోయింది. వ్యవసాయాధికారులు గ్రామాల్లో తిరిగి పంట అంచనా వేస్తున్నారు.
ముంపు ప్రాంతాలలో పర్యటించిన ఎమ్యెల్యే
నేరేడ్‌మెట్: మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో గురువారం రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన బారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. సర్కిల్ పరిధిలోని దుర్గానగర్, ప్రశాంత్‌నగర్, పివిఎన్‌కాలనీ, సత్తిరెడ్డినగర్, బండచెరువు, శ్రీకృష్ణనగర్, షిర్డీనగర్, వౌలాలి ప్రాంతాలలో రోడ్లపై, ఇళ్లలోకి నీరు చేరడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న మల్కాజిగిరి ఎమ్మెల్యే కనకారెడ్డి, గ్రేటర్ టిఆర్‌ఎస్ అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు శుక్రవారం ఉదయం ముంపుకు గురైన ప్రాంతాలలో పర్యటించి బాధితులను పరామర్శించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే కనకారెడ్డి, మైనంపల్లి మాట్లాడుతూ ముంపు ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఇళ్ల మధ్యలో ఉన్న నాలాలు కబ్జాకు గురయ్యాయని తెలిపారు. నాలాల కబ్జా వల్ల వర్షపు నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముంపు ప్రాంత బాధితులను ఆదుకునే విధంగా అన్నిచర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను అదేశించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎన్.జగదీష్‌గౌడ్, ఆకుల నర్సింగ్‌రావు, శిరీష జితేందర్ రెడ్డి, శ్రీదేవి మాజీ కార్పొరేట్ వై.ప్రేంకుమార్, నాయకులు పరశురాంరెడ్డి, మురుగేష్, ఉపేందర్, వెంకన్న, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.
భారీ వర్షానికి కంటోనె్మంట్ ప్రజల అందోళన
అల్వాల్: భారీ వర్షానికి కంటోనె్మంట్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా కురుస్తున్న వర్షాలకు అన్ని ప్రాంతాల వరదనీరు కంటోనె్మంట్ ద్వారా హుస్సేన్ సాగర్‌కు చేరుతుంది. దీనితో కంటోనె్మంట్ రెండవ వార్డు పరిధిలోని అన్నానగర్, రసూల్‌పురా, శివానగర్, అర్జున్‌నగర్, బాలంరాయి, విమాన్‌నగర్ కాలనీ, పైగాకాలనీ ప్రాంతాలు పూర్తిగా జలమమమయ్యాయి. వరద ముంపుప్రాంతాలను కంటోనె్మంట్ బోర్డు వైస్ చైర్మన్ సాదా కేశవరెడ్డితోకల్సి ఎమ్మెల్యే జి.సాయన్న పర్యటించి పరిస్థితి సమీక్షించారు. బస్తీలు అన్నీ దాదాపుగా జలమయమయ్యాయి. మరోవైపు మహేంద్రాహిల్స్, మారేడ్‌పల్లి, జెబియస్ ద్వారా కూడ వరద నీరు హుస్సేన్ సాగర్‌కు బాలంరాయి ద్వారా ప్రవహించటంతో ఇక్కడి ప్రాంతంలో జనజీవనం స్తంభించింది. పర్యటనలో సాయన్నతోపాటు బోర్డు వైస్ చైర్మన్ సాదాకేశవ రెడ్డి, నాయకులు టిఎన్.శ్రీనివాస్ ఉన్నారు.
భారీ వర్షాలకు స్తంభించిన నాచారం
నాచారం: నాచారంలో గురువారం రాత్రి కురిసిన వర్షనికి జజజీవనం అస్తవ్యస్తంగా మారిపోయి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నాలుగు రోజులుగా కురుస్తున్నా భారీ వర్షనికి రోడ్లు పూర్తిగా పాడైపోయి సముంద్రంలా తలపిస్తున్నాయని నాచారం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాచారం ఎర్రకుంట చెరువుఎఫ్‌టిఎల్‌లోని స్థలం పూర్తిగా కబ్జాలకు గురికావడంతో నాలాలు పొంగిపొర్లుతు కాలనీలు ముంపుబారిన పడుతున్నాయని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షలకు నాచారం ఎర్రకుంట పెద్దనాలా ఉప్పొంగడం.. నాచారం ప్రధాన రహదారిని ముసివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాచారం పెద్దనాలా 5మీటర్ల ఎత్తులో ప్రవాహించి హెచ్‌ఎంటి చెరువులోకి వెళ్లడంతో లోతట్టు కాలనీ పూర్తిగా వర్షపునీటిలో మునిగిపోయాయని కాలనీ ప్రజలు తెలిపారు. నాచారం ఎర్రకుంట చెరువు నాలా కబ్జాలకు గురికావడంతో ముంపు సమస్యలు తలేత్తుతున్నాయని వీరారెడ్డినగర్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలాలను కబ్జా చేసిన బహుళ అంతస్థల నిర్మాణం చేసిన అధికారులు పట్టించుకోకపోవడంతోనే నాచారంలో కాలనీలు ముంపునకు గురివౌతున్నాయని తెలిపారు.
ముంపునకు గురైన మున్సిపల్ మార్కెట్
ఎర్రకుంట నాలా ఉప్పొంగడంతో నాచారం మున్సిపాల్ మార్కెట్ పూర్తిగా వర్షపునీటిలోనే మునిగిపోయిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిపాటి వర్షనికి మార్కెట్ నీటిలో మునిగిపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని వ్యాపారులు కన్నీటి పర్యాంతమయ్యారు. భారీ వర్షానికి నాచారంలోకి లోతట్టు కాలనీలు జలమాయం కావడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండు రోజులుగా కనీసం మంచినీళ్లు దొరకని పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు.