రంగారెడ్డి

వికారాబాద్ జిల్లా కేంద్రం కాకపోతే రాజీనామా చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, సెప్టెంబర్ 23: వికారాబాద్ జిల్లా కేంద్రం కావడం ఖాయమని, జిల్లా కేంద్రం కాకపోతే రాజీనామా చేస్తామని వికారాబాద్ శాసనసభ్యుడు బి.సంజీవరావు ప్రకటించారు. శుక్రవారం విదేశాల నుండి తిరిగి వచ్చి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా కేంద్రాన్ని ప్రకటించారని, దానిపై ప్రజల నుండి అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నారని మూడురోజుల్లో తుది నిర్ణయం వెలువడనుందని చెప్పారు. ఆరునెలల క్రితమే కోర్టు భవన సముదాయ నిర్మాణ శంకుస్థాపనకు సిఎం కేసిఆర్‌ను ఆహ్వానించేందుకు న్యాయవాదులతో వెళ్ళినపుడే కేసిఆర్ వికారాబాద్ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా అవుతుందని స్పష్టం చేశారని, ఈ ప్రాంతం గురించి పూర్తి అవగాహన కలిగి ఉన్నారని తెలిపారు. వికారాబాద్ జిల్లా కేంద్రంపై కాంగ్రెస్ నాయకులు ఎందుకు అనుమాన పడుతున్నారో అర్థం కావడంలేదని, రాజకీయ లబ్ధికోసమే అలా చేస్తున్నారని ఆరోపించారు. వికారాబాద్ జిల్లాలోకి కోడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాలను కలుతామనడం సంతోషకరమని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో కేసిఆర్ పలుమార్లు వికారాబాద్ జిల్లా హామీ ఇచ్చారని గుర్తుచేశారు. 40 సంవత్సరాలుగా ప్రభుత్వాలు చెప్పుకుంటూ వచ్చినా జిల్లా ఏర్పాటు చేయలేదని సిఎం కేసిఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని అన్నారు. ప్రజల్లో అనుమానాలు తొలగిపోయేలా మూడురోజుల్లో ప్రకటన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శంషాబాద్ జిల్లాలో కలవాలన్నది మొయినాబాద్ మండల ప్రజల కోరిక అని స్పష్టం చేశారు. బాధలో ఉన్నవారికి నచ్చజెప్పడానికి పలువిధాలుగా మాట్లాడటం సహజమని అభిప్రాయపడ్డారు. సిఎం కేసిఆర్ వద్దకు మంత్రి మహేందర్‌రెడ్డి హరీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, ఎమ్మెల్సీ యాదవరెడ్డిలతో కలిసి వెళ్ళి మాట్లాడతామని చెప్పారు. ప్రసాద్‌కుమార్ మంత్రిగా ఉన్నపుడు గ్రామ పంచాయతీగా ఉన్న చేవెళ్ళను పార్లమెంటు చేయాలని లేఖ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. స్వార్థం, లబ్ధికోసం ఆడుతున్న నాటకాలను మానుకోవాలని హితవు పలికారు. ఎంత అడిగినా చేవెళ్ళ జిల్లా కేంద్రం కాదని స్పష్టం చేశారు. అపోహ పడవద్దని, నష్టం జరిగితే తాను ఊరుకునేది లేదని అన్నారు. తనకు తెలియకుండా మైలార్‌దేవరంపల్లి గ్రామాన్ని తాండూర్ నియోజకవర్గంలో కలపడమేమిటని ప్రశ్నించారు. నాగసముందర్, దమస్తాపూర్ గ్రామాలను ఇతర మండలాల్లో కలపడంపై జిల్లా కలెక్టర్‌ను కలిసి మాట్లాడతామని తెలిపారు. వికారాబాద్ ప్రాంతం వెనుకబడి ఉండి, పేదరికం ఉన్నందునే అలుసైపోయిందని వాపోయారు. గ్రామ పంచాయతీ ఉన్న చేవెళ్ళవారు అంత గొడవ చేస్తే జిల్లా ఎస్పీ కార్యాలయం, రైల్వే జంక్షన్‌లు ఉన్న వికారాబాద్ ప్రాంతం ఎలా ఊరుకుంటుందని ప్రశ్నించారు. టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జి.నాగేందర్‌గౌడ్ మాట్లాడుతూ సిఎం కేసిఆర్ స్వయానా ప్రకటించిన జిల్లా వికారాబాద్ అని గుర్తుచేశారు. అఖిలపక్షం పేరు పెట్టి కొందరు సొంత అజెండాతో బయటకు వచ్చారని విమర్శించారు. జిల్లా పోతోందని చెడు ప్రచారం చేశారని పేర్కొన్నారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్, ప్రజాభీష్టం మేరకే మండలాలు విలీనమవుతున్నాయని స్పష్టం చేశారు. మొయినాబాద్, షాబాద్, శంకర్‌పల్లి, చేవెళ్ళ మండలాల విషయంలో సిఎం కేసిఆర్ స్పష్టత కలిగి ఉన్నారని అన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రం కోసం అఖిలపక్షం చేస్తున్న ఆందోళన సరే కాని పార్లమెంటును చేవెళ్ళకు తీసుకెళ్ళిన కాంగ్రెస్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేవలం టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయగా, టిడిపి, కాంగ్రెస్ వారు పారిపోయారని విమర్శించారు. జిల్లా రాని పక్షంలో రాజీనామా చేస్తామని, అన్ని పదవులను వదులుకుంటామని సాధించేందుకు ఉద్యమం ఉద్ధృతం చేస్తామని ప్రకటించారు. సమావేశంలో వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్.రాంచంద్రారెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్మన్ హెచ్.సురేష్, మార్కెట్ కమిటి వైస్‌చైర్మన్ విజయ్, టిఆర్‌ఎస్‌కెవి జిల్లా అధ్యక్షుడు బి.కృష్ణయ్య, జడ్పిటిసి ముత్తార్‌షరీఫ్, ధారూర్ పిఎసిఎస్ అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, మార్కెట్ కమిటి డైరక్టర్ గోపాల్, మండల పార్టీ అధ్యక్షుడు వెంకటయ్య, పట్టణ పార్టీ అధ్యక్షుడు విజయేందర్‌గౌడ్, టిఆర్‌ఎస్‌వి జిల్లా అధ్యక్షుడు యాదగిరియాదవ్, మండల సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు ఎల్లారెడ్డి, జిల్లా మైనారిటీసెల్ అధ్యక్షుడు అస్లాం ఫిరోజ్, నాయకుడు నరోత్తంరెడ్డి, మైలార్‌దేవరంపల్లి సర్పంచ్ సుదర్శన్‌చారిలు పాల్గొన్నారు.
గ్రామస్తులకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే
మైలార్‌దేవరంపల్లి గ్రామాన్ని కొత్తగా ఏర్పడే కోట్‌పల్లి జిల్లాలో కలపకుండా వికారాబాద్ మండలంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గత ఏడు రోజులుగా వికారాబాద్ సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టిన గ్రామస్తులకు వికారాబాద్ శాసనసభ్యుడు బి.సంజీవరావు సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గ్రామస్తుల డిమాండ్‌ను సిఎం, జిల్లా కలెక్టర్‌ల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుదర్శన్‌చారి, నాయకులు ఎల్లారెడ్డి, టి.శంకర్, గంగులుయాదవ్‌లు పాల్గొన్నారు.
జిల్లా కోసం ఆరో రోజూ కొనసాగిన దీక్షలు
వికారాబాద్ జిల్లా కేంద్రంతో పాటు 19 మండలాల వికారాబాద్ జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారానికి ఆరు రోజులకు చేరింది. వికారాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు దీక్షలను చేపట్టారు. వీరికి మాజీ మంత్రులు డాక్టర్ ఎ.చంద్రశేఖర్, జి.ప్రసాద్‌కుమార్, మున్సిపల్ చైర్మన్ వి.సత్యనారాయణ, బిజెపి జిల్లా ప్రధానకార్యదర్శి కె.శివరాజ్‌లు సంఘీభావం తెలిపారు. పట్టణంలోని మొబైల్‌ఫోన్స్ అసోసియేషన్ వంటవార్పు నిర్వహించారు. దీక్షలు చేపట్టిన వారిలో న్యాయవాదులు కమాల్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, చౌదరి యాదవరెడ్డి, మాధవరెడ్డి, రఫి, గురువారెడ్డి, శంకర్, కిరణ్‌కుమార్, విజయభాస్కర్‌రెడ్డి, అశోక్‌లున్నారు. ఈసందర్భంగా 19 మండలాలతో కూడిన వికారాబాద్ జిల్లా ఏర్పడకుండా మంత్రి మహేందర్‌రెడ్డి అడ్డుకుంటున్నారంటూ ప్రసంగాల్లో విమర్శలు, ఆరోపణలు చేశారు. టిఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా ఇంచార్జి రంగరాజు అధ్యక్షతన అఖిలపక్షం నాయకుడు చిగుళ్ళపల్లి రమేష్‌కుమార్‌తో సహా పలువురు మాట్లాడారు.
వికారాబాద్ జిల్లా ఏర్పాటు చేయాలి
వికారాబాద్ జిల్లా కేంద్రంగా ఆరు నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటు చేయాలని టిఎస్‌యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి సిహెచ్ వెంకటరత్నం డిమాండ్ చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న జిల్లాల పునర్విభజన శాస్ర్తియంగా ఉండాలని అనిప్రాయపడ్డారు. రంగారెడ్డి జిల్లాను వికారాబాద్ జిల్లా కేంద్రంగా వికారాబాద్, తాండూర్, పరిగి, చేవెళ్ళ, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాలతో అభివృద్ది చేయాలని చెప్పారు. ప్రాంత అభివృద్దికి ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈప్రాంత విద్యార్తి, నిరుద్యోగులకు ఉపాధి సౌకర్యాల కల్పనకు ఐటి కంపెనీలు, ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి ఎన్.బాబూరావు, వికారాబాద్ అధ్యక్ష, కార్యదర్శులు ఎ.కిష్టయ్య, వినోద్, ధారూర్ అధ్యక్షుడు జి.జగన్, శేరిలింగంపల్లి అధ్యక్షుడు ఎస్.నర్సింలు, నవాబ్‌పేట అధ్యక్ష, కార్యదర్శులు జి.రాములు, ఎపి శేఖర్, మోమిన్‌పేట అధ్యక్ష, కార్యదర్శులు పరమేశ్, శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.
వికారాబాద్ జిల్లా కావడం ఖాయం
ధారూర్: జిల్లాల పునర్విభజనలో భాగంగా వికారాబాద్ జిల్లా కావడం ఖాయమని ధారూర్ మండల టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. జిల్లాల ముసాయిదా బిల్లులో ప్రకటించిన విధంగా జిల్లా చేయడం ఖాయమేనని, కాకపోతే కొన్ని మండలాలు శంషాబాద్‌లో కలిపినా మహబూబ్‌నగర్ జిల్లా నుండి కొన్ని మండలాలను కలిపి వికారాబాద్‌ను జిల్లా చేస్తారని అన్నారు. కొందరు కాంగ్రెస్ నాయకులు కావాలని రాజకీయ కారణాలతోనే కృత్రిమ ఉద్యమాలు చేస్తున్నారని విమర్శించారు.