రంగారెడ్డి

చెరువుకు గండి కొట్టారు.. మార్గం మరిచారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, సెప్టెంబర్ 24: నిజాంపేట్ గ్రామం, బండారి లే అవుట్ కాలనీలోని తుర్కచెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని అధికారులు గండి కొట్టారు. అయితే చెరువులో నుండి వరద నీరు ఉద్ధృతంగా కాలనీ అపార్ట్‌మెంట్‌లలో చేరింది. దీంతో అపార్ట్‌మెంట్ సెల్లార్‌లలో వరద నీరు నిండింది. నాలుగురోజులుగా వరద నీరు అపార్ట్‌మెంట్ సెల్లార్‌లలో నిలిచిపోయింది. దీంతో అపార్ట్‌మెంట్‌లలో నివసిస్తున్న ప్రజలు నానా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
కాలనీలోని సాకెత్ విహార్ పరిసర అపార్ట్‌మెంట్‌ల మధ్య ఉన్న వరద నీరు ఎటూ వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అపార్ట్‌మెంట్ వాసులు ఆందోళన చెందుతున్నారు. కట్ట తెగిపోకుండా గండి కొట్టి చెరువు నుండి నీటిని బయటికి పంపించారు. కాని కాలనీలో చేరుతున్న నీటిని బయటికి పంపించే మార్గాన్ని అధికారులు చూడడం లేదని సాకెత్ విహార్ అపార్ట్‌మెంట్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజుల నుండి చెరువులో నుండి వరద నీరు అపార్ట్‌మెంట్ మధ్యలోనే చేరుతుంది. బయటికి వెళ్లే పరిస్థితి లేదని తెలిపారు. పంచాయతీ సర్పంచ్ తనయుడికి కాలనీ నుండి నీరు బయటికి వెళ్లాలంటే సిసి రోడ్డును పగులగొట్టాలని కోరితే దానికి రూ.80 లక్షల నిధులతో వేసిన రోడ్డును ఏ విధంగా పగులగొడతామని సమాధానం చెప్పడం విడ్డూరంగా ఉందని కాలనీవాసులు ఆరోపించారు. ఉన్నతాధికారులైనా సిసి రోడ్డును పగులగొట్టి వరద నీరు బయటికి వెళ్లేందుకు సులభ మార్గాన్ని చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. లేదంటే పది రోజులైనా వరద నీరు అపార్ట్‌మెంట్ మధ్యలోనే ఉంటాయని కాలనీవాసులు చెబుతున్నారు. ఇప్పటికే అపార్ట్‌మెంట్ మధ్యలో ఎక్కడెక్కడ మ్యాన్‌హోల్స్‌లో మూతల్లేకుండా ఉన్నాయో తెలియని దుస్థితి నెలకొందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అపార్ట్‌మెంట్ మధ్యలో చేరిన వరద నీరు బయటికి వెళ్లేలా వెంటనే చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు వేడుకుంటున్నారు.
బండారిలో కొనసాగుతున్న వరద ఉద్ధృతి...
బండారి లే అవుట్ కాలనీలో వరద ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత నాలుగురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తుర్క చెరువు నిండి కాలనీని ముంచెత్తింది. నాలుగురోజులు గడుస్తున్నా వరద నీరు మాత్రం తగ్గడం లేదు. వరద నీటిలోనే బాధితులు రాకపోకలు సాగిస్తున్నారు. అపార్ట్‌మెంట్ సెల్లార్‌లలో వరదనీరు నిండిపోయింది. దీంతో అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లలో నివసించే ప్రజలు కిందకు దిగలేని దుస్థితి నెలకొంది.
నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో అపార్ట్‌మెంట్‌ల నుండి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు, బంధువుల ఇళ్లకు, స్నేహితుల ఇళ్లకు తరలివెళ్లారు.
దూరప్రాంతాలకు వెళ్లలేని స్థితిలో ఉన్న వారు మాత్రమే దిక్కులేక కాలాన్ని వెల్లదీస్తున్నారు. ఎప్పటికప్పుడు వరద నీటిని బయటికి పంపించే తక్షణ చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.