రంగారెడ్డి

రూ. 19కోట్లతో మంచినీటి సమస్య పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హయత్‌నగర్, ఏప్రిల్ 28: రంగారెడ్డి జిల్లాలో రూ.19 కోట్లతో మంచినీటి సమస్యను పరిష్కరించనున్నట్టు రాష్ట్ర రవాణా శాఖమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం చంపాపేట్ డివిజన్ గాంధీబొమ్మ వద్దగల ఖాళీస్థలంలో రూ.2కోట్లతో చేపట్టిన మల్టీలెవల్ ఫంక్షన్‌హాల్, రూ.50 లక్షలతో మోడల్ మార్కెట్ నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ సామ రమణారెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం హస్తినాపురం డివిజన్ రాఘవేంద్రనగర్ కాలనీలో రూ.20 లక్షలతో చేపట్టిన బిటి రోడ్డు పనులకు కార్పొరేటర్ పద్మానాయక్‌తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గంలో రూ.9కోట్లతో సిసి రోడ్లు, ఫంక్షన్‌హాల్, మోడల్ మార్కెట్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసినట్టు చెప్పారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు నగరంలో లక్ష డబుల్‌బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తున్నట్టు తెలిపారు. పేద ప్రజల అభ్యున్నతే ద్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ సర్కిల్ కమిషనర్ రఘుప్రసాద్, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, డిఇ బద్రునాయక్, ఏఇ శ్రీనివాస్, నాయకులు సామ సురేందర్‌రెడ్డి, బసిగూడెం జంగారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, కృష్ణారెడ్డి, మొగిలిపువ్వు నారాయణ, బీసుకుంట్ల సతీష్‌గౌడ్, రామ్‌లక్ష్మణ్ పాల్గొన్నారు.