రంగారెడ్డి

నాలాలను పరిశీలించిన మంత్రి జూపల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, సెప్టెంబర్ 30: నాలాలపై, చెరువులపై ఆక్రమించిన నిర్మాణాలను కూల్చివేయక తప్పదని పంచాయతీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం రాజేంద్రనగర్ మండలం పూప్పాలగూడ, మణికొండలోని పందెన్ వాగు నాలాపై ఆక్రమంగా నిర్మించినా భవనాలను పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ గత కొన్ని రోజుల క్రితం భారీ వర్షాలతో నగరంలోని పలు కాలనీలు వరదనీటిలో చిక్కుకున్నాయని గుర్తుచేశారు. వరద నీరుతో బాధితులు వారం రోజులుగా నీటిలో ఉండాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. దీనికి అంతటికి కారణం నాలాలపై, చెరువులపై ఎక్కడిక్కడగా కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడంతోనే నేడు ఈ పరిస్థితి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. వరద నీటితో పలు కాలనీవాసులు ఇబ్బందులు పడాల్సి వచ్చిందన్నారు. నాలాలపై, చెరువులను కబ్జా చేసిన నిర్మాణాలను వెంటనే కూల్చివేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
ఐదు రోజులుగా నగరంలోని పలు నాలాలపై, చెరువులపై అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు అటు జిహెచ్‌ఎంసి, ఇటు జిల్లా పంచాయతీ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. కాగా రాజేంద్రనగర్ మండలం పరిధిలోని పూప్పాలగూడ, మణికొండ గ్రామాలలో పందెన్ వాగు నాలాపై అక్రమంగా వెలిసిన భవనాలను కూల్చివేయక తప్పదని మంత్రి హెచ్చరించారు. కూల్చివేతలతోపాటు శంషాబాద్‌లో రెండు అక్రమ లేఔట్లను జిల్లా పంచాయతీ అధికారులు తొలిగించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారిణి డాక్టర్ జె.అరుణ, స్థానిక సర్పంచ్ నరేందర్‌రెడ్డి ఉన్నారు.