రంగారెడ్డి

రివాల్వర్‌తో బెదిరింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరూర్‌నగర్, సెప్టెంబర్ 30: ఉద్యోగం ఇప్పిస్తానని సచివాలయ ఉద్యోగి ఒకరు నిరుద్యోగుల దగ్గర డబ్బులు తీసుకున్న సంఘటన శుక్రవారం మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వాతం శ్రీనివాసులురెడ్డి సచివాలయంలో కో-ఆపరేటివ్ శాఖలో డిప్యూటీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నాడు. సంతోష్‌నగర్‌లో నివాసం ఉండే మల్లిఖార్జున్ నాయక్ అనే వ్యక్తికి ఉద్యోగం ఇప్పిస్తానని శ్రీనివాసులురెడ్డి రెండు సంవత్సరాల క్రితం రూ. 2 లక్షల 50వేలు తీసుకున్నాడు. ఈ మేరకు బాధితుడు మీర్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉద్యోగం ఇప్పించకపోగా తన డబ్బులు తిరిగి ఇవ్వాలని శ్రీనివాసులు రెడ్డిని అడిగితే తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘నీవు నాకు ఎప్పుడు డబ్బులు ఇచ్చావు.. మరోసారి డబ్బులు అడిగితే రివాల్వర్‌తో కాల్చి చంపుతా’ అంటూ బెదిరించాడని మల్లిఖార్జున్ నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనతోపాటు మరో 10 మంది దగ్గర శ్రీనివాసులు రెడ్డి ఉద్యోగాల పేరుతో డబ్బులు తీసుకున్నట్టు బాధితుడు తెలిపాడు. ఉద్యోగం ఇప్పిస్తానని శ్రీనివాసులురెడ్డి అనే వ్యక్తి తన నుంచి రూ.2 లక్షల 50 వేలు తీసుకున్నాడని మల్లిఖార్జున్ నాయక్ తమకు ఫిర్యాదు చేసినట్టు మీర్‌పేట్ ఎస్‌ఐ భాస్కర్ తెలిపారు. కేసు విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.