రంగారెడ్డి

తాండూరు రెవెన్యూ డివిజన్‌తోనే పరిపాలన ప్రయోజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, అక్టోబర్ 2: తాండూరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయడంతోనే ఈప్రాంతంలోప్రజలకు నిజమైన పరిపాలన సౌలభ్యం ఓనగూరుతుందంటూ తాండూరు ప్రజాసంఘాలు, రైతు సంఘాలు, స్వచ్ఛంద సేవాసంస్థలు, విద్యావంతుల వేదిక ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఆదివారం తాండూరు నెహ్రూగంజ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ దశాబ్దాల కాలం నుండి తాండూరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలనే డిమాండ్ కొనసాగుతుందని అన్నారు. కాంగ్రెస్, టిడిపి పాలకులు వహించిన నిర్లక్ష్యం, అవగాహానారాహితంతో తాండూరు రెవెన్యూ డివిజన్‌గా ఉన్నతి ప్రతిపాదన మరుగున పడిందని చెప్పారు. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ పాలకులు ప్రజలకు పరిపాలనా సౌలభ్యం, కింది స్థాయి వరకు ఉన్నతాధికారుల సేవలు అందించాలనే లక్ష్యం ఆచరణ, అమలు ప్రక్రియ హేతుబద్ధంగా ఉండాలని కోరుతున్నట్లు పి.రాంరెడ్డి, పి.నర్సిరెడ్డి, పి.బాల్‌రెడ్డి, యాదగిరి, లక్ష్మయ్య, శ్రీనివాస్, బి.రాజ్‌కుమార్, యు.రమేష్‌కుమార్, కె.వాసు, రాజప్పగౌడ్, కృష్ణయ్య, లక్ష్మణ్ రావు, సయ్యద్ శుకూర్, కె.చంద్రయ్య, నారాయణ, మల్లేశం, షబ్బీర్‌మియా, ఎంఎ అలీం, జి.రాములు పేర్కొన్నారు. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 23 జిల్లాల్లో అగ్ర స్థానంలో ఉన్న రంగారెడ్డి జిల్లా ప్రస్తుత తెలంగాణలో ఆఖరి స్థానానికి దిగజారిందని చెప్పారు. మూడు ముక్కలయిన రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్ గ్రామీణ జిల్లా ఏర్పాటుతో ఈప్రాంతానికి ఆర్థికంగా ఓనగూరే ప్రయోజనం శూన్యమని అభిప్రాయపడ్డారు. ఆర్థిక ప్రయోజనాలు, ఉన్నత విద్యా అవకాశాలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్గిన మొయినాబాద్, శంకర్‌పల్లి, షాబాద్ వంటి మండలాలు నూతన శంషాబాద్ జిల్లా వశం కావడంతో, వికారాబాద్ చిన్నగ్రామీణ జిల్లా ఏర్పాటు నామమాత్రమే అవుతుందని పేర్కొంటున్నారు. తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెళ్ల నాలుగు నియోజకవర్గాలతో కూడిన రంగారెడ్డి జిల్లాలో, మహబూబ్‌నగర్ జిల్లాలోని కొడంగల్, బోంరాస్‌పేట్,దౌల్తాబాద్ వంటి మూడు మండలాలను కలపడం, ఈకొత్తగా చేరుతున్న మండలాలకు తాండూరు డివిజన్ అతి సమీపంలో ఉండటంతో ఆయా మండలాలవారు తమకు మహబూబ్‌నగర్ జిల్లా కంటే రంగారెడ్డి జిల్లాలో కలపటం సదవకాశం అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నట్లు సమావేశంలో పాల్గొన్న కొడంగల్ నియోజకవర్గానికి చెందిన పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా తాము ఇంతకాలం మహబూబ్‌నగర్ జిల్లాలో కొనసాగినా తమ వ్యాపారాలు, వ్యవసాయ మార్కెటింగ్, తమ పంట ఉత్పత్తులను తాండూరు మార్కెట్లకే తరలించేవారమని తెలిపారు. తాము రంగారెడ్డి జిల్లాలో చేరేందుకు ప్రధాన కారణం తాండూరును రెవెన్యూ డివిజన్‌గా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నందుకు మాత్రమే అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తీకరించారు. ఏదేమైనా తాండూరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయడంతోనే ఈప్రాంతంలో పరిపాలన సౌలభ్యం చేకూరుతుందంటూ సమావేశంలో అందరూ ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. కాగా ఇటివల తాండూరు నియోజకవర్గంలోని కొటపల్లి సైతం కొత్త మండలంగా రూపుదాల్చుకుందన్నారు. దాంతో తాండూరు రెవెన్యూ డివిజన్‌కు గతంలో ఉన్న యాలాల, బషీరాబాద్, తాండూరు, పెద్దెముల్‌తోపాటు, కొట్‌పల్లి, కొడంగల్, బోంరాస్‌పేట్, దౌల్తాబాద్ మండలాల చేరికతో మొత్తం ఎనిమిది మండలాలు, తాండూరు మున్సిపాలిటీలతో అతి పెద్ద రెవెన్యూ డివిజన్‌గా రూపాంతరం చెందుతుందని వివరించారు. కాగాప్రస్తుతం 19 మండలాల వికారాబాద్ జిల్లాలో అతి పెద్ద వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, రవాణా రంగాలకు ప్రముఖ కేంద్రంగా ఉన్న తాండూరులో చుట్టు ప్రక్కల మండలాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారికి మెండుగా ఉపాధి అవకాశాలు ఉన్నట్లు ఆయా సంఘాల ప్రతినిధులు వివరించారు. తాండూరు నుంచి మంత్రివర్గంలో రవాణాశాఖ మంత్రిగా ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తాండూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు గట్టి కృషి చేయాలని కోరారు. లేదంటే తాండూరు అఖిల పక్షం ఉద్యమాలకు తామంతా ఏకమై ఉద్యమాన్ని తారాస్థాయికి చేర్చుతామని హెచ్చరించారు.