రంగారెడ్డి

సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో ‘ఎస్కేప్ 2.0’ హంగామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శామీర్‌పేట, అక్టోబర్ 4: సెయింట్ ప్రాన్సిస్ మహిళ కాలేజీలో ‘ఎస్కేప్ 2.0’ హంగామా కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ నటుడు అల్లు శిరీష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ వేడుకల సందర్భంగా ఈ కాలేజీ విద్యార్థినులు వివిధ క్లబ్బులుగా విభజించి వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలను ఇచ్చారు. ఎక్స్‌ప్రెషన్స్ (ఆర్ట్స్ క్లబ్), స్పెక్ట్రమ్ (సైన్స్ క్లబ్), కాఫీ (కామర్స్ క్లబ్), అరిస్టా(బిఎంఎస్ క్లబ్), ప్రకృతి (ఎన్విరాల్‌మెంటల్ సైన్స్ క్లబ్), వోక్ టాలెంట్ (బ్యాచులర్ వోకేషనల్ క్లబ్)గా విభజించి ప్రదర్శనలను ఇచ్చారు. ఎక్స్‌ప్రెషన్స్ క్లబ్బుకు సినీ నటుడు సుమంత్ అశ్విన్ నేతృత్వంలో వివిధ రకాల ఆటలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. అరిస్టా క్లబ్ హంగర్స్ గేమ్స్, షేప్ స్టాక్స్, వోక్ టాలెంట్ క్లబ్ హెడ్స్ అప్ కార్యక్రమంలో వృధాగా ఉన్నవాటితో ఉపయోగపడే విధంగా క్రియేటివ్ ఐడియాలాంటి కార్యక్రమాన్ని నిర్వహించింది. కాగితంతో పలు రకాల డిజైన్లను తయారు చేయడంలో ప్రకృతి క్లబ్ చొరవ చూపగా, స్పెక్ట్రమ్ క్లబ్ 3 రకాల ఈవెంట్లను నిర్వహించింది. ‘రబ్ నే బడాది జోడీ’, బార్న్ టు వండర్, మైండ్ బాగ్లర్స్ వంటి కార్యక్రమాలను నిర్వహించి అందరిని ఆకట్టుకుంది. కాఫీ క్లబ్ నేతృత్వంలో మార్కెటింగ్ ఈవెంట్, ఇంటర్వూ నమూనా, వస్తువుల తయారీ క్రయ, విక్రయాలపై మార్కెటింగ్ నైపుణ్యతపై ప్రదర్శనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలేజీ విద్యార్థునులు ఎంతో ఉత్సాహంగా ప్రదర్శనలు ఇవ్వగా కాలేజీ ప్రిన్సిపా డాక్టర్ సీనియర్ క్రిస్టియన్ ఫర్నాడెంజ్ పాల్గొన్నారు.