రంగారెడ్డి

రుణాల అందజేతలో బ్యాంకర్లు లక్ష్యం చేరుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరూర్‌నగర్, అక్టోబర్ 4: ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన రుణాల లక్ష్యాలను పూర్తిచేసి, గ్రౌండింగ్ చేయాలని బ్యాంకర్లకు హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్ సూచించారు. మంగళవారం హైదరాబాద్ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన వివిధ పథకాల రుణాలను, ప్రైవేట్ బ్యాంకులు కూడా పాల్గొని లబ్ధిదారులకు విరివిగా రుణాలను మంజూరు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిఎంఈజిపితో పాటు ప్రధాన మంత్రి ఆర్థిక కార్యక్రమాల కింద రుణాలను అందజేయాలని బ్యాంకర్లను కోరారు. పిఎం ముద్ర యోజన, స్టాండప్ ఇండియా పథకాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి అర్హులైన లబ్ధిదారులకు రుణాలను అందజేయాలని అన్నారు. ఈ పథకాల కింద లక్ష్యాలను అధిగమించి రుణాలను మంజూర్ చేసిన బ్రాంచులకు అవార్డులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక పరమైన విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా బ్యాంకర్లు పెద్ద ఎత్తున ఫైనాన్షియల్ లిట్రసీ క్యాంపెయిన్‌లను నిర్వహించాలని అన్నారు. విద్యార్థుల స్కాలర్‌షిప్పుల నిమితం 10 సంవత్సరాలలోపు పిల్లలకు కూడా జీరో బ్యాలెన్స్ అకౌంట్లు తెరవాలని బ్యాంకర్లకు తెలిపారు. గ్రౌండింగ్ అయిన యూనిట్లకు సంబంధించిన యుటిలైజేషన్ సర్ట్ఫికెట్లను సంబంధిత శాఖలకు వెంటనే పంపాలని పేరొన్నారు. కొత్తగా ఏర్పడ్డ స్వయం సహయక సంఘాలకు, మోప్మా సంఘాలకు రుణాలను ఇవ్వాలని అన్నారు. బిసి కార్పొరేషన్ కింద 2015-16 సంవత్సరానికి 740 యూనిట్ల లక్ష్యాన్ని అధిగమించి, 747 యూనిట్లు మంజూరు చేశామని అన్నారు. 471 యూనిట్లకు సంబంధించిన సబ్సిడీని మంజూరు చేశామని తెలిపారు. మంజూరైనా యూనిట్లను త్వరితగిన గ్రౌండ్ చేయాలని బ్యాంకర్లను కోరారు. ఎస్సీ కార్పొరేషన్ కింద 1581 యూనిట్ల లక్ష్యానికి 1171 యూనిట్లు మంజూరు చేయగా, ఇందులో 558 యేనిట్లను గ్రౌండ్ చేశామని అరు. మిగతా లక్ష్యాలను కూడా పూర్తి చేసి గ్రౌండ్ చేయాలని, మైనారిటీ కార్సొరేషన్ కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసి యూనిట్లను గ్రౌండ్ చేయాలని అన్నారు. ఆర్‌బిఐ ఎజిఎం ఉదయ్ శంకర్ మాట్లాడుతూ జిల్లాలో సిక్ యూనిట్లను పునరుద్దరించేందుకు వీలుగా జిల్లా స్థాయిలో ప్రేమ్‌వర్క్ రిహబిలిటేషన్ కమిటీని ఏర్పాటు చేసి పూర్తి వివరాలను సేకరించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీటిని సమర్థవంతంగా అమలు చేసి, ఈ పథకాల కింద బ్యాకర్లు సాధించిన లక్ష్యాలపై ప్రొగ్రెస్ రిపోర్టును ఆర్‌బిఐకి పంపాలని కోరారు. కార్యక్రమంలో ఎల్‌డిఎం నాగేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ ఇడి హన్మంతు, మైనారిటీ కార్పొరేషన్ ఇడి అహల్యా, బిసి కార్పొరేషన్, ఇతర అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.