రంగారెడ్డి

వికారాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షుడిగా కరణం ప్రహ్లాదరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధారూర్, నవంబర్ 17: వికారాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షుడిగా కులకచర్ల మండలానికి చెందిన కరణం ప్రహ్లాదరావు ఎన్నికయ్యారు. గురువారం స్థానిక నాగేశ్‌గుప్త గార్డెన్‌లో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో కరణంను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
అధ్యక్ష పదవికి తాండూర్‌కు చెందిన బాలేశ్వర్‌గుప్త, వికారాబాద్‌కు చెందిన శివరాజ్, పరిగి నియోజకవర్గానికి చెందిన కరణంల మధ్య పోటీ ఉండగా శివరాజ్ పోటీ నుండి తప్పుకోవడంతో, ప్రహ్లాదరావు, బాలేశ్వర్‌గుప్తల మధ్య పోటీ కొనసాగింది.
ఎట్టకేలకు ప్రహ్లాదరావు ఎన్నికయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసంఘ్‌లో సభ్యత్వం తీసుకుని గత 40 సంవత్సరాలుగా బిజెపిలో పనిచేస్తున్నామని చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన వికారాబాద్ జిల్లా పార్టీ తెలంగాణ రాష్ట్రంలోనే ముందుండేందుకు కృషి చేస్తామని తెలిపారు. గ్రామ స్థాయి నుండి పార్టీని పటిష్టపర్చి, పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులుండేలా మూడు సంవత్సరాల్లో బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.
తాను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు సహకరించిన వారికి ధన్యవాదాలు చెప్పారు. ఈసందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఆయనకు పూలమాల వేసి మిఠాయి తినిపించి అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాములు, సమన్వయకర్త ఆలె భాస్కర్, ఎన్నికల ఇంచార్జి భూపతిరెడ్డి, నాయకులు ప్యాటబాల్‌రెడ్డి, నాగారం నర్సింలు, నందకుమార్‌యాదవ్, శ్రీవర్ధన్‌రెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యదర్శి శేరి నర్సింగ్‌రావు, బిజెపి జిల్లా ప్రధానకార్యదర్శి కె.శివరాజ్, అసెంబ్లీ కన్వినర్ జి.పాండుగౌడ్, జిల్లా కార్యదర్శి జి.విజయభాస్కర్‌రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు పోకలసతీష్‌కుమార్, నాయకులు రాములు, నరేందర్‌రెడ్డి, అనిల్‌యాదవ్, వివేకానందరెడ్డి, మణికంఠ పాల్గొన్నారు. కాగా, జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన కరణం ప్రహ్లాదరావు పార్టీ వర్గాలు అనంతగిరి శ్రీ అనంతపద్మనాభస్వామిని దర్శించుకున్నారు.