రంగారెడ్డి

గులాంనబీ ఆజాద్ దిష్టిబొమ్మ దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, నవంబర్ 21: పెద్దనోట్ల రద్దుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ దిష్టిబొమ్మను బిజెపి నాయకులు దగ్ధం చేసారు. బిజెపి నేత ఏనుగు రాజిరెడ్డి ఆధ్వర్యంలో కీసర చౌరస్తాలో గులాంనబీ ఆజాద్ దిష్టిబొమ్మను దగ్ధం చేసారు.
రాజిరెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో ఉంటూ పాకిస్తాన్ ఉగ్రవాదులకు ప్రోత్సహించేలా వాఖ్యలు చేసిన ఆజాద్ జాతికి క్షమాణ చెప్పాలని అన్నారు. నల్లధనాన్ని బయటపెట్టే ప్రక్రియలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ.. వెయ్యి, ఐదువందల రూపాయల నోట్లను రద్దు చేశారని అన్నారు. యురి ఉగ్రఘటనతో ఆజాద్ పోల్చటంపై బిజెపి నాయకులు మండిపడ్డారు. కోట్ల రూపాయలు కుంభకోణం చేసిన కాంగ్రెస్‌కి మాట్లాడే హక్కు లేదని అన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు జి.తిరుమల్‌రెడ్డి, నాయకులు ఎస్.వెంకట్‌రెడ్డి, ఆర్.ఆశోక్, కె.నగేశ్, రమేశ్‌రెడ్డి, బాల్‌నర్సింహ, శ్రీశైలం, ఎం.వెంకటేశ్, మహేందర్ యాదవ్, సత్యనారాయణ, శ్రీనివాస్, రాంరెడ్డి, దుర్గేశ్, కుమార్, శ్రీనివాస్, బాలరాజు పాల్గొన్నారు.
సంక్షేమ వసతి గృహాల్లో
వౌలిక వసతులు కల్పించాలి
ధారూర్, నవంబర్ 21: సంక్షేమ వసతి గృహాల్లో వౌలిక వసతులు కల్పించాలని ఏబివిపి జిల్లా హాస్టళ్ళ కన్వీనర్ ప్రవీణ్ డిమాండ్ చేశారు. సోమవారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ విద్యాసంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు గడుస్తున్నా సంక్షేమ వసతి గృహాల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా స్కూల్ యూనిఫాంలు, బెడ్‌షీట్లు, ట్రంక్‌పెట్టెలు, గ్లాస్, ప్లేట్ అందించకపోగా, కాస్మొటిక్స్ చార్జీలు సకాలంలో ఇవ్వకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చలితీవ్రతను దృష్టిలో పెట్టుకునైనా దుప్పట్లను సరఫరా చేయాలని, చాలీ చాలని దుప్పట్లలో కునుకుతీయాల్సిన పరిస్థితి ఉందని వాపోయారు. తక్షణమే అధికారులు స్పందించి సంక్షేమ వసతి గృహాలపై దృష్టి సారించాలని లేకుంటే ఏబివిపి రాజీలేని పోరాటం చేస్తుందని హెచ్చరించారు. సమావేశంలో నగర కార్యదర్శి మహేశ్, జోనల్ ఇన్‌చార్జి మనోజ్, నాయకులు బాల్‌రాజ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.