రంగారెడ్డి

ఘట్‌కేసర్‌లో అయ్యప్ప శరణు ఘోష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, డిసెంబర్ 4: స్వామియే అయ్యప్ప, శరణం, శరణం అయ్యప్ప అంటు అయ్యప్ప మాలధారులు చేసిన శరణు ఘోష ఘట్‌కేసర్ మండలంలో మారుమోగింది. ఘట్‌కేసర్ పంచాయతీ అనుబంధ గ్రామం శివారెడ్డిగూడెం గ్రామంలోని శ్రీ దండ్లగడ్డ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం ఆవరణలో శ్రీ ధర్మశాస్త్ర సేవాసమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మండల పూజ ఆదివారం ఘనంగా జరిగింది.
గురుస్వామి బర్ల ఆంజనేయులు చేతుల మీదుగా మహా పడి పూజామహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో వేలాది మంది అయ్యప్ప మాలధారులు, ప్రజలు, మహిళల సమక్షంలో కనుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ సర్దార్ పుటం పురుషోత్తం, మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, ఎంపిపి బండారి శ్రీనివాస్‌గౌడ్, జడ్పీటిసి మంద సంజీవరెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ సార శ్రీనివాస్‌గౌడ్, డైరక్టర్లు బొక్క ప్రభాకర్‌రెడ్డి, కొంతం అంజిరెడ్డి, టిఆర్‌ఎస్ జిల్లా కార్యదర్శి తరిణే మహింద్రాచారి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఘట్‌కేసర్ పంచాయతీ కార్యాలయం ఆవరణలోని అయ్యప్పస్వామి ఆలయం నుండి మణికంఠస్వామి విగ్రహాన్ని అశ్వరథంపై ప్రతిష్ఠించి కేరళ త్రయంబక వాయిద్యాలతో ఊరేగింపుగా శివారెడ్డిగూడ గ్రామంలోని పడిపూజ ప్రాంగణం వరకు తీసుకువెళ్లారు.
పడి పూజలో 18 మెట్ల పూజతో పాటు స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. మండలవ్యాప్తంగా ఉన్న అయ్యప్ప స్వామి మాలధారుల సమక్షంలో జరిగిన పడిపూజ మహోత్సవంలో ప్రజలు, మహిళలు వందలాదిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించటంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అయ్యప్ప మాలధారులు ఆలపించిన భక్తి గీతాలు, కీర్తనలు, భజనలు చూపరులను ఎంతగానో ఆకర్షించాయి. దీంతో మహా పడిపూజ ప్రాంగణం అయ్యప్ప శరణు ఘోషతో మారుమోగింది.
అయ్యప్ప మాలధారులు చేసిన పేటతులై నృత్యాలు అందరినీ ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తన ధ్రువీకరణ అప్పీలేట్ అథారిటీ డైరక్టర్ రేసు లక్ష్మారెడ్డి, మండల టిఆర్‌ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు బోయపల్లి కొండల్‌రెడ్డి అయా గ్రామాల నాయకులు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.