రంగారెడ్డి

బాలుడిపై లైంగిక దాడి.. ఆపై హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేవెళ్ల, డిసెంబర్ 5: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు అభయం శుభం తెలియని ఓ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడి, గొంతు కోసి కిరాతకంగా హతమార్చిన సంఘటన మొయినాబాద్ మండలం చిల్కార్‌లో ఆదివారం రాత్రి వెలుగుచూసింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. చిలుకూర్ గ్రామానికి చెందిన కాడిగల్ల మహేందర్ కుమారుడు రోహన్‌కుమార్ అలియాస్ చక్రి (9),ఓ ప్రైవేట్ పాఠశాలలో నాల్గవ తరగతి చదువుతున్నాడు. అదే ప్రాంతంలో మహబూబ్‌నగర్‌కు చెందిన సంతోష్ (21) తోటి పిల్లలతో ఆడుకుంటున్న రోహన్‌కుమార్‌ను చాక్లెట్ ఇప్పిస్తానంటూ రెండో అంతస్తుకు తీసుకెళ్లాడు. సెల్ ఫోన్‌లోని అశ్లీల దృశ్యాలు చూపెడుతూ కాళ్లు, చేతులు కట్టేశాడు. తనతో పాటు తెచ్చుకున్న కండోమ్‌ను ఉపయోగించి లైగింక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తల్లి, దండ్రులకు చెపుతాడేమోనని భయంతో బాలుడిని మూడో అంతస్తుకు తీసుకెళ్లి కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. మృత దేహాన్ని ఇంటిపై ఉన్న సంపులో వేశాడు. తనకేమీ తెలియనట్టు బాలుడి తల్లితో కలసి వెతక సాగాడు. కొద్ది సేపటి తరువాత హిమాయత్‌సాగర్ చౌరస్తాకు చేరుకున్న సంతోష్, బట్టలు వ్యాపారం చేస్తున్న సమయంలో తాండూర్‌లో ఒ మహిళ్ల వద్ద దొంగలించిన సెల్ ఫోన్‌తో రోహన్‌కుమార్ తండ్రి మహేందర్‌కు ఫోన్ చేసి బషీరాబాద్ నుండి మాట్లాడుతున్న నీ కొడుకు నా వద్దే ఉన్నాడు.. రూ. 5లక్షలు ఇస్తేనే నీ కోడుకును వదిలేస్తానాన్ని ఫోన్‌లో చెప్పి స్విచ్చ్ఫా చేశాడు. అనుమానం వచ్చి విచారించగా అసలు విషయం బయటపడింది. రాజేందర్‌నగర్ ఏసిపి గంగారెడ్డి, సిఐ శ్రీనివాస్ సంఘటనా స్థలాన్ని సందర్శించి సంతోష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు ఏసిపి గంగారెడ్డి తెలిపారు. పోలీస్‌స్టేషన్‌ను సైబరాబాద్ కమిషనర్ సందీప శాండియ్య సందర్శించి వివరాలను తెలుసుకున్నారు.

రైతులకు బ్యాంకర్లు సకాలంలో పంట రుణాలు అందజేయాలి
కీసర, డిసెంబర్ 5: రైతులులకు సకాలంలో బ్యాంకర్లు పంట రుణాలు అందజేయాలని కలెక్టర్ ఎంవి రెడ్డి ఆదేశిచారు. కలెక్టర్ కార్యాలయంలో బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సంవత్సరం ముందుగానే యాసంగి, ఖరీఫ్, రబీ పంట రుణాలకు ప్రణాళికలను సిద్ధం చేసి బ్యాంకర్లకు అధికారులు అందజేస్తామని అన్నారు.
అయినా బ్యాంకర్లు సకాలంలో రైతులకు రుణాలు అంజేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. నిర్ధేశిత లక్ష్యాలను అందించటంలో బ్యాంకర్లు ఎందుకు నిర్లక్యం చేస్తున్నారంటూ అధికారులపై మండిపడ్డారు. రబీకి సంబంధించి ఇంకా రైతులుకు రుణాలు అందలేదని, 15 రోజుల్లోగా రుణాలు అందజేయాలని ఆదేశించారు. ప్రభుత్వం రుణాలు మాఫీ చేసినా వడ్డీ ఎందుకు మాఫీ చేయటం లేదని అన్నారు ప్రభుత్వం నాలుగు శాతం వడ్డీ చెల్లిస్తుందని, ఏడు శాతం మాత్రమే రైతులు దగ్గర వసూలు చేయాలని కోరారు. రుణాలు సకాలంలో అందించని బ్యాంకు అధికారులై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ బ్యాంకుల అధికారులు, ఉద్యానవన శాఖ అధికారులు పాల్గొన్నారు.