రంగారెడ్డి

లక్షమంది విద్యార్థులతో సిఎం ఇల్లు ముట్టడి: కృష్ణయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, డిసెంబర్ 5: ఎనిమిది రోజుల్లో ఫీజు బకాయిలు చెల్లించకుంటే లక్ష మంది విద్యార్థులతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఇల్లు ముట్టడిస్తామని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. ఫీజుల బకాయిలు రూ.2090కోట్లు చెల్లించాలని, మెస్ చార్జీలు పెంచాలని సోమవారం మధ్యాహ్నం మాసాబ్‌ట్యాంక్ తెలుగు సంక్షేమ భవన్‌ను పెద్దఎత్తున విద్యార్థులు ముట్టడించారు. కృష్ణయ్య మాట్లాడుతూ గత సంవత్సరం 14లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థుల రూ.2090కోట్లు ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మంత్రులు, శాసనసభ్యుల జీతాలు మూడు నాలిగింతలు పెంచారని, కానీ, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు ఎందుకు పెంచరని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరల ప్రకారం మెస్ చార్జీలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండు నెలలుగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న ప్రభుత్వం ఇంతవరకు బడ్జెట్ విడుదల చేయకుండా తాత్సారం చేస్తోందని అన్నారు. విద్యార్థులకు పాత బకాయిలతో పాటు కొత్త బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని పేర్కొన్నారు. నెలలోపు ఫీజు బకాయిలు చెల్లిస్తామని ముఖ్యమంత్రి కేసిఆర్.. అసెంబ్లీలో ప్రకటించారని కృష్ణయ్య గుర్తుచేశారు. కానీ, నెలలు గడుస్తున్న నేటికి విద్యార్థుల బకాయిలు మాత్రం విడుదల చేయలేదని పేర్కొన్నారు. చదువుపూర్తయిన విద్యార్థుల సర్ట్ఫికెట్లు కాలేజి యాజమాన్యాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఫీజులు కట్టి సర్ట్ఫికెట్లు తీసుకపోవాలని యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తున్నారని అన్నారు. చదువుకొనసాగిస్తున్న విద్యార్థులకు ఫీజులు కట్టే వరకూ క్లాసులకు రానివ్వడం లేదని, ఫీజులపై ఆధారపడి చదువుతున్న విద్యార్థులకు ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో చదువు మానుకునే పరిస్థితి దాపురించిందని అన్నారు. ఎన్నికల్లో కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్యా ఇస్తానని హామీ ఇచ్చిందని, కేసిఆర్ దానిని మారిచారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. కెజి నుంచి పిజి విద్యాను ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. పేదలు చదువుతుంటే దొరల ప్రభుత్వం ఓర్వలేకపోతోందని విమర్శించారు. ప్రభుత్వం మొత్తం ఫీజుల భర్తిస్తుందనే ఆశతో వచ్చి వృత్తివిద్య, ఉన్నతవిద్య కోర్సులను వెనుకబడిన కులాలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలు చదువుకుంటున్నారని తెలిపారు. కాలేజి హస్టల్ విద్యార్ధుల మెస్ చార్జీలను నెలకు రెండు వేల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. నెలకు రూ.500 పాకెట్ మనీ ఇవ్వాలని కోరారు. విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాలని పక్షంలో లక్ష మంది విద్యార్థులతో ముఖ్యమంత్రి ఇల్లును ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బిసి సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, నర్సింగౌడ్, కులకచర్ల శ్రీనివాస్, జి.కృష్ణా, సతీష్, రాణా కృష్ణా, మల్లేష్ యాదవ్, వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు.

నీటి లభ్యత, భూ సారాలకు అనుగుణంగా రైతులు పంటలు
రాజేంద్రనగర్, డిసెంబర్ 5:్భసారానికి, నీటి లభ్యతకు అనుగుణంగా రైతులు పంటలు వేసి ఎరువులపై ఖర్చులను తగ్గించుకోవాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ అన్నారు. సోమవారం ప్రపంచ భూసార దినోత్సవం సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ పాల్గొని ప్రసంగించారు. వ్యవసాయ శాస్తవ్రేత్తలు, అధికారుల సూచనలను అనుసరిస్తూ రైతులు నిర్దేశిత మోతాదులో ఎరువులు, పురుగుల మందులను వాడాలని సూచించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్తవ్రేత్త డాక్టర్ ఉమాదేవి మాట్లాడుతూ భూసార పరిక్షా కార్డు విశే్లషణ, భూ సారాన్ని కాపాడుటకు జీవన ఎరువులు, సేంద్రియ పదార్థం, పంట మార్పిడి ప్రాధాన్యతను వివరించారు. జాతీయ సుస్థిర వ్యవసాయ భూసార పరిస్థితి, భూసార పరీక్షల నిమిత్తం నమూనాలు సేకరించి భూసార ఫలిత కార్డును అందజేశారు. కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు, ఏరువాక కేంద్రం శాస్తవ్రేత్త డాక్టర్ ప్రవీణ్‌రావు, రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి కే ఎన్ జగదీష్, వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ పాల్గొన్నారు.