రంగారెడ్డి

మున్సిపాలిటీ స్థలం కబ్జాకు దురాక్రమణదారుల దౌర్జన్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, డిసెంబర్ 6: తాండూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ, అసైన్డ్ భూముల దురాక్రమణల పర్వం జోరుగా సాగుతుంది. స్థానిక సంబంధిత రెవెన్యూ అధికారుల అలసత్వం, అవినీతి తతంగాల పుణ్యమా అంటూ తాండూరులోని కొందరు భూ మాఫీయా మూఠాలు, మరికొందరు అధికార, విపక్ష పార్టీలకు చెందిన రాజకీయులు, వారికి తోడు మరికొందరు రాజకీయ బ్రోకర్లుగా వ్వవహారిస్తున్న దగా కోరులు పార్టీలకు అతీతంగా ఏకమై తాండూరు పట్టణ పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ ఖాళీ భూములను, శిఖం భూములను టార్గెట్ చేస్తూ తమ అధికార మదంతో స్థానిక అధికారులను నయానో, భయానో ఒప్పించి అన్యక్రాంతం చేసుకునేందుకు పకడ్బందీ వ్యూహారచనలు సాగిస్తున్నారు. కాగా కొందరు అధికార పార్టీ పెద్దల అండ దండలతో తాండూరు మున్సిపల్, రెవెన్యూ అధికారులను ఎదురించి ఇక్కడ పనిచేస్తావా లేదంటే వెళ్లిపోతావా అంటూ భయకంపితుల్ని చేస్తూ తమ ఇష్టారాజ్యంగా ప్రభుత్వ, అసైన్డ్ భూముల్ని ఆక్రమించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈక్రమంలో పాత తాండూరు అయ్యప్పనగర్ కాలనీల మధ్య ఉన్న గ్రీన్ సిటీ ప్రాంతంలో ఉన్న మున్సిపల్ స్థలం ప్రస్తుతం కోట్లాది రూపాయలు విలువైన 930గజాల పార్కు స్థలాన్ని కబ్జా చేందుకు దురాక్రమణదారులు ఏకంగా దౌర్జన్యాలకు పాల్పడటం మరీ విశేషంగా మారుతుంది. మున్సిపల్ అధికారులు కమిషనర్ ఎస్.సంతోష్ కుమార్, టౌన్ ప్లానింగ్ అధికారులు సర్వే 208, గ్రీన్ సిటి ప్రాంతంలోని దాదాపు 13 ఎకరాల 14 గుంటల భూమి లేఅవుట్‌ను ఆమోదించలేదు. ఆ భూమిని గతంలో ప్రభుత్వం కొందరు దళితలకు పంపిణీ చేసినట్లు సమాచారం. అందులో పట్టాదారులుగా ఉన్న ఎనిమిది మంది దళితులు ఆ భూమిని ప్రభుత్వం ఇండస్ట్రీయల్ ఏరియా కింద పరిగణించి అందుకు అనుగుణంగా అభివృద్ధి పర్చేందుకు సన్నద్ధం అయ్యింది. కాగా అట్టి 13.14 ఎకరాల భూమిలో పట్టాదారులుగా ఉన్న దళితులు.. భూమిని ఇండస్ట్రీయల్‌కు కాకుండా నివాసయోగ్యంగా మార్చుతూ లేఅవుట్ అప్రూవర్ కోసం ప్రభుత్వానికి, స్థానిక రెవెన్యూ అధికారులకు విన్నవించారు. ప్రభుత్వం రెవెన్యూ యంత్రాంగం 13.14 ఎకరాల భూమిలో 10శాతం భూమిని ప్రభుత్వం ఆదీనం చేయాలని అప్పుడు లేఅవుట్ ప్రక్రియకు అనుమతులు ఇస్తామని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. దాంతో భూమిలో పట్టాదారులుగా ఉన్న దళితులు ఎనిమిది మంది తాము దళిత పేదలని, ప్రభుత్వం 8.14శాతం భూమిని తీసుకోవాలని విన్నవించారు. దాంతో ఆ 13.14 ఎకరాల భూమిలో 930 గజాలు పార్కు స్థలంగా, మిగతా స్థలాన్ని రోడ్లు తదితర అవకాశాల కోసం వదిలేలా అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వానికి 10శాతం భూమి అంటే సుమారు 6461.4 చదరపు గజాల భూమి వచ్చింది. దళితల అభ్యున్నతి కోసం గతంలో ఇచ్చిన అసైన్డ్ భూమిని కొందరు భూ దందాదారులు రియల్టర్లు కనే్నసి దళితల నుంచి ప్రభుత్వ పరమైన 930 గజాల పార్కు స్థలంతోపాటు, మరికొన్ని ఫ్లాట్లను దురాక్రమణల ద్వార కబ్జా చేసేందుకు యత్నాలు ముమ్మరం చేశారు. మున్సిపల్ అధికారులు సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నా వాటిని కబ్జాదారులు రాజకీయులు, అధికార నేతల అండ దండలతో మళ్లీ మళ్లీ తొలగించి సవాల్ విసురుతూ, దౌర్జన్యానికి దిగి అధికారులు ఏర్పాటు చేసిన బోర్డులను తొలిగించారు. మంగళవారం మున్సిపల్ యంత్రాంగం తాండూరు పట్టణ పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేసినట్లు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారుల సమాచారం ద్వారా తెలుస్తోంది.