రంగారెడ్డి

డంపింగ్ యార్డులు, శ్మశానవాటికలకు స్థలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, డిసెంబర్ 6: గ్రామాల్లో డంపింగ్ యార్డు, శ్మశానవాటికల నిమిత్తం స్థలాలను గుర్తించి కేటాయించాలని జిల్లా కలెక్టర్ డి.దివ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రెవిన్యూ, హరితహారం, మరుగుదొడ్ల నిర్మాణం తదితర అంశాలపై రెవిన్యూ అధికారులతో జాయింట్ కలెక్టర్ సురేష్‌పొద్దార్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో చెత్తను ఎక్కడంటే అక్కడ వేస్తున్నారని దీనివల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని దీన్ని దృష్టిలో పెట్టుకుని డంపింగ్‌యార్డులకు స్థలాలను గుర్తించి కేటాయించాలని చెప్పారు. ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు తప్పనిసరిగా మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టుకునేందుకు ప్రజలను ప్రోత్సహించాలని తెలిపారు. మరుగుదొడ్ల నిర్మాణాలతో ఆరోగ్యవంతంగా కూడా ఉంటామనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని సూచించారు. మరుగుదొడ్ల నిర్మాణాలో తహశీల్దార్లు సైతం పాల్గొనాలని అన్నారు. మరుగుదొడ్లు లేకపోవడం కారణంగా మహిళలు బహిర్భూమికి వెళ్ళినపుడు బలత్కారాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హరితహారం కింద గ్రామానికి ఇచ్చిన లక్ష్యాలను అధిగమించడం లేదని లక్ష్యాలను అధిగమించాలంటే ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని పేర్కొన్నారు. పొలాలు, పడావుగా ఉన్న భూముల్లో ఎకరానికి వెయ్యి మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
పెద్ద మొత్తంలో భూములు కొన్న వ్యక్తులను గుర్తించి వారిని మొక్కలు నాటేందుకు ప్రోత్సహించాలని, మొక్కలు నాటడం కారణంగా తమ భూముల విలువ సైతం పెరుగుతుందనే విషయాన్ని తెలియజెప్పాలని చెప్పారు. లక్నాపూర్ ప్రాజెక్టు వద్ద ఉన్న 15 ఎకరాల స్థలంలో పదివేల మొక్కలు నాటవచ్చని తెలిపారు. ఎక్కువ స్థలం అందుబాటులో ఉంటే అక్కడ పెద్ద మొత్తంలో మొక్కలు నాటి దానిని కార్తీకవనంగా అభివృద్ధి చేసుకోవచ్చని పేర్కొన్నారు. సమావేశంలో ఎంపిడివో, రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.