రంగారెడ్డి

పెట్రోల్‌బంకులు, రేషన్ దుకాణాల్లో నగదురహిత విధానాన్ని ప్రోత్సహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, డిసెంబర్ 6: మేడ్చల్ మండలంలోని పెట్రోల్‌బంకుల నిర్వాహకులు, రేషన్ డీలర్‌లు, వంటగ్యాస్ ఏజెన్సీల్లో నగదు రహిత విధానాన్ని ప్రొత్సాహించాలని జిల్లా సహయ పౌరసరఫరాల అధికారి ప్రేమ్‌కుమార్ సూచించారు. మంగళవారం తహశీల్దార్ కార్యాలయంలో పలువురు డీలర్‌లతో నగదు రహిత విధానం అమలుపై సమావేశం నిర్వహించారు. క్యాష్‌లెస్ విధానాన్ని అమలు చేసే విధంగా డీలర్లు చిత్తశుద్ధితో కృషి చేయాలని అన్నారు. ప్రెటోల్ బంకుల వద్ద ఇంధనం కోసం వచ్చే కస్టమర్ల వద్ద క్రెడిట్ లేదా డెబిట్ కార్డులున్నచో నగదు రహిత విధానం మేరకు కార్డులపైనే ప్రెటోల్, డిజిల్ సరఫరా చేయాలని సూచించారు. కార్డులేని వారి వద్ద మాత్రం నగదు రూపంలో డబ్బులు తీసుకుని ఇంధనం అందించాలని అన్నారు. రేషన్ డీలర్లు, వంటగ్యాస్ డీలర్లు కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని వివరించారు. బంకులు, రేషన్ దుకాణాల వద్ద నగదు రహిత విధానంపై సూచికబోర్డులు అమర్చాలని ఆదేశించారు. డీలర్లు తమ బాధ్యతగా భావించి ప్రజలను నగదు రహిత విధానానికి అలవాటుపడేలా అవగాహన కల్పించాలని కోరారు. పలువురు డీలర్లు ఇప్పటికే తాము ఈ విధానాన్ని అమలులోకి తెచ్చామని దీనిని మరింత విస్తరించేందుకు విస్తృతంగా ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. స్వైపింగ్ యంత్రాలు లేని డీలర్లు వాటిని సమకూర్చుకోవాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటి తహశీల్దార్ ఎం.సూర్యనారాయణరావు, తహశీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి, డిటి రాజేశ్వర్‌రెడ్డి, గిర్దావర్ నాగజ్యోతి, పలువురు డీలర్లు పాల్గొన్నారు.
కూకట్‌పల్లిని సందర్శించిన జెసి
కెపిహెచ్‌బికాలనీ: మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్ ధర్మారెడ్డి కూకట్‌పల్లిని సందర్శించారు. మంగళవారం కూకట్‌పల్లి మండల కార్యాలయంలో అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
జివో 59, యుఎల్‌సి(92జివో) చెల్లింపులపై అధికారులతో చర్చించారు. సంధర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమబద్ధీకరణ దరఖాస్తు చేసుకున్న వారి నుంచి చేయాలని, చెల్లించని వారికి నోటీసులు పంపి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. 59 జీవో కింద మొత్తం 208 మంది దరఖాస్తు చేసుకోగా 18 మంది ఫీజులు చెల్లించారని, 190 మంది కట్టనివారు ఉన్నట్లు తెలిపారు. యుఎల్‌సికి 70 దరఖాస్తుదారులు అర్హులు కాగా 29 మంది ఫీజులు చెల్లించారని, కట్టనివారు 47 మంది ఉన్నారని తెలిపారు. షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకం దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని, పనులను వేగవంతం చేయాల్సిందిగా రెవెన్యూ అధికారులకు సూచించారు.

రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ఎన్నో పథకాలు
చేవెళ్ల, డిసెంబర్ 6: రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కేసిఆర్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలపై గత నెల 16న మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన పోరుబాట మంగళవారం చేవెళ్లలో ముగిసింది. చేవెళ్లలోని కేజిఆర్ గార్డెన్‌ల్ పోరుబాట ముగింపు సమావేశం నిర్వహించారు. అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు జి.అనంతయ్య ఆధ్వర్యంలో సంఘం నాయకులు పోరుబాట ముగింపు సభకు సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. మధ్యాహ్న భోజనం, వసతి గృహాలకు సన్నబియ్యం పంపిణీ, విరివిగా రెసిడెన్షియల్ స్కూళ్లను మంజూరు చేశారని చెప్పారు. మొయినాబాద్‌లో మహిళ డిగ్రీ కళాశాల ఏర్పాటు అవుతుందని అన్నారు. ఫీజురియింబర్స్‌మెంట్ సమస్యను కేసిఆర్ దృష్టికి తీసుకవెళ్తానని విద్యార్థులకు సూచించారు. ఎస్సీ ఎస్టీ ఆల్ ఇండియా విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో 20 రోజులుగా అన్ని ప్రాంతాల్లో పర్యటించామని చెప్పారు.
ఎన్నో సమస్యలు పోరుబాట దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్ అందక ఎంతో మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకుడు దేశమొళ్ల అంజనేయులు, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు రాములు, బిసి సేవా అధ్యక్షుడు బర్క కృష్ణ, నాయకులు వసంతం, పాండు, నర్సింగ్‌రావు, చందు, శ్రీనివాస్, లక్ష్మినివాస్ ఉన్నారు.

ప్రజల్లో తెదేపాకు ఆదరణ

రాజేంద్రనగర్, డిసెంబర్ 6: తెలంగాణలో తెదేపాకు పూర్వ వైభవం పొందడం ఖాయమని రాష్ట్ర తెదేపా బిసి సెల్ ప్రధాన కార్యదర్శి మ్యాడం రామేశ్వర్‌రావు అన్నారు. మంగళవారం రాజేంద్రనగర్ డివిజన్ హైదర్‌గూడ హరిజన్ బస్తీ తదితర బస్తీలలో ఇంటింటికి తిరుగుతూ తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీకి రోజురోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుందన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా అదికారం చేపట్టడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. టి ఆర్ ఎస్ పార్టీ అధికారం చేపట్టగానే ప్రజలకు ఇచ్చిన హామీలన్ని విస్మరించి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ప్రజలే టి ఆర్ ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని విమర్శించారు. ఏ ప్రాంతానికి వెళ్లినా తెలుగుదేశం పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, సభ్యత్వ నమోదు చేయించుకోవడానికి ముందుకు వస్తున్నారన్నారు. కేసీ ఆర్ గద్దెనెక్కి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. తెదేపాలో ఓనమాలు నేర్చుకొని పైకి వచ్చిన నాయకులు పార్టీ మార్చి పార్టీని తిట్టడం విడ్డూరంగా ఉందన్నారు.
రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లోకి రావాలని, ప్రజలు ఇచ్చే తీర్పేంటో అప్పుడు అర్థమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు ఏ.కృష్ణారెడ్డి, మురళీధర్‌రావు, ఈ.వెంకటేష్, బుచ్చం శంకర్ తదితరులు పాల్గొన్నారు.

డిజిటల్ బ్యాంకింగ్‌పై అవగాహన కల్పించాలి

వికారాబాద్, డిసెంబర్ 6: నగదు రహిత చెల్లింపులు, డిజిటల్ బ్యాంకింగ్‌లపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు తమ ఖాతాకు మొబైల్ నెంబరు అనుసంధానం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఎంపిడివోలకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ డి.దివ్య సూచించారు. మంగళవారం పట్టణంలోని అంబేద్కర్ భవన్‌లో నగదు రహిత, డిజిటల్ బ్యాంకు విధానంపై బ్యాంకర్లు, ఎంపిడివోలు, వివిధ వ్యాపార యాజమాన్యాలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ మారిన పరిణామాలరీత్యా వ్యక్తిగత అవసరాలు తీర్చుకునేందుకుగాను నగదు రహిత చెల్లింపులు ఎలా చేయాలో ప్రజలు తెలుసుకునేందుకు బ్యాంకర్లు, అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. చెల్లింపుల విషయంలో మామూలుగా టెలిఫోన్ వాడే ప్రతి ఒక్కరూ సులభంగా లావాదేవీలు చేపట్టవచ్చని తెలిపారు. ప్రజల్లో నగదు రహిత చెల్లింపులపై ఉన్న అపోహలు తీర్చాలని పేర్కొన్నారు. బ్యాంకుల్లో జన్‌ధన్ ఖాతాలున్నప్పటికి వాటిని వాడుకలో ఉంచడంలేదని, వీటిని వినియోగించడంతో పాటు వారికి రూపే కార్డులు పొందాలనే విషయాన్ని సైతం ఖాతాదారులకు తెలియజేయాలని అన్నారు. లావాదేవీలను పాయింట్ ఆఫ్ సేల్, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్, యుఎస్‌ఎస్‌డి, యుపిఐ అదే విధంగా ఇ-వ్యాలెట్‌లాంటి ఐదు రకాల ద్వారా చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
ఈ విధమైన సేవలను వినియోగించుకునేందుకు కావాల్సిన యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే విధానంపై బ్యాంకర్లు ఖాతాదారులకు సూచించాలని వివరించారు. ఎటిఎం, డెబిట్ కార్డు స్వైప్ చేసి నగదు చెల్లించవచ్చనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని చెప్పారు. స్మార్ట్ఫోన్ కలిగి ఉన్న వారి ద్వారా 20 సెకన్లలో డబ్బులు పంపించవచ్చని తెలిపారు. ఇంటర్నెట్ ద్వారా నీటి పన్ను, విద్యుత్ తదితర బిల్లులను సైతం ఇంట్లో ఉండే చెల్లించవచ్చని పేర్కొన్నారు.
యుఎస్‌ఎస్‌డి (*99యాష్) విధానం గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. దీనికి స్మార్ట్ఫోన్ అవసరం కూడా లేదని స్పష్టం చేశారు. యుపిఐ ద్వారా ఒక బ్యాంకు నుండి మరో బ్యాంకుకు డబ్బును పంపవచ్చని వివరించారు. ఇ-వ్యాలెట్ విధానం సైతం చాలా సులభంగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో డిఆర్‌డివో పిడబ్ల్యు జాన్సన్, లీడ్ బ్యాంక్ మేనేజర్ శర్మ, స్టేట్ బ్యాంక్ ఎజిఎం సూర్యప్రకాష్, బ్యాంకర్లు, ఎంపిడివోలు, వ్యాపారా సంస్థ యజమానులు పాల్గొన్నారు.