రంగారెడ్డి

సెటప్ బాక్స్ పెట్టుకోకపోతే జనవరి 1 నుండి ప్రసారాల నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, డిసెంబర్ 8: కేబుల్ టివికి సెటప్ బాక్స్‌లు పెట్టుకోకపోతే జనవరి ఒకటో తేదీ నుండి ప్రసారాలు నిలిపివేస్తామని తెలంగాణ ఎంఎస్‌వో రాష్ట్రం అధ్యక్షుడు, బ్రైట్‌వే కమ్యూనికేషన్స్ ఎండి ఎం.సుభాష్‌రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక ఆర్‌జెం కంఫర్ట్‌లో ఏర్పాటు చేసిన వికారాబాద్ పట్టణ, పరిసర గ్రామాల్లో కేబుల్ ఆపరేటర్లకు కేబుల్ రంగ డిజిటలైజేషన్, సెటప్‌బాక్స్ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ 2011లో ప్రతి కేబుల్ టివికి సెటప్‌బాక్స్ అమర్చుకొని ప్రసారాలను అందివ్వాలని భారతప్రభుత్వం చట్టం చేసిందని చెప్పారు. చట్టాన్ని నాలుగు దశల్లో పూర్తి చేయాలని ఆదేశించిందని పేర్కొన్నారు. చివరి దశ డిసెంబర్ 31తో ముగుస్తుందని స్పష్టం చేశారు. జనవరి ఒకటో తేదీ నుండి కేబుల్ ప్రసారాలు నిలిపివేస్తామని అన్నారు. కేబుల్ ఆపరేటర్ల ద్వారా తాము కస్టమర్లను వివిధ మార్గాల్లో డిజిటలైజేషన్‌పై చైతన్యపరుస్తున్నామని వివరించారు. రాబోవు రోజుల్లో ప్రతి ఆపరేటర్ నాణ్యమైన డిజిటల్ ప్రసారాలను కేబుల్ టివి వినియోగదారులకు అందివ్వక తప్పదని తెలిపారు. దీనికి ప్రతి కేబుల్ ఆపరేటర్ సిద్ధంగా ఉండాలని సూచించారు. రాష్టవ్య్రాప్తంగా కేబుల్ ఆపరేటర్ ఎంఎస్‌వోలు సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సెటప్‌బాక్స్‌ల ఏర్పాటు చాలా పెట్టుబడితో కూడుకున్న వ్యవహారమని, ప్రభుత్వం సెటప్‌బాక్స్‌లపై సేల్స్‌టాక్స్‌ను ఎత్తివేసి భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎంటైర్‌టెన్‌మెంట్ ట్యాక్స్‌ను రద్దు చేయాలని, శాటిలైట్‌తో సమానంగా ఎంఎస్‌వో కేబుల్ చానెల్స్‌ను గుర్తించాలని కోరారు. ప్రభుత్వం శాటిలైట్ చానెల్స్‌తో సమానంగా కేబుల్ చానెల్స్‌కు ప్రకటనలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అతి తక్కువ ధరకే కేబుల్ ఆపరేటర్లు సేవలందిస్తున్నారని అన్నారు. డిటిహెచ్‌లు వెయ్యికి తగ్గకుండా డబ్బులు వసూలు చేస్తారని, కేబుల్ ఆపరేటర్లను కాపాడుకోవాలంటే కేబుల్ కనెక్షన్‌ను కొనసాగించాలని పిలుపునిచ్చారు. శ్రీ సాయిదత్త డిజిటలైజేషన్ నిర్వాహకుడు ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ వినియోగదారుడి సమస్యలు పరిష్కరించేందుకు కస్టమర్ కేర్ సెంటర్ ప్రారంభిస్తామని తెలిపారు. బంట్వారం మాజీ ఎంపిపి రాములు యాదవ్ మాట్లాడుతూ వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకే డిజిటలైజేషన్‌పై శిక్షణ అని అన్నారు. కార్యక్రమంలో ఎంఎస్‌వోల డివిజన్ అధ్యక్షుడు కౌకుంట్ల ఆనంద్, ఉపాధ్యక్షుడు మహేందర్, శివకేబుల్ నిర్వాహకుడు నాగేందర్, ధారూర్ అధ్యక్ష, ఉపాధ్యకక్షులు శివకుమార్, కిష్టయ్య, నవాబ్‌పేట అధ్యక్షుడు నాగిరెడ్డి, కార్యదర్శి రమేష్, కోట్‌పల్లి అధ్యక్షుడు రవి, వికారాబాద్ మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు అనంతరాములు, ప్రకాష్, పట్టణ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సత్యం, గోపాల్‌గౌడ్‌లు పాల్గొన్నారు.