రంగారెడ్డి

నెల గడిచినా అదే సీన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, డిసెంబర్ 8: పెద్ద నోట్ల రద్దు చేస్తూ కేంద్ర తీసుకున్న నిర్ణయం సగటు జీవిని కుదిపేస్తున్నది. నిర్ణయం వెలువడి నెలరోజులు గడిచినా సాధారణ స్థితి నెలకొనక పోగా రోజు రోజుకు చిన, చితక పనులు చేసుకొని జీవనం కొనసాగించే వారి పరిస్థితి అతి దయనీయంగా మారిపోయింది. చేసుకునేందుకు పనులు లేకపోవడం, పనిచేసినా డబ్బు చేతికందకగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ రూ.500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడంతో మొదలైన కష్టాలు ఇప్పట్లో వదిలేటట్టు కనిపించడం లేదు. ఆ నాటి నుంచి రూ.500, 1000 నోటు చూస్తేనే భయపడే పరిస్థితి నెలకొంది. నల్లధన నిర్మూలన కోసం తీసుకున్న ఈ నిర్ణయం ఏ మేరకు సత్ ఫలితాలను ఇస్తుందో తెలియదు కానీ హోటల్స్, బార్ల, పబ్‌లు, క్లబ్‌ల్లో పనిచేసే సర్వర్లు, జూనియర్ ఆర్టిస్టులు, దినసరి కూలీలు చేసుకొని బతికేవారికి కంటతడి పెట్టిస్తుంది. నిర్ణయం వెలువడిన వెంటనే మొదటగా ఆందోళన చెందిన వర్గం వ్యాపారులే. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటుండగా కాగా వారిపై ఆధారపడి జీవించే వారు నగదులేక ఇబ్బందులు పడుతున్నారు. బార్లు, పబ్‌లు, క్లబ్‌ల్లో సర్వర్లుగా పనిచేసే వారి వేతనాలు తక్కువగా ఉంటే నిత్యం వచ్చి వెళ్లేవారు ఇచ్చే చిల్లర కొండంత అండ. పెద్ద నోట్ల రద్దుకావడంతో హోటళ్లకు వచ్చిన వారు తమ బిల్స్‌ను కార్డులతో ముగించి వేస్తున్నారు. టిప్‌గా ఇచ్చేందుకు చిల్లర లేకపోవడంతో ఇచ్చే ఆలోచన ఉన్నవారు కూడా తల తిప్పుకొని వెళ్లిపోతున్నారు. దీంతో తమ జీవనం కష్టంగా మారిపోతుందని ఓ హోటల్‌లో పనిచేసే సర్వర్ వాపోయాడు. పెద్ద చేపల కోసమే తామీ నిర్ణయం తీసుకున్నామని ప్రధాని చెబుతున్నా ఇబ్బందులు మాత్రం సాధారణ, పేద, మధ్య తరగతి ప్రజలే పడుతున్నారని కన్నీరు పెట్టుకున్నాడు.
బ్యాంకుల వద్ద అవే కష్టాలు
నార్సింగి: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేయడంతో నెలరోజులైనా బ్యాంకుల వద్ద ప్రజలకు అవే కష్టాలు ఎదురవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నెల రోజుల క్రితం 1000, 500 పెద్దనోట్లును రద్దు చేశారు. అప్పటి నుంచి బ్యాంకుల వద్ద కిలోమీటర్లు పాటు జనం బారులు తీరుతున్నారు. బ్యాంకు అధికారులు తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని జనం మండిపడుతున్నారు. ఎన్ని రోజుల పాటు బ్యాంకుల వద్ద రద్దీ ఉంటుందని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పెద్ద నోట్లు రద్దు చేశారని కానీ చిన్న నోట్లును ఇవ్వకుండా ప్రజలను పరేషాన్ చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా తము బ్యాంకుల వద్ద నిరీక్షణలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఒక్కొకరికి రెండు వేల రూపాయాలు ఇస్తే ఏమి సరిపోతాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు అధికారులు కొందరికైతే లక్షల రూపాయాలతో పాటు కోట్లు రూపాయాలు కూడా ఇస్తున్నారని ఆరోపించారు. తము కేవలం రెండు వేల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు లైన్లులో నిల్చుంటున్నామని వాపోయారు. డబ్బులు ఉన్న పెద్దలు మాత్రం క్షణాల్లో వచ్చి బ్యాంకు అధికారులతో కుమ్మకై లక్షల రూపాయాలు తీసుకువెళ్లుతున్నారని తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. నెల రోజుల్లో పది రోజులు బ్యాంకుల వద్ద ఉన్నామని కనీసం తము నాలుగు వేల రూపాయలు కూడా తమ అకౌంట్‌లో నుంచి తీసుకోలేక పోయామని వాపోయ్యారు. తము ఇంత పెద్ద లైన్‌లో నిల్చుంటే బ్యాంకుల అధికారులు అదిగో..ఇదిగో.. అంటున్నారే తప్ప కనీసం తమకు పది వేల రూపాయలు కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు వేల రూపాయాల నోటు లభిస్తే ఇకా దుకాణాలలో ఎన్ని పాట్లు పాడాల్సివస్తుందో అంటూ బ్యాంకు అధికారులకు, ఇటు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు తెలియడం లేదని తీవ్రంగా దుమ్మెత్తి పోస్తున్నారు. వృద్ధుల పరిస్థితి మరి దారుణంగా ఉందని వారు పేర్కొంటున్నారు. ఏటిఎం సెంటర్లులో ఇలా డబ్బులు పెట్టిన గంటలోపే డబ్బులు అయిపోతున్నాయని పేర్కొన్నారు. పెద్ద వాళ్లు భారీగానే డబ్బులు మార్చుకున్నారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేవని పేర్కొన్నారు. కేవలం సామాన్య ప్రజలకు మాత్రం రోజురోజుకూ కష్టాలు ఎక్కువైతున్నాయని మహిళాలు అంటున్నారు. బ్యాంకులకు ఎన్ని డబ్బులు వస్తున్నాయి. బ్యాంకు అధికారులు ఎంత మందికి రెండు వేల రూపాయాలు ఇస్తున్నారని ఐటి అధికారులు దాడులు చేసి బ్యాంకు సిబ్బందిని పట్టుకోవాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు. బ్యాంకుల ముందు జనం ఒక వైపు గగ్గోలు పెడుతున్న, బ్యాంకు అధికారులు మాత్రం తమకు ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని జనం మండిపడ్డారు. లంచగొండి అధికారులను తక్షణమే సస్పెండ్ చేసి కోరుతున్నారు.
దర్శనమిస్తున్న నోక్యాష్ బోర్డులు
ఉప్పల్: అవినీతిని అంతం చేయడానికి, నల్లధనం వెలికి తీయడం కోసం వెయ్యి, ఐదు వందల పెద్ద నోట్లను రద్దు చేసి నెల రోజులు గడుస్తున్నా.. ఖాతాలలో దాచుకున్న నగదు చేతిక అందక సామాన్య ప్రజలు అవస్థలు పడుతున్నారు. నిత్యం బ్యాంకుల వద్ద పనులు మానుకుని గంటల కొద్దీ క్యూలో నిల్చొన్నా చేతికి అందడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారంలో ఇరవై నాలుగు వేల రూపాయలను ఖాతాల నుంచి తీసుకోవచ్చని ఆర్‌బిఐ ప్రకటించినా బ్యాంకుల్లో అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ అధికారులు డబ్బులు ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం తెల్లవారు జామునే ఆయా ప్రాంతాలలో ఉన్న బ్యాంకుల వద్దకు వెళ్లి క్యూలో నిల్చొన్నా రద్దీని గమనించి అధికారులు బ్యాంకుల్లో డబ్బులు అయిపోయాయని, నో క్యాష్ బోర్డులను పెట్టి తలుపులు మూసివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామంతాపూర్ ప్రధాన రహదారిలోని ఆంధ్రాబ్యాంక్, ఎస్‌బిహెచ్, ఇతర బ్యాంకుల వద్ద నోట్ల కోసం ప్రజలు నిరీక్షించినా చేతికి డబ్బులు అందడంలేదని వాపోతున్నారు. హబ్సిగూడ, ఉప్పల్, చిల్కానగర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, మేడిపల్లిలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల వద్ద ప్రజల సందడి కొనసాగుతోంది. నెల రోజులు గడిచినా దాచుకున్న సొంత డబ్బులు ఇవ్వకపోవడమేమిటని కేంద్ర ప్రభుత్వంపై మండి పడుతున్నారు. ఎన్నో అవసరాలను తీర్చుకోవడానికి చేతిలో డబ్బు లేకపోవడంతో బతికేదెలా అని వాపోతున్నారు. పరిస్థితి ఇలాగా కొనసాగితే మున్ముందు ఎన్ని ఇబ్బందులు ఎన్ని రోజులు ఎదుర్కోవలసి వస్తోందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తప్పని క్యాష్ కష్టాలు
మర్పల్లి: నెల రోజులు గడిచినా పెద్ద నోట్ల మార్పిడి కష్టాలు ప్రజలకు తప్పడంలేదు. రద్దయిన నోట్ల స్థానంలో రెండువేల నోట్లను ముద్రించి విడుదల చేసినా చిల్లర కోసం ఇబ్బందులు పడుతున్నారు. మర్పల్లి మండల కేంద్రంలోని ఆంధ్రాబ్యాంక్, ఎస్‌బిహెచ్, గోల్కొండ గ్రామీణ బ్యాంక్‌ల వద్ద నగదు కోసం ప్రజలు నిత్యం గంటల కొద్దీ క్యూలో నిల్చొన్నా డబ్బులు చేతికి అందక ఇబ్బందులు పడుతున్నారు. గురువారం బ్యాంకులలో మధ్యాహ్నం రెండు గంటలకే డబ్బులు లేవని నోక్యాష్ బోర్డులు పెట్టడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఏటిఎంలు వారం రోజులుగా తెరుచుకోకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని డబ్బులను ఇప్పించకపోతే మున్ముందు కష్టాలు ఇంకెన్నో పడాల్సివస్తోందోనని పలువురు వాపోతున్నారు.
చిల్లర కష్టాలు మరింత పెరిగాయి
తాండూరు: తాండూరు డివిజన్‌లో చిల్లర కష్టాలు మరింతగా ఉద్ధృతం అవుతున్నాయి. పల్లెల్లో నగదు మార్పిడికి మార్గం లేకపోవడం, గ్రామీణ జనం తాండూరు పట్టణానికి వచ్చి తమకు అవసరమైన నిత్యవసరాలు మొదలు వస్తుసామాగ్రి, చివరకు కూరగాయలు తమ చేతిలో ఉన్న కొత్త రెండువేల రూపాయల నోటుతో కొనుగోలు చేద్దామంటే అందుకు చిల్లర లేదంటూ స్థానిక వ్యాపారులు మొండి కేయటంతో తాండూరుకు రావాలంటేనే పల్లె జనం జంకుతున్నారు. ఎలాగూ పాత పెద్దనోట్లు ఒక్క బ్యాంకుల్లో తప్ప బహిరంగ మార్కెట్లలో ఎవరూ తీసుకోవడం లేదు. దాంతో అష్టకష్టాలు పడి బ్యాంకుల నుండి వారానికి రెండువేలు దక్కించుకున్న సదరు పల్లెవాసి, రైతన్నలు తాండూరు మార్కెట్లో కొత్త రెండువేల నోట్లను పట్టుకుని వింత పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టు వాపోతున్నారు. కొత్త పెద్ద నోటుకు చిల్లర దొరకని విచిత్ర పరిస్థితి నేడు తాండూరు పట్టణంలో నెలకొంది. పల్లె జనం వారి వద్ద ఉన్న కొత్త రెండువేల నోటుతో గిరాకీ చేస్తామంటే వ్యాపారులు అంగీకరించకపోవడం, తమవద్ద డబ్బులు ఉన్నా ఏమీ కొనలేని.. ఏమి తినలేని వింత పరిస్థితిని గ్రామీణులు పట్టణంలో చవిచూస్తున్నారు. ఒకవైపు అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా తగిన చర్యలు చేపడుతామంటూ డాంబికాలు పలకడం వరకే పరిమితం అయ్యారనే విమర్శలు పల్లెజనంతో పాటు, సామాన్య, మధ్యతరగతి కుటుంబాల వారు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర పాలకులు నగదు రహిత లావాదేవీల పాట పాడుతుంటే, స్థానికంగా పరిస్థితులు మరోరకంగా దాపురించాయంటూ ప్రజలు మండిపడుతున్నారు. నగదు రహిత లావాదేవీల మాటలా ఉంచితే, చేతిలో ఉన్నడబ్బులకు చిల్లర దొరక్క పల్లె జనం, సామాన్యులు అష్టకష్టాల పాలవుతున్నామని బెంబేలు పడుతున్నారు. తాండూరులో ఇంతకాలం పాత పెద్ద నోట్ల చెలామణిలో కమీషన్ దందాలు చేసి తమ జేబులు నింపుకున్న వ్యాపారులు, మరి కొందరు ఆర్థిక దళారీలు ప్రస్తుతం అందిన కాడికి మహాదేవా అన్న చందంగా పల్లె జనం చేతిలో కొత్త పెద్దనోట్లు కనిపించగానే ఏవస్తువు కొనాలన్నా చిల్లర లేవు అని సమాధానం ఇస్తున్నట్టు డివిజన్‌లోని పలు గ్రామాలకు చెందిన గ్రామీణులు, అడ్డాకూలీలు, రైతులు, మహిళలు వాపోతున్నారు. కాగా మరికొందరు బడా వ్యాపారులు తమ వ్యాపార సంస్థలు, దుకాణాల పరిసర ప్రాంతాలలో చిల్లర డబ్బులు రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్ల సంచులతో తమ ఏజెంట్లను కూర్చోబెట్టి తమ దుకాణాలు, వ్యాపార సంస్థలకు వచ్చి గిరాకీ చేసే పల్లెవాసులు, అమాయకులను చిల్లర లేవు అంటూ, వారితో సంభాషణలు పెట్టి నీకు చిల్లర కావాలంటే ఆమనిషి దగ్గరకు వెళ్లు, వేయికి వంద రూపాయలు కమీషన్ తీసుకుని చిల్లర ఇస్తాడు అని తమ ఏజెంట్ల వద్దకు పురమాయించడం తాండూరు మార్కెట్లలో మరో కొత్తరకం దోపిడీ వ్యవహారం మొదలయ్యిందంటూ పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాగా నగదు రహిత లావాదేవీలంటూ ప్రభుత్వం, పాలకులు, అధికార యంత్రాంగం ఆలులేదు..చూలూ లేదు అన్న చందంగా గ్రామీణ, సామాన్య జనంపై డిజిటల్, ఆన్‌లైన్ సేవలతో నగదు రహిత లావాదేవీలు జరపండి అంటున్న విధానం ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టండి అనే విచిత్రంగా ఉందని విమర్శిస్తున్నారు.
మామూలు జనాలు పాలకులు, అధికారుల తీరు పట్ల వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారు. తాండూరు వంటి బహిరంగ మార్కెట్లలో అమాయక జనాన్ని గత నెలరోజుల నుండి అన్ని విధాలా ఆర్థికనేర మార్గాలతో దోచుకుంటున్న వ్యాపారులు, ఆర్థిక దళారులపై చట్టరీత్యా చర్యలు చేపట్టడంలో అధికార యంత్రాంగం ఏనాడూ దృష్టి సారించక పోవటం పేద, పల్లె, సామాన్య ప్రజల దురదృష్టంగా భావించాలి అనే మనోవేదన విద్యావంతులు, మేధావి వర్గాల నుంచి వినపడుతోంది.