రంగారెడ్డి

ఆసుపత్రుల్లో వౌలిక సదుపాయాలు కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, డిసెంబర్ 9: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వౌలిక సదుపాయాలతో పాటు, ఆసుపత్రుల్లో ప్రసవాల నిర్దేశ లక్ష్యాలను దాటేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డి.దివ్య వైద్యాధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆసుపత్రుల్లో వౌలిక సదుపాయాలు, సమస్యలపై వైద్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఆసుపత్రుల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగేనీరు, మంచాలు, దుప్పట్ల సదుపాయాలను కల్పించడంతో పాటు మందులను అందుబాటులో ఉంచాలని చెప్పారు.

అక్రమ లేఅవుట్లపై హెచ్‌ఎండిఎ కనె్నర్ర
ఉప్పల్, డిసెంబర్ 9: నగర శివారు ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లపై హెచ్‌ఎండిఎ కనె్నర్ర చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్న అక్రమ లేఅవుట్లలో చేపట్టిన ఇంటి నిర్మాణాలను శుక్రవారం పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు. చెంగిచర్ల పోచమ్మ కుంట పరిసర ప్రాంతాలలో ఇటీవల కాలంలో అక్రమ లేఅవుట్లు జోరుగా వెలిశాయి. ఎల్‌ఆర్‌ఎస్ లేకుండానే గత గ్రామ పంచాయతీ అనుమతితో ఇంటి నిర్మాణాలు చేపట్టారు. అప్పట్లో వౌనంగా ఉన్న హెచ్‌ఎండిఎ అధికారులు ప్రస్తుతం అక్రమ నిర్మాణాలపై కనె్నర్ర చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలను వదిలేసి కంప్లయింట్ పేరుతో పేద, మద్య తరగతి ప్రజలు నిర్మించుకుంటున్న ఇళ్లను కూల్చివేయడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కూల్చివేత కార్యక్రమంలో హెచ్‌ఎండిఏ, బోడుప్పల్ పురపాలక సంఘం పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు పాల్గొన్నారు.
అక్రమ లేఅవుట్లకు నోటీసులు
బోడుప్పల్, పీర్జాదిగూడ పురపాలక సంఘాల పరిధిలో వెలసిన అక్రమ లేవుట్లకు నోటీసులు జారీ చేసినట్లు హెచ్‌ఎండిఏ అధికారులు తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు దరఖాస్తు చేసుకుంటే అధికారికంగా లేఅవుట్లు, ఇంటి నిర్మాణాల కోసం అనుమతులను మంజూరు చేస్తామని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎవరైనా సహించేది లేదని హెచ్చరించారు.