రంగారెడ్డి

రైతుల పాలిట శాపంగా అవినీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, డిసెంబర్ 12: భారతీయ కిసాన్ సంఘ్ మేడ్చల్ మండల కార్యవర్గాన్ని సోమవారం సంఘ్ జిల్లా అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అందులో అధ్యక్షుడిగా ఇంద్రసేనారెడ్డి (శ్రీరంగవరం), ఉపాధ్యక్షుడిగా గోపాల్‌రెడ్డి (గౌడవెళ్లి), కార్యదర్శిగా వై. వీరారెడ్డి (బండమాదారం), సహయ కార్యదర్శిగా బొక్క మల్లారెడ్డి (గిర్మాపూర్)లను ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా అంజిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, పెంటయ్య, ఎల్లారెడ్డి, జార్జీ, ప్రభాకర్‌రెడ్డి, రాములు యాదవ్‌ను నియమించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు అంజిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో దేశంలో రైతులు బాధలు వర్ణణాతీతంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు పెద్ద నోట్ల రద్దు కూడా శరఘాతంలా పరిణమించిందని వాఖ్యనించారు. ఒకప్పటి జైకిసాన్ జైవాన్ అనే నినాదం కేవంల నామ్‌కేవాస్తేగా మిగిలిపోయిందని వాపోయారు. రైతులు అనేకానేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వాలు ప్రకటనలకే పరిమితమయ్యాయని వారి సంక్షేమానికి క్షేత్ర స్థాయిలో అనుకున్నంతగా పాటుపడడం లేదన్నారు. రైతే రాజు అన్నది నానుడిగా కాకుండా వాస్తవంగా అలాంటి రోజు రావాలని పాలకులు మనసారా కోరుకోవాలని ఆకాంక్షించారు. అవినీతి రైతుల పాలిట శాపంగా మారిందని అవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు లాభసాటి ధరలు లేని కారణంగా రైతు బక్కచిక్కి పోతున్నాడన్నారు. సంఘటిత శక్తి ద్వారా పని చేసే రైతు స్వాభిమానంతో క్రీయాశీలకంగా సంఘ్ బలోపేతానికి అంకితభావంతో పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో సంఘ్ జాతీయ కార్యదర్శి సాయిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వెంకట్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి, కోశాధికారి సురేందర్‌సింగ్, స్థానిక నాయకులు నీరుడి కృష్ణ, జగన్‌గౌడ్, బాల్‌రాజ్, నరేందర్‌చారీ పాల్గొన్నారు.
అన్ని విధాలా పారిశ్రామికవాడ అభివృద్ధి
రాజేంద్రనగర్, డిసెంబర్ 12: కాటేదాన్ పారిశ్రామికవాడను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం పారిశ్రామికవాడలోని బస్తీలలో వౌలిక వసతులు కరువై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. టిఎస్‌ఐఐసి పారిశ్రామిక యజమానులతో కలిసి విస్తృతంగా పర్యటించి రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ దీపాల పని తీరుపై పరిశీలించారు.
కాటేదాన్ పారిశ్రామికవాడ ప్రత్యేక మున్సిపాలిటీ ఉన్నప్పటికీ వౌలిక వసతులు కల్పించడంలో టిఎస్‌ఐఐసి అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పారిశ్రామికవాడలో ప్రజలు నివసించే బస్తీలు ఉండటంతో వసతులు కరువై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. ప్రత్యేక మున్సిపల్ అధికారులతో చర్చించి వెంటనే కావాల్సిన వౌలిక వసతులను కల్పిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. పారిశ్రామిక వాడలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనాలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చట్టప్రకారం చర్యలు తీసుకంటామని హెచ్చరించారు. అనుమతులు లేకుండానే బహుళ అంతస్థుల భవనాలు, కంపెనీలు నిర్మిస్తున్నారని మండిపడ్డారు. దీంతో ప్రభుత్వానికి కావాల్సిన కోట్లాది రూపాయల పన్నులు రాకపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. ఇండస్ట్రీ మున్సిపాలిటీలలో అధికారుల కొరత ఉండటంతో అక్రమ నిర్మాణాలను అరికట్ట లేకపోతున్నారని చెప్పారు.
పారిశ్రామిక యజమానులు చంద్రారెడ్డి, సంజీవ్‌జైన్, కమల్ సేథ్, కృష్ణ, చాంద్ పటేల్, భవతి దాల్‌మిల్, సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

యాభై వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలి
మోమిన్‌పేట, డిసెంబర్ 12: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 50వేల టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందించాలని పేర్కొన్నారు.
ఇదేమి పట్టించుకోకుండా విద్య, వైద్యంను దశల వారిగా ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర పన్నుతుందని ధ్వజమెత్తారు.
టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయలేదని, డిఎస్సీ ప్రకటించక నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో బిసి సంఘం కార్యదర్శి నర్సింహ గౌడ్, బిసి హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు రాజేందర్, యువజన విభాగం అధ్యక్షుడు అనంతయ్య, లక్ష్మయ్య పాల్గొన్నారు.