రంగారెడ్డి

భౌ భౌ బిర్యానీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, డిసెంబర్ 13: ఇప్పటి వరకూ భాగ్యనగరం బిర్యానీ అంటే ప్రపంచ ప్రసిద్ధి.. కానీ ఇప్పడు ఒక్కసారిగా కలకలం. నగరంలోని ఒక హోటల్‌లో మటన్ బిర్యానీలో కుక్కమాంసం కలిపారన్న సమాచారం పెద్దఎత్తున దుమారం సృష్టిస్తోంది. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. హైటెక్ సిటీలో ఒక హోటల్‌లో అధికారులు తనిఖీలు చేపట్టారు. సోషల్ మీడియాలో రెండు రోజులనుండి కుక్కలను చంపి వాటి మాంసంతో బిర్యానీ తయారు చేస్తున్న వీడియోలు పెద్దఎత్తున అలజడి రేపాయ. కొందరు నగరంలోని ఒక హోటల్‌లో ఈ వ్యవహారం నడుస్తోందని ఫిర్యాదు చేయడంతో నగరంలో దాడులు నిర్వహించారు. వెస్ట్‌జోన్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్, వెటర్నటీ డాక్టర్ హెల్త్ ఆఫీసర్, దుర్గం పోలీసుల ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. బిర్యానీతో పాటు హోటల్‌లో తయారు చేస్తున్న మాంసాహారాలను పరిశీలించి నమూనాలను తీసుకుని వెళ్లారు. నమూనాలను పరీక్షలకు పంపుతామని రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ఓయూలో విద్యార్థుల రాస్తారోకో
నాచారం, డిసెంబర్ 13: ప్రైవేటు యూనివర్సీటీ బిల్లును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం వల్ల పేద విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆర్‌ఎన్ శంకర్ అన్నారు. మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీలో కళాశాలల తరగతులను బహిష్కరించి అనంతరం ఎన్‌సిసి గేట్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, నరేష్, స్టాలిన్, రహమాన్ పాల్గొన్నారు.