రంగారెడ్డి

మత్తులో యువత బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శామీర్‌పేట, డిసెంబర్ 18: మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ప్రభుత్వం హెచ్చరికలు చేస్తూ ప్రతి ఒక్కరిలో అవగాహన తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రధానంగా యువతలో ఈ మార్పును తీసుకురావడానికి ట్రాఫిక్ పోలీసులు అనేక చర్యలు చేపడుతున్నారు. నగర శివారులో ఔటర్ రింగ్‌రోడ్లలో రోడ్డు ప్రమాదాలు ఆదివారం నాడే చోటు చేసుకుంటున్నాయి. జంటనగరాల్లోని వివిధ ప్రాంతాల్లో వారానికి రెండు మార్లు వాహనాలు తనిఖీలు పోలీసులు చేపడుతుండటంతో యువత కుర్రకారుకు అది మింగుడు పడటం లేదు. దీంతో జల్సాలపై మోజు చూపుతున్న యువత నగర శివారులోని గెస్టు హౌస్‌లు, రీసార్ట్స్‌లు ఎంచుకుంటున్నారు. నగర శివారులోని రోడ్లపై పోలీసుల తనిఖీలు లేకపోవడం వారికి అదనుగా మారింది. కొన్ని సందర్భాల్లో రీస్టార్ట్స్, గెస్ట్ హౌస్‌లలో జల్సాలు జరుపుకున్న యువకులు అనేక రకాల నేరాలకు ప్రధాన కారకులవుతున్నారు. ఇటీవల కాలంలో మద్యం సేవించి వాహనాల తనిఖీల్లో లభించిన అనేక మంది యువకులను పోలీసులు మొదటి దఫా కింద జరిమానాలు విధించడంతో పాటు రోడ్డు ప్రమాదాలు జరగకుండా చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాల గురించి వారిలో మార్పు రావడం కోసం అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. మద్యం మత్తులో పట్టుబడిన వాహనదారులకు కోర్టులు కూడా వినూత్నమైన శిక్షలు విధించినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. రోడ్లును శుభ్రం చేయడం, రోడ్డు ఇరువైపు బోర్డులను చేతపట్టుకొని వాహనదారులకు తమ లాగా తప్పు తాగి వాహనాలు నడపవద్దని ఇతరులను చైతన్య పరుస్తూ చేపట్టిన కార్యక్రమాలన్ని వృధాగా అవుతున్నాయి. తప్పతాగి వాహనాలు నడపటం వల్ల తమ జీవితాలే కాకుండా ఇతరుల జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు. వారం నుండి ఇప్పటి వరకు నగర శివారులో అనేక రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాలన్నిటికీ కారణం తాగి వాహనాలు నడపడమేనని పోలీసుల విచారణలో తేలింది. మత్తు బాబులకు కఠిన చర్యలు అమలు చేయాలని అనేక మార్లు వివిధ స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేస్తున్న ఘోషణ అరణ్య ఘోషణవుతోంది. ఇటీవల నగర శివారులోని నాగోల్, కూకట్‌పల్లి, శామీర్‌పేట పరిసర ప్రాంతాలు, ఔటర్ రింగురోడ్లపై ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువ శాతం ఆదివారం నాడే జరిగి రోడ్లన్ని రక్తపుటేరులై పారుతున్నాయి. నగరాల్లోజరిగే పోలీసు తనిఖీలను తట్టుకోలేక నగర శివారులోకి వెళ్లి అక్కడే వీకెండ్ పార్టీలు చేసుకొని తిరుగు ప్రయాణాల్లో తమ జీవితాల్లో ఎండ్ చేసుకుంటున్నారు.

ప్రణాళికలతో హెచ్‌ఎండిఏ
అభివృద్ధి చేయాలి
బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్

నార్సింగి, డిసెంబర్ 18: ప్రజల అవసరాలకు అనుగుణంగా నగర ప్రణాళికలు ప్రభుత్వం చేయాలని బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. అదివారం సాయంత్రం నాంపల్లిలోని రాష్ట్ర బిజేపీ ప్రధాన కార్యాలయంలో హెచ్‌ఎండీఏ-బృహత్ ప్రణాళికలు, పాత హైదరాబాద్ నుంచి అంతర్జాతీయ నగర స్థాయికి ప్రస్థానం భారతీయ జనతా పార్టీ పాలసీ రీసర్చ్ సెల్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఎలాంటి ప్రణాళికలు లేకపోవడంతోనే నగరం ఈ దుస్థితికి చేరుకుందని గుర్తుచేశారు. ప్రభుత్వాల నిర్లక్షంతోనే నగరంలో ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాలే ఉన్నాయని తెలిపారు. దీంతో ఇటీవలే కురిసిన వర్షాలకు భారీ వరదలు వచ్చాయని తెలిపారు. ఈ వరదలతో నగరంలోని ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. ప్రభుత్వాలు మారుతున్నాయే కానీ నగర ప్రణాళికలలో మార్పులు రావడం లేదన్నారు. హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పక్కా ప్రణాళిక చేయాలని పేర్కొన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా నగరాన్ని వారి అవసరాలకు అనుగుణంగానే మార్చుకుంటున్నారని తెలిపారు. ప్రణాళికలో స్పష్టత ఉండాలన్నారు. అప్పుడే వేగవంతంగా నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ది చేయవచ్చన్నారు. ప్రభుత్వం ఆదాయం కోసం ఎల్‌ఆర్‌ఎస్, బిపిఎస్ ప్రవేశపెట్టిందన్నారు. నిజాయతీగా పనిచేస్తే నగరాన్ని ఎంతో అభివృద్ధి చేయవచ్చన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోకుండా తగు చర్యలు కూడా చేపట్టాలన్నారు. అందుకోసం కొన్ని చట్టాలు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని, ఆ ప్రణాళికల ద్వారా నగరాన్ని వేగవంతంగా అభివృద్ది చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. నగరాన్ని వంద రోజుల్లో రూపుమాపులు మారుస్తామని తెలుపడం భ్రమ అని అన్నారు. అందరు సమష్టిగా హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ది చేయాలని అయన పిలుపు నిచ్చారు. ఈకార్యక్రమంలో బిజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, దశమంత్‌రెడ్డి, సుబ్బారావు, విశ్వనాథ్, అనంతరావు, వివేక్‌తో పాటు బిజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.