భక్తి కథలు

యజ్ఞరూపములు పనులే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్మ శబ్దము ‘కృ’ ధాతువు వలన నిష్పన్నమైనది. కావున దానికి ‘చేయుట’ అని కాని, ‘నడవడి’ యని కాని, ‘వ్యాపార’మని కాని అర్ధము. ప్రాచీన వైదిక ధర్మానుసారముగా యజ్ఞ యాగాదికములే కర్మలు. త్రేతాయుగం, ద్వాపర యుగాల్లాంటివి వాటిలో తపస్సు, ధ్యానం అనేవి చేస్తేనే భగవంతుడు మోక్షాన్ని ఇస్తాడని అనేవారు. కాని నేడు కలియుగంలో కేవలం నామజపం చేస్తే చాలు భగవంతుడు పాపరాశిని దగ్ధం చేస్తాడు. పుణ్యఫలాలనిస్తాడు. కనుక ఈ నామ జపాన్ని ఒక యజ్ఞంలాగా చేయాలి. ఏ కర్మ చేసినా అది ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. అదే యజ్ఞంగా భావించాలి. నడవడినే కర్మ ధర్మాన్ని ఆచరిస్తూ ఉండడమే కర్మ చేయడం, సత్యాన్ని పలుకుతుండడమే కర్మ చేయడం, ఇవన్నీ కర్మలైనపుడు నిత్యమూ యజ్ఞంలో ఉన్నట్టే అవుతుంది కదా. అందుకే చేయంచేవాడు, చేసేవాడు భగవంతుడన్న నిజాన్ని మనసున ధరించి ఉంటేచాలు సర్వమూ యజ్ఞరూపమే అవుతుంది.
యజ్ఞము వలన వచ్చు ఫలములనే ఆ సాధనముల ఫలము అంతర్భూతములగును. సాధనములకు వేరుగా ఫలము లేదు. కాని యజ్ఞార్ధయై చేయబడిన కర్మలు స్వతంత్రములుగా ఫలదాయకముల గానున్నను యజ్ఞము చేతనే స్వర్గ ప్రాప్తియగును. యజ్ఞమను కర్మ పురుషార్ధములలో నొకటిగా పరిగణింపబడుతున్నది. కనుక కలియుగంలో చేసే పనులే కర్మలు అవే యజ్ఞరూపములుగా భాసించుచున్నవి.

- గాయత్రి