డైలీ సీరియల్

వ్యూహం-53

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాన్‌హోల్‌లోపల ఒకటే మురుగువాసన.
దోమలు పీకుతున్నాయి.
మొహానికి కప్పిన దుప్పటి తొలగించుకుని పెద్దగా కేకలు పెట్టింది. ఆమె అరుపులు, కేకలు ఎవరికీ విన్పించడంలేదు.
నడుం లోతువరకు మురుగునీళ్ళు ఉన్నాయి. చేతులు కిందకు చాపితే మురుగునీళ్ళు తగులుతాయి. మళ్లీ ఆ చేతుల్ని మొహం దగ్గర పెట్టుకోలేదు.
చేతులు పైకెత్తి మాన్‌హోల్ మూత నెట్టే ప్రయత్నం చేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా మూత కొంచెం కూడా కదలడంలేదు.
లోపలంతా కటికచీకటి.
రాత్రిపూట ఎవరూ అటువైపు రారు.
పగలు కూడా ఎవరూ గమనించకపోతే తన పరిస్థితి ఏమిటి? నీరసం వచ్చి మురుగునీళ్ళలో కుప్పలా కూలిపోయి ఊపిరి ఆడక చనిపోతుందేమో!
రాత్రంతా దుర్గంధాన్ని భరిస్తూ గడపాల్సిందే!
నిద్ర పట్టలేదు.
మెలకువతోనే రాత్రంతా గడిపింది.
మరుసటి రోజు ఉదయం మసక వెలుగు కన్పించింది.
అమ్మ దీవెన తనకు వుంటే తను బయటపడుతుంది.
... ఛానె్సస్ ఆర్ రిమోట్.. అవకాశం తక్కువ తను బయటపడటానికి.
క్వార్టర్ వెనుక వైపు పెద్ద నేరేడు చెట్టు వుంది.
తోటమాలి సయ్యద్ కూతురు ఫర్హానాకు నేరేడు కాయలంటే ఇష్టం. ఉదయం పూట వచ్చి చెట్టుమీద నుంచి కింద రాలిపడిన నేరేడు కాయలు ఏరుకుంటుంది. ఆ అమ్మాయి వచ్చి పండిన కాయలు ఏరుకుని గినె్నలో వేసుకుంటూ వుంది.
లోహితకు పైన ఎవరో తిరుగుతున్నట్లు శబ్దం విన్పించింది. ఆ అమ్మాయి విరిసిన రాయి వచ్చి మ్యాన్ హోల్ పైమూతమీద పడింది.
నేరేడు కాయలు ఏరుకోవడానికి ఫర్హానా వచ్చిందని అర్థం అయింది. కాయలు కింద రాలిపడటానికి రాళ్ళు విసురుతుంది ఆ పిల్ల.
పెద్దగా కేకలు పెట్టింది లోహిత.
ఫర్హానాకు కేకలు విన్పించలేదు.
ఏదో ఆలోచన మెరిసింది లోహిత మెదడులో. తలలో వున్న హెయిర్ పిన్ను తీసి పై మ్యాన్‌హోల్ పైన గట్టిగా గీసింది.
మ్యాన్‌హోల్ దగ్గరకు వచ్చిన ఆ అమ్మాయికి లోహిత మ్యాన్‌హోల్ మూతను గీకుతున్న శబ్దం విన్పించింది.
ఆఖరి ప్రయత్నం చేద్దామనుకుంటూ శక్తినంతా ఉపయోగించి పెద్దగా కేకలు పెట్టింది లోహిత.
మ్యాన్‌హోల్ లోపలినుంచి ఎవరో అరుస్తున్నారని అర్థం అయింది. మూతపై వున్న బండరాయిని నెట్టబోయిందిగాని ఆ అమ్మాయి వల్ల కాలేదు.
అప్పుడే రోడ్డుమీద సైకిల్‌మీద వెళ్తున్న సయ్యద్ కన్పించాడు.
పెద్దగా కేక వేసి తండ్రిని పిలిచింది.
వాళ్ళిద్దరూ మ్యాన్‌హోల్‌పై వున్న బండరాయిని అతి కష్టంమీద పక్కకు నెట్టి మూతను తీశారు.
లోపల వున్న లోహితను గుర్తించాడు సయ్యద్.
అతని చెయ్యి ఆసరాగా తీసుకొని బయటకు వచ్చేసింది. వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు చెప్పింది.
సయ్యద్ డ్యూటీకి వెళ్లిపోయాడు.
ఫర్హానాను హాల్లో కూర్చోబెట్టి బాత్‌రూముకు వెళ్లింది లోహిత. నాలుగైదుసార్లు సబ్బుతో వొంటిని రుద్దుకుంటేగానీ మురుగు వాసన పోలేదు. ప్రాణాలు దక్కేయి.. అంతే చాలు.. ఆ మురుగు వాసన పట్టించుకోలేదు.
బాడీ లోషన్ స్ప్రే చేసుకుని బట్టలు వేసుకుని ఫర్హానా దగ్గరకు వచ్చి ఆ అమ్మాయి బుగ్గలు ముద్దుపెట్టుకుంది.
‘‘్భగవంతుడే నిన్ను పంపించాడు.. లేకపోతే క్వార్టర్ వెనుకవైపు ఎవరూ వచ్చేవాళ్ళు కాదు.. ఆ మురుగునీళ్ళలో కుళ్లిపోయి చనిపోయి వుండేదాన్ని. నీకు మంచి సంబంధం చూసి, నీ పెళ్లికి అయ్యే ఖర్చు నేనే భరిస్తాను’’ అంది లోహిత ఫర్హానా చేతులు పట్టుకుని.
తన చేతిలోని నేరేడుకాయ లోహిత నోట్లో పెట్టింది ఫర్హానా.
***
ముఖ్యమైన అనుచరులతో హోటల్ ఆస్టోరియాలో సమావేశమయ్యారు అరిఫ్. హిందీలోనే వాళ్ళ సంభాషణలు సాగిపోతున్నాయి.
‘‘నేను సిటీ పోలీసు కమిషనర్‌తో మాట్లాడేటప్పుడు నువ్వు తెలుగులో ఎవరితోనో మాట్లాడుతున్నావ్? అతనెవరు?’’ అడిగాడు అరిఫ్ అరవింద్‌ను.
‘‘అతని గూర్చి ఇరవై నాలుగు గంటలు మాట్లాడుతూ వుంటారు. మన హాస్పిటల్ వ్యవహారాలు ఇనె్వస్టిగేట్ చేస్తున్నది అతనే! స్కంద, ఐపియస్’’ అన్నాడు అరవింద్.
‘‘ముందు నాకెందుకు చెప్పలేదు.. అదే స్పాట్‌లో షూట్ చేసి పారేసేవాడిని.. బాస్టర్డ్.. నీ అవివేకం మూలంగా తప్పించుకున్నాడు.. వాడు, గోయల్ క్లోజ్ ఫ్రెండ్స్! ఇద్దరినీ అదే స్పాట్‌లో కాల్చేసి జైల్లో కూర్చునేవాడిని.. డబ్బుఖర్చుపెట్టి మళ్లీ బెయిల్‌మీద బయటకు వచ్చేసేవాడిని’’ అన్నాడు అరిఫ్ ఆవేశంతో ఊగిపోతూ.
అరిఫ్ అనుచరులలో ఒకడు లేచి నిలబడ్డాడు.
‘‘బాంబులు పేలకముందు నేనో దృశ్యం చూశాను సార్.. పోలీసు వాహనాల వెనుక ఓ వ్యక్తి కూర్చుని మాటిమాటికి వాచీలో టైము చూసుకుంటున్నాడు. సంచిలోనుంచి చిన్న ఫ్లాక్సులో వున్న మెషిన్ బయటకు తీశాడు. దాని మూత మీద ఓ ఎర్రటి బటన్ వుంది.. గాఢంగా శ్వాస పీల్చి, టైము చూసుకుని, ఎర్ర బటన్ నొక్కాడు సార్... అతను చేస్తున్న పని వింతగా అన్పించి నా సెల్‌ఫోన్‌లో ఆ దృశ్యం రికార్డ్ చేసుకున్నాను.. బటన్ నొక్కిన మరుక్షణం పెద్ద శబ్దంతో భవనం టాప్‌లేచి ఎగిరిపడింది.

అలపర్తి రామకృష్ణ